Friday, 6 December 2013

Easy to Draw

Courtesy-Learn English

Foods You Must Avoid During Pregnancy.......

During pregnancy it is advisable to eat natural foods, but there are certain food groups you should avoid.

Avoid Seafood In Pregnancy

Seafood is a great source for Omega 3 which is beneficial for the baby. But you must avoid seafood with high mercury that can damage the baby's brain. Avoid shark, king mackerel, crabs, prawns and salmon - seafood contains mercury.

Avoid Undercooked Food In Pregnancy

It is important to avoid the consumption of raw and undercooked food. These foods may contain bacteria and viruses which can affect the mother and baby. Consume well cooked food and properly refrigerate food to avoid cross contamination.

Avoid Unpasteurised Food In Pregnancy

Unpasteurised food can contain food borne diseases. Hence avoid dairy products that are not properly pasteurised. You can consume mozzarella, cottage cheese and skim milk. But avoid cheese like feta and brie.

Avoid Unwashed Vegetables and Fruits In Pregnancy

It is important to cook food for consumption during pregnancy. Do not consume food that is not cooked, raw or under cooked. These foods may contain bacteria and germs that can impact you during pregnancy. Wash all food products thoroughly before you cook it.

Avoid Caffeine, Tea, Alcohol In Pregnancy

Completely avoid caffeine, tea and alcohol during pregnancy to prevent birth defects and complications. These three drinks can increase the risk of miscarriage.

Courtesy-Useful Info

ఫెంగ్ షూ : సంపద పెరిగే మార్గాలు

డబ్బు.. సంపద.. జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. వీటిని ఎలా అభివృద్ధి చేసు కోవాలో ఫెంగ్‌షూ సూత్రాలు చెబుతాయి. ఎప్పుడూ ధనాన్ని ఉంచే ప్రాంతాల్లో ఎలాంటి చెట్లను పెట్టుకోవాలో, ఎలాంటి రంగులను వాడాలో, ఎలాంటి ఫర్నిచర్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం సంపదకు, చెక్కకు సంబంధం ఉంది. కలప దొరకాలంటే నీరు, భూమి తప్పనిసరి. అందువల్ల ఈ మూడు శక్తులు సమతౌల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీని కోసం ధనాన్ని దాచుకొనే ప్రాంతాల సమీపంలో..
1) మనీప్లాంట్లు, వెదురు మొక్కలు, అలోవీరా వంటి మొక్కలను ఉంచాలి. అలోవీరాను ఉంచటం వల్ల గాలిలో ఉండే ప్రతికూల శక్తులు శుద్ధి అవుతాయి.
2) ఈ ప్రాంతంలో నీరు ఉండాలి. అందుకే చైనాలో చాలా షాపుల్లో క్యాష్ కౌంటర్ పక్కనే నీటితో ఉండే ఫౌంటెన్లు ఉంటాయి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే అందమైన సరస్సులు, జలపాతాలు, సముద్రం వంటి చిత్రాలను ఉంచవచ్చు.
3) ఈ ప్రాంతంలో ఉంచే ఫ్రేములు కాని ఫర్నిచర్ కాని చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారాలలో ఉండాలి. దీని వల్ల అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది.
4) నీటితో పాటు దట్టమైన చెట్లు, అడవులు ఉన్న చిత్రాలను కూడా ఉంచాలి. ఈ ప్రాంతానికి ఆకుపచ్చ లేదా నీలం రంగులు వేస్తే మంచిది. ఎక్కువ ఫెంగ్‌షూ శక్తి అవసరమని భావించేవారు ఎరుపు రంగు కూడా వేయవచ్చు.
5) లాఫింగ్ బుద్ధా, చైనీస్ వెల్త్ కాయిన్స్, ఫెంగ్‌షూ ఎక్వేరియం వంటివి ఈ ప్రాంతంలో ఉంచుకోవటం వల్ల ధనానికి సంబంధించిన అంశాల్లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి.
6) ఈ ప్రాంతంలో చెడువాసనలు రాకుండా సువాసనను ఇచ్చే పూలను, వాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను ఉంచాలి.
Courtesy-Andhrajyothy

భక్తితో ఆర్థిక విముక్తి!

Sakshi | Updated: December 06, 2013 00:33 (IST)
మావారికి చిన్న కిరాణా షాపు ఉంది. షాపు పెట్టుబడికి, అనారోగ్య కారణాలకి డైలీ ఫైనాన్స్ తీసుకుంటారు. పదివేలరూపాయల అప్పుకి తొమ్మిది వేల రూపాయలే చేతికిస్తారు. రోజుకి వంద రూపాయలు వాళ్లకి కట్టాలి. వంద రోజుల్లో అప్పు తీరిపోతుంది. కానీ... ఎప్పుడు చూసినా ఆ అప్పు అప్పుగానే ఉండిపోతోంది. బతుకంతా బ్యాంకు చుట్టే తిరుగుతోంది. దీని నుండి బయటపడటానికి నేను చేయగలిగింది ఏమైనా ఉందా?
 - సురక్ష కంతేటి, నిజామాబాద్


 జవాబు: శ్రీమతి అంటే సిరిని కల్పించే మతి ఉన్నవారని మిమ్మల్ని చూసి అనుకోవచ్చు. కేవలం ఇంటి పని, వంట పని చూసుకుని ఊరుకోకుండా... ఆర్థికభారం నుంచి మీ భర్తను తప్పించాలని చూడటం అభినందనీయం. మహిళలందరూ  ఇలా ఆర్థిక అంశాల మీద దృష్టిపెట్టినప్పుడే, కుటుంబం పదికాలాల పాటు పచ్చగా  ఉంటుందనడంలో  సందేహం లేదు.  ఇక మీవారిని అప్పుల నుండి బయటపడవేసే మార్గం చెప్తాను. ముందుగా మీవారు కట్టే డైలీ ఫైనాన్స్ లో ఎంత వడ్డీ కడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అక్షరాలా నూటికి ఏడు రూపాయల వడ్డీ కడుతున్నారు. 84 శాతం వడ్డీ కట్టేవాళ్లు ఎప్పటికీ కోలుకోరు. అది ముమ్మాటికీ నిజం. ముందు మీరేం చేస్తారంటే... వెంటనే ఒక మట్టి ముంత (కిడ్డీ బ్యాంక్) కొనండి. డైలీ ఫైనాన్స్ తీరేవరకూ రోజూ 50 రూపాయలు అందులో వేసుకోండి. ప్రస్తుత ఫైనాన్స్ తీరాక, రోజూ వేసుకొనే మొత్తాన్ని పెంచండి. కొద్ది రోజుల్లోనే మీరే మీవారికి వేల రూపాయలు ఇవ్వవచ్చు. ఆ కిడ్డీ బ్యాంక్‌ను దేవుడి పటం ముందు పెట్టి రోజూ డబ్బు వేస్తూ వెళ్లండి. అలా ఎందుకంటే... ఆర్థిక భారానికి భక్తి తోడైతే, మీ సిరిసంపదలు త్వరగా పెరుగుతాయి.

 - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు

అనుకున్నది సాధించింది అనూరాధ!

Sakshi | Updated: December 06, 2013 07:57 (IST)
సమాజంలో నెలకొన్న సమస్యల గురించి అందరికీ అవగాహన ఉంటుంది. వాటి పరిష్కార మార్గాల గురించి కూడా అందరికీ తెలుసు. అయితే అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే చొరవ మాత్రం చాలామందిలో ఉండ దు. అలాగే తమ వ్యక్తిగత పరిస్థితుల గురించి చెబుతూ సమాజాన్ని సంస్కరించేంత  ఓపిక, శక్తి తమకు లేవనే వారే ఎక్కువమంది కనిపిస్తుంటారు. అయితే సంస్కర్త హృదయానికి వ్యక్తిగత  సమస్యలతో, వయసు, ఆర్థికస్థాయులతో పని లేదని కొంతమంది నిరూపిస్తూ ఉంటారు. ఫలానా పని త మ స్థాయికి ఎక్కువ అనే భావన లేకుండా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల అనూరాధ బండారి.

 మూడు వందల జనాభా ఉన్న బొమ్మనల్లి గ్రామంలో ఆమె ఒక అనామకురాలు. ‘ఫలానా వారి అమ్మాయి, ఏదో చదువుకొంటోంది...’ అనే గుర్తింపు మాత్రమే ఉంది. అయితే ఆ చిన్నపిల్లకు పెద్దపెద్ద ఆశలున్నాయి. తమ గ్రామానికి నీటి కరవును తీర్చాలనే తపన వాటిలో ముఖ్యమైనది. అందుకే తనను అదరగొట్టి బెదరగొట్టే జనాల మధ్య అనూరాధ మౌనంగా ఉండిపోలేదు. పెద్దపెద్ద వాళ్లే మౌనంగా ఉన్నారు, నాకెందుకులే అనుకోలేదు. నీటిసమస్యను పరిష్కరించడం గురించి అధ్యయనం చేసింది. అందరి దాహాన్ని తీర్చే మార్గాన్ని వెదికింది.

పంచాయతీ కమిటీని దారికి తెచ్చింది!

ముందుగా తమ గ్రామ సమస్యను ఒక స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది అనూరాధ. వారు గ్రామస్థితిగతులు గమనించి ‘‘ఒక వాటర్ ట్యాంక్‌ను నిర్మిస్తే మీ ఊరి నీటికరువు తీరుతుంది. దానికి పంచాయతీ ద్వారా నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది’’ అని అనూరాధకు వివరించారు. అనూరాధలోని ఉత్సాహాన్ని చూసి ఆమెకు అండగా నిలబడ్డారు. వాటర్ ట్యాంక్ విషయంలో ఎవరెవరిని కలవాలనే దాని గురించి గెడైన్స్‌ను ఇచ్చారు. ఆ మాత్రం సాయం చాలనుకుంది అనూరాధ.

కొంత మంది ప్రభుత్వాధికారులను కలిసి తమ ఊరి పరిస్థితి గురించి వివరించింది. అయితే దాంతో పెద్దగా ప్రయోజనం కనపడలేదు. చివరకు పంచాయతీ పెద్దలపై ఒత్తిడి పెంచసాగింది. పదేపదే అర్జీలు ఇస్తూ వాటర్‌ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేయసాగింది. గ్రామపంచాయతీకి ఉన్న శక్తి సామర్థ్యాలతో ఊరిలో వాటర్‌ట్యాంక్‌ను కట్టించడం పెద్ద పనేం కాదని, అయినా పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులకు వివరించింది అనూరాధ. దీంతో గ్రామస్థుల్లో కదలిక వచ్చింది. అందరూ ఆమెతో స్వరం కలిపారు.

పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వీడి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పూనుకొన్నారు. రెండులక్షల రూపాయల నిధులతో నీటికరువును తీర్చారు. అనూరాధ  అంతటితో ఆగలేదు. ఆ గ్రామానికి పంచాయతీ ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ముందు తను అవగాహన తెచ్చుకుని, తర్వాత పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో బొమ్మనల్లి బతుకు చిత్రం మారిపోయింది. ఊరిలో వీధిదీపాలు వెలిగాయి, రోడ్ల నిర్మాణం జరిగింది.

ఆ విధంగా ఆ గ్రామాన్ని అనూరాధ మార్చేసింది. కనీస బాధ్యతలు నె రవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్న పంచాయతీ కమిటీని దారికి తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. లీడర్స్ యాక్సిలరేటింగ్ డెవలప్‌మెంట్(లీడ్) అనే జాతీయస్థాయి ఎన్జీవో అనూరాధను గ్రామాభివృద్ధి కోసం పాటు పడిన యువతిగా గుర్తించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా చేతుల మీదుగా అవార్డును ఇప్పించింది.

చొరవ అవసరం...

 ‘‘మన దేశంలో మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే వాటిని మనం ఉపయోగించుకోవడంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకొంటూ, వ్యవస్థను సరిదిద్దుకొంటూ సాగితే ఎలాంటి సమస్యా లేకుండా సాఫీగా జీవించడానికి అవకాశం ఉంది. నిర్లక్ష్యపూరిత వ్యవస్థను సరిదిద్దుకోవాలనే చొరవ అవసరం. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటే మంచిది...’’ అని అంటుంది అనూరాధ. తన ఊరిని ఆదర్శగ్రామంగా మార్చిన ఈ యువతి భావన కూడా ఆదర్శనీయమే!

 - జీవన్

 మన దేశంలో మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే వాటిని మనం ఉపయోగించుకోవడంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకొంటూ, వ్యవస్థను సరిదిద్దుకొంటూ సాగితే ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా జీవించడానికి అవకాశం ఉంది.
 - అనూరాధ

Plastic to fuel production

Courtesy-Eenadu

Sea Water to Electricity

Courtesy-Eenadu

Wednesday, 4 December 2013

Kiran Bedi on Security for women

Courtesy-Sakshi

Smart Shopping for Ladies

Courtesy-Sakshi

Womens Empowerment thro designing

Courtesy-Eenadu

పెళ్లికి … సౌందర్యరాశిగా మిలమిలా

పెళ్ళి… ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం.
అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం.
ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే… మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం.
      అందానికి మెరుగులు దిద్దే ప్రక్రియలో బ్యూటీ పార్లర్లు వెలసాయి. పల్లెల్లో కూడా కొందరు మహిళలు హౌస్ బ్యూటీషియన్లుగా తయారయ్యారు. అయితే.. ఎవరి సహాయం లేకపోయినా మీరు బ్యూటీగా తయారుకావచ్చు. బ్యూటీషియన్స్ అందుబాటులో లేరని ఏ మాత్రం చింతించవద్దు. కొద్దిపాటి ప్రణాళికతో సొంతంగా ఎవరిని వారే అందంగా తీర్చిదిద్దుకోవచ్చు సుమా! కావాలంటే చూడండి!
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో… సరైన వేళ పాటించడమూ అంతే అవసరం.
జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.
తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
        నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. ఎక్కడపడితే అక్కడి నీరు తాగనే కూడదు. మినరల్ వాటరయితే
ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతా కాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళాదుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
       శుభఘడియలు దగ్గరపడినకొద్దీ.. మీ తయారీ వేగమంతమవ్వాలి. వారం, పదిరోజులముందు వ్యాక్సింగ్ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ముందు రోజు చేయించుకోవడం అవసరం. పార్లర్లో బ్రైడల్ మేకప్ చేయించుకుంటున్నట్లైతే మీ పెళ్లి తేది, సమయం చెప్పి ముందుగానే కచ్చితంగా మాట్లాడుకోవాలి.
      ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజుల ముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భం కోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది.     అంటే.. రిహార్సల్ అన్నమాట.
             పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక, వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్…
      మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్ళనిండా కమ్మని కలలతో ఆనందకరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికే పెళ్ళికళ!
Courtesy-http://sevalive.com/mahila/?p=257

Self protection from strangers


Tuesday, 3 December 2013

Resons for Rapes

Courtesy-Eenadu

విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!

Sakshi | Updated: December 01, 2013 04:12 (IST)
విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!
  దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం!

 సాధారణంగా ఓ అమ్మాయికి 23 ఏళ్లొచ్చేసరికి ఏం చేస్తుంటుంది? సరదాగా కాలేజీకి వెళ్తూ చదువు కొనసాగిస్తుంటుంది! మరి అదే వయసులో ఓ మార్వాడి అమ్మాయి ఏం చేస్తుంటుంది..? సంప్రదాయబద్ధులారై పెళ్లి చేసుకుని తల్లి కూడా అవుతుంది. కానీ స్తుతి జలన్ ఆ వయసులో మిగతా అమ్మాయిల్లా పుస్తకాలతో కుస్తీ పట్టలేదు.. తోటి అమ్మాయిల్లా పిల్లల్ని కనే పనిలోనూ పడలేదు!

 ఏ అండా లేకుండానే, పెద్దగా పెట్టుబడి కూడా పెట్టకుండానే సొంతంగా కంపెనీ ఆరంభించింది! ఆపై ఎంతో శ్రమించి.. దాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి!

 ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజ్‌గంగపూర్ అనే చిన్న పట్టణంలో మార్వాడి కుటుంబానికి చెందిన స్తుతి జలన్.. తమ ఊర్లో సరైన పాఠశాలలు లేవని, తన అక్కతో కలిసి జైపూర్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. ఐతే చదువు మీద స్తుతికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో ఆమెకు దిగులు పట్టుకుంది. చదువు ఆపేస్తే తనకూ పెళ్లి చేసేస్తారని పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక.. మీడియా-కమ్యూనికేషన్‌తో పాటు కొన్ని కోర్సులు చేసింది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఐతే ఆ ఉద్యోగం ఆమెకు నచ్చలేదు. మరోవైపు పెళ్లి కోసం తల్లిదండ్రుల పోరు! ఈ పరిస్థితుల్లో ఓ నిర్ణయం స్తుతి జీవితాన్ని మలుపు తిప్పింది. అదే.. సొంతంగా క్రాస్‌హెయిర్స్ కమ్యూనికేషన్స్ అనే పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ ఆరంభించడం!

 వ్యాపారం ఎవరైనా ఆరంభిస్తారు.. కానీ ఆరంభంలో వచ్చే ఒడుదొడుకుల్ని తట్టుకుని, దాన్ని నిలబెట్టడంలోనే ఉంది గొప్పదనం! స్తుతి చేసిందదే. తన దగ్గర ఉన్న పొదుపు డబ్బులతో ముంబయిలో తన గురువు ప్రహ్లాద్ కక్కర్ కార్యాలయంలోనే ఓ వైపు టేబుల్ మీద కంప్యూటర్‌తో తన కంపెనీని మొదలెట్టింది స్తుతి. ఉద్యోగులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి తనూ శ్రమించింది. ఏడాది పాటు కష్టపడితే.. సొంతంగా మరో ఆఫీస్ తీసుకునేంత ఆదాయం సమకూరింది. కంపెనీ ఆరంభించిన తర్వాతి ఏడాది, అంటే 2002లో స్తుతికి ఓ పెద్ద ఈవెంట్ చేసే అవకాశం దక్కింది. అనురాధ అనే ఓ జిమ్ యజమాని.. అనాథ బాలల కోసం చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమం అది. దీన్నుంచి పెద్దగా డబ్బులేమీ రాలేదు కానీ.. స్తుతి పీఆర్ ఏజెన్సీకి మంచి పబ్లిసిటీ లభించింది. దీని తర్వాత ఈవెంట్లు వరుస కట్టాయి. ఫోస్టర్స్, యాక్స్ పల్స్ వంటి సంస్థలు ఆమెతో ఈవెంట్లు చేయించాయి. అందరిలా మామూలుగా ఈవెంట్లు చేయకుండా.. తన ప్రత్యేకత చూపించింది స్తుతి. తక్కువ ఖర్చుతో గ్రాండ్ ఈవెంట్లు చేయడం, కొత్తదనం చూపించడంతో ముంబయిలో ‘క్రాస్‌హెయిర్స్’కు మంచి పేరొచ్చింది. ఐతే ఆ సమయంలోనే పెళ్లి కావడం వల్ల స్తుతి ఢిల్లీకి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ మళ్లీ కొత్తగా ‘క్రాస్‌హెయిర్స్’ ప్రయాణం మొదలైంది. రెండు మూడేళ్ల తర్వాత అక్కడ కూడా పేరు తెచ్చుకున్న స్తుతి రెండు ప్రధాన నగరాల్లోనూ ‘క్రాస్‌హెయిర్స్’ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.

 ప్రస్తుతం క్రాస్‌హెయిర్స్‌కు ఢిల్లీ ఫ్యాషన్ వీక్, బ్రిటిష్ కౌన్సిల్, సత్యపాల్, సోనీ పిక్చర్స్, ప్రొవోగ్, నీతా లుల్లా, బకార్డి వంటి క్లైంట్లు సొంతం. 2011లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ గ్లోబల్ ఉమెన్స్ ప్రోగ్రాంలో నికోల్ కిడమన్, చెల్సియా క్లింటన్ వంటి ప్రముఖులతో కలిసి పాల్గొనే అవకాశం దక్కింది స్తుతికి. అంతే కాదు.. ఉమెన్ లీడర్స్ ఇండియా అవార్డ్స్‌లో ఆమెకు ‘బెస్ట్ యంగ్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్’ పురస్కారం కూడా దక్కింది. దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం!

అస్త్ర తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!

Sakshi | Updated: December 04, 2013 00:57 (IST)
అస్త్ర    తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!
 ఆఫీసు పని మీదో, వ్యక్తిగత పని మీదో... కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెళ్లేది బస్సులో అయినా, రైల్లో అయినా కానీ, జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. అందుకు ఏం చేయాలంటే...

  వాహనంలో ఆడవాళ్లు ఎవరూ లేకపోతే, వీలైనంతవరకూ వేరేదానిలో వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది. లేదంటే కనీసం మెయిన్‌డోరుకు దగ్గరలో ఉన్న సీట్లో కూర్చోవడం ఉత్తమం!

  కొందరు కావాలని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అస్సలు మాట్లాకుండా ఉండనక్కర్లేదు. ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు!

  నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, మీదోసారి ఇవ్వమని ఎవరైనా అడిగితే... నిర్మొహమాటంగా ‘నో’ అనండి. వాళ్లు మీ నంబర్ సేవ్ చేసుకుని తర్వాత విసిగించే ప్రమాదం ఉంది!

  ఎవరైనా ఏదైనా పెడితే తినవద్దు. వాళ్లు ఫీలవుతారు అనుకుంటే, అది మీరు తినకూడదనో, ఒంటికి పడదనో చెప్పి తప్పించుకోండి!

  రైలు కంపార్ట్‌మెంట్లో మీరొక్కరే ఆడవాళ్లయితే... బాగా పై బెర్తులోనే పడుకోండి. అలాగే టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్, ఏవైనా సేఫ్టీ వెపన్స్ ఉంటే వాటిని కూడా తప్పక తీసుకెళ్లండి!

  ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, మీమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనో లేక మిమ్మల్ని ఎక్కువగా పరిశీలిస్తున్నారనో అనుమానం వచ్చినా... రైలయితే కంపార్ట్‌మెంట్ మారండి. బస్సయితే సీటు మారండి. టీసీకో లేక బస్సు డ్రైవరుకో విషయం తప్పక చెప్పండి!

  వీలైనంతవరకూ నిద్రపోకుండా ఉండేందుకు ట్రై చేయండి. మరీ దూర ప్రయాణం అయితే ఎలాగూ తప్పదు కదా! అలాంటప్పుడు నిద్రపోయినా మరీ మొద్దు నిద్రపోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి!

Women Helping Hands

Courtesy-Eenadu

Homely Hair Beauty tips for women

Courtesy-Eenadu
 Courtesy-Sakshi

Complain about child marriages

Courtesy-Eenadu

Monday, 2 December 2013

Beautiful Crafts with Waste

Course-Eenadu

Benifits of Home Gardens

Courtesy-Eenadu

Tradition Rejuvenated thro Sarees

 Courtesy-Eenadu

స్వచ్ఛమైన మనసులకు ఆలంబన

Sakshi | Updated: December 03, 2013 05:03 (IST)
‘చదివిన చదువుకు సార్థ్ధకత చేకూరాలి. అలాగే చేసే పని మనసుకు సంతృప్తినివ్వాలి. మానసికంగా ఎదగని పిల్లలకు పాఠాలు చెబుతూ అందులోనే సంతృప్తిని వెదుక్కుంటున్నాను’ అంటున్నారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల బబిత. మానసికంగా ఎదగని, అలాగే చదువులో వెనకబడిన పిల్లల కోసం ‘శ్రేయా ఇన్‌స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్’ పేరుతో స్కూల్‌ను నడుపుతున్నారు బబిత. అదీ తన ఇంటి లోగిలిలోనే! ఫీజులతో నిమిత్తం లేకుండా సేవే పరమావధిగా సామాజిక వెలుగుకోసం నేనూ ఓ చిరుదివ్వెను వెలిగిస్తాను’ అంటున్న 35 ఏళ్ల బబిత ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే...  

 ఇంటింటికి వెళ్లి...

 ‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్‌ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు.

ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు....

మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను.

ఆటపాటలతో...

మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత.

Yoga for urineryinfections

Courtesy-Eenadu