Monday, 9 December 2013
Sunday, 8 December 2013
Friday, 6 December 2013
Foods You Must Avoid During Pregnancy.......
During pregnancy it is advisable to eat natural foods, but there are certain food groups you should avoid.
Avoid Seafood In Pregnancy
Seafood is a great source for Omega 3 which is beneficial for the baby. But you must avoid seafood with high mercury that can damage the baby's brain. Avoid shark, king mackerel, crabs, prawns and salmon - seafood contains mercury.
Avoid Undercooked Food In Pregnancy
It is important to avoid the consumption of raw and undercooked food. These foods may contain bacteria and viruses which can affect the mother and baby. Consume well cooked food and properly refrigerate food to avoid cross contamination.
Avoid Unpasteurised Food In Pregnancy
Unpasteurised food can contain food borne diseases. Hence avoid dairy products that are not properly pasteurised. You can consume mozzarella, cottage cheese and skim milk. But avoid cheese like feta and brie.
Avoid Unwashed Vegetables and Fruits In Pregnancy
It is important to cook food for consumption during pregnancy. Do not consume food that is not cooked, raw or under cooked. These foods may contain bacteria and germs that can impact you during pregnancy. Wash all food products thoroughly before you cook it.
Avoid Caffeine, Tea, Alcohol In Pregnancy
Completely avoid caffeine, tea and alcohol during pregnancy to prevent birth defects and complications. These three drinks can increase the risk of miscarriage.
Courtesy-Useful Info

ఫెంగ్ షూ : సంపద పెరిగే మార్గాలు
డబ్బు.. సంపద.. జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. వీటిని ఎలా అభివృద్ధి చేసు కోవాలో ఫెంగ్‌షూ సూత్రాలు చెబుతాయి. ఎప్పుడూ ధనాన్ని ఉంచే ప్రాంతాల్లో ఎలాంటి చెట్లను పెట్టుకోవాలో, ఎలాంటి రంగులను వాడాలో, ఎలాంటి ఫర్నిచర్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం సంపదకు, చెక్కకు సంబంధం ఉంది. కలప దొరకాలంటే నీరు, భూమి తప్పనిసరి. అందువల్ల ఈ మూడు శక్తులు సమతౌల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీని కోసం ధనాన్ని దాచుకొనే ప్రాంతాల సమీపంలో..
1) మనీప్లాంట్లు, వెదురు మొక్కలు, అలోవీరా వంటి మొక్కలను ఉంచాలి. అలోవీరాను ఉంచటం వల్ల గాలిలో ఉండే ప్రతికూల శక్తులు శుద్ధి అవుతాయి.
2) ఈ ప్రాంతంలో నీరు ఉండాలి. అందుకే చైనాలో చాలా షాపుల్లో క్యాష్ కౌంటర్ పక్కనే నీటితో ఉండే ఫౌంటెన్లు ఉంటాయి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే అందమైన సరస్సులు, జలపాతాలు, సముద్రం వంటి చిత్రాలను ఉంచవచ్చు.
3) ఈ ప్రాంతంలో ఉంచే ఫ్రేములు కాని ఫర్నిచర్ కాని చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారాలలో ఉండాలి. దీని వల్ల అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది.
4) నీటితో పాటు దట్టమైన చెట్లు, అడవులు ఉన్న చిత్రాలను కూడా ఉంచాలి. ఈ ప్రాంతానికి ఆకుపచ్చ లేదా నీలం రంగులు వేస్తే మంచిది. ఎక్కువ ఫెంగ్‌షూ శక్తి అవసరమని భావించేవారు ఎరుపు రంగు కూడా వేయవచ్చు.
5) లాఫింగ్ బుద్ధా, చైనీస్ వెల్త్ కాయిన్స్, ఫెంగ్‌షూ ఎక్వేరియం వంటివి ఈ ప్రాంతంలో ఉంచుకోవటం వల్ల ధనానికి సంబంధించిన అంశాల్లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి.
6) ఈ ప్రాంతంలో చెడువాసనలు రాకుండా సువాసనను ఇచ్చే పూలను, వాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను ఉంచాలి.
Courtesy-Andhrajyothy

భక్తితో ఆర్థిక విముక్తి!
- సురక్ష కంతేటి, నిజామాబాద్
జవాబు: శ్రీమతి అంటే సిరిని కల్పించే మతి ఉన్నవారని మిమ్మల్ని చూసి అనుకోవచ్చు. కేవలం ఇంటి పని, వంట పని చూసుకుని ఊరుకోకుండా... ఆర్థికభారం నుంచి మీ భర్తను తప్పించాలని చూడటం అభినందనీయం. మహిళలందరూ ఇలా ఆర్థిక అంశాల మీద దృష్టిపెట్టినప్పుడే, కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక మీవారిని అప్పుల నుండి బయటపడవేసే మార్గం చెప్తాను. ముందుగా మీవారు కట్టే డైలీ ఫైనాన్స్ లో ఎంత వడ్డీ కడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అక్షరాలా నూటికి ఏడు రూపాయల వడ్డీ కడుతున్నారు. 84 శాతం వడ్డీ కట్టేవాళ్లు ఎప్పటికీ కోలుకోరు. అది ముమ్మాటికీ నిజం. ముందు మీరేం చేస్తారంటే... వెంటనే ఒక మట్టి ముంత (కిడ్డీ బ్యాంక్) కొనండి. డైలీ ఫైనాన్స్ తీరేవరకూ రోజూ 50 రూపాయలు అందులో వేసుకోండి. ప్రస్తుత ఫైనాన్స్ తీరాక, రోజూ వేసుకొనే మొత్తాన్ని పెంచండి. కొద్ది రోజుల్లోనే మీరే మీవారికి వేల రూపాయలు ఇవ్వవచ్చు. ఆ కిడ్డీ బ్యాంక్‌ను దేవుడి పటం ముందు పెట్టి రోజూ డబ్బు వేస్తూ వెళ్లండి. అలా ఎందుకంటే... ఆర్థిక భారానికి భక్తి తోడైతే, మీ సిరిసంపదలు త్వరగా పెరుగుతాయి.
- వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు
అనుకున్నది సాధించింది అనూరాధ!
మూడు వందల జనాభా ఉన్న బొమ్మనల్లి గ్రామంలో ఆమె ఒక అనామకురాలు. ‘ఫలానా వారి అమ్మాయి, ఏదో చదువుకొంటోంది...’ అనే గుర్తింపు మాత్రమే ఉంది. అయితే ఆ చిన్నపిల్లకు పెద్దపెద్ద ఆశలున్నాయి. తమ గ్రామానికి నీటి కరవును తీర్చాలనే తపన వాటిలో ముఖ్యమైనది. అందుకే తనను అదరగొట్టి బెదరగొట్టే జనాల మధ్య అనూరాధ మౌనంగా ఉండిపోలేదు. పెద్దపెద్ద వాళ్లే మౌనంగా ఉన్నారు, నాకెందుకులే అనుకోలేదు. నీటిసమస్యను పరిష్కరించడం గురించి అధ్యయనం చేసింది. అందరి దాహాన్ని తీర్చే మార్గాన్ని వెదికింది.
పంచాయతీ కమిటీని దారికి తెచ్చింది!
ముందుగా తమ గ్రామ సమస్యను ఒక స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది అనూరాధ. వారు గ్రామస్థితిగతులు గమనించి ‘‘ఒక వాటర్ ట్యాంక్‌ను నిర్మిస్తే మీ ఊరి నీటికరువు తీరుతుంది. దానికి పంచాయతీ ద్వారా నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది’’ అని అనూరాధకు వివరించారు. అనూరాధలోని ఉత్సాహాన్ని చూసి ఆమెకు అండగా నిలబడ్డారు. వాటర్ ట్యాంక్ విషయంలో ఎవరెవరిని కలవాలనే దాని గురించి గెడైన్స్‌ను ఇచ్చారు. ఆ మాత్రం సాయం చాలనుకుంది అనూరాధ.
కొంత మంది ప్రభుత్వాధికారులను కలిసి తమ ఊరి పరిస్థితి గురించి వివరించింది. అయితే దాంతో పెద్దగా ప్రయోజనం కనపడలేదు. చివరకు పంచాయతీ పెద్దలపై ఒత్తిడి పెంచసాగింది. పదేపదే అర్జీలు ఇస్తూ వాటర్‌ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేయసాగింది. గ్రామపంచాయతీకి ఉన్న శక్తి సామర్థ్యాలతో ఊరిలో వాటర్‌ట్యాంక్‌ను కట్టించడం పెద్ద పనేం కాదని, అయినా పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులకు వివరించింది అనూరాధ. దీంతో గ్రామస్థుల్లో కదలిక వచ్చింది. అందరూ ఆమెతో స్వరం కలిపారు.
పంచాయతీ పెద్దలు నిర్లక్ష్యం వీడి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పూనుకొన్నారు. రెండులక్షల రూపాయల నిధులతో నీటికరువును తీర్చారు. అనూరాధ అంతటితో ఆగలేదు. ఆ గ్రామానికి పంచాయతీ ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంపై ముందు తను అవగాహన తెచ్చుకుని, తర్వాత పంచాయతీ పెద్దలపై ఒత్తిడి తీసుకు వచ్చింది. దీంతో బొమ్మనల్లి బతుకు చిత్రం మారిపోయింది. ఊరిలో వీధిదీపాలు వెలిగాయి, రోడ్ల నిర్మాణం జరిగింది.
ఆ విధంగా ఆ గ్రామాన్ని అనూరాధ మార్చేసింది. కనీస బాధ్యతలు నె రవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్న పంచాయతీ కమిటీని దారికి తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. లీడర్స్ యాక్సిలరేటింగ్ డెవలప్‌మెంట్(లీడ్) అనే జాతీయస్థాయి ఎన్జీవో అనూరాధను గ్రామాభివృద్ధి కోసం పాటు పడిన యువతిగా గుర్తించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా చేతుల మీదుగా అవార్డును ఇప్పించింది.
చొరవ అవసరం...
‘‘మన దేశంలో మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. అయితే వాటిని మనం ఉపయోగించుకోవడంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకొంటూ, వ్యవస్థను సరిదిద్దుకొంటూ సాగితే ఎలాంటి సమస్యా లేకుండా సాఫీగా జీవించడానికి అవకాశం ఉంది. నిర్లక్ష్యపూరిత వ్యవస్థను సరిదిద్దుకోవాలనే చొరవ అవసరం. అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటే మంచిది...’’ అని అంటుంది అనూరాధ. తన ఊరిని ఆదర్శగ్రామంగా మార్చిన ఈ యువతి భావన కూడా ఆదర్శనీయమే!
- జీవన్
- అనూరాధ
Wednesday, 4 December 2013
పెళ్లికి … సౌందర్యరాశిగా మిలమిలా
పెళ్ళి… ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైన ఘట్టం.
అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం.
ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే… మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం.
అందానికి
మెరుగులు దిద్దే ప్రక్రియలో బ్యూటీ పార్లర్లు వెలసాయి. పల్లెల్లో కూడా
కొందరు మహిళలు హౌస్ బ్యూటీషియన్లుగా తయారయ్యారు. అయితే.. ఎవరి సహాయం
లేకపోయినా మీరు బ్యూటీగా తయారుకావచ్చు. బ్యూటీషియన్స్ అందుబాటులో లేరని ఏ
మాత్రం చింతించవద్దు. కొద్దిపాటి ప్రణాళికతో సొంతంగా ఎవరిని వారే అందంగా
తీర్చిదిద్దుకోవచ్చు సుమా! కావాలంటే చూడండి!
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో… సరైన వేళ పాటించడమూ అంతే అవసరం.
జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.
తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
నీరు
పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ
వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. ఎక్కడపడితే అక్కడి నీరు తాగనే కూడదు.
మినరల్ వాటరయితే
ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతా కాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళాదుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
శుభఘడియలు
దగ్గరపడినకొద్దీ.. మీ తయారీ వేగమంతమవ్వాలి. వారం, పదిరోజులముందు
వ్యాక్సింగ్ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ పెళ్లి ముందు రోజు చేయించుకోవడం
అవసరం. పార్లర్లో బ్రైడల్ మేకప్ చేయించుకుంటున్నట్లైతే మీ పెళ్లి తేది,
సమయం చెప్పి ముందుగానే కచ్చితంగా మాట్లాడుకోవాలి.
ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజుల ముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భం కోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే.. రిహార్సల్ అన్నమాట.
పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక, వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్…
మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్ళనిండా కమ్మని కలలతో ఆనందకరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికే పెళ్ళికళ!
Courtesy-http://sevalive.com/mahila/?p=257
అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం.
ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే… మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివలు అందంగా, సౌందర్యరాశిగా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం.
పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో… సరైన వేళ పాటించడమూ అంతే అవసరం.
జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.
తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి.
ఫర్వాలేదు. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.మీ పెళ్ళి వేసవి కాలంలో జరుగుతున్నా, శీతా కాలంలో జరుగుతున్నా ఇతరత్రా పనులకు బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వెంట గొడుగు తప్పనిసరి. కళ్ళజోడు వాడటం అలవరచుకుంటే కళ్ళకు మంచిది. కాలానికి తగినట్టుగా మీరు బయట తిరిగేదానికి సౌకర్యమైన దుస్తులు ధరించాలి. పనులు ముగించుకుని ఇంటికి రాగానే మంచినీటితో ముఖం కడుక్కుని సేదదీరితే మీ శరీరానికి, మనసుకు హాయనిపిస్తుంది. మెదడుకు బాగా పని కలిగి అలసిపోయినవారు కళ్ళమీద చక్రాల్లా తరిగిన బంగాళాదుంప ముక్కలు కానీ, దోస ముక్కలు కాని పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది.
పెళ్ళికి నాలుగైదు వారాలముందే శిరోజాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మొదలెట్టాలి. కేశాలంకరణ ఎలా చేసుకుంటారో దానికి తగినట్టుగా మీ వెంట్రుకలను తీర్చిదిద్దుకోవాలి. హెయిర్ డ్రయ్యర్ వాడనే కూడదు. వారంలో ఒకటి రెండుసార్లు కండిషనర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఇంటి దగ్గర బంధువులో, స్నేహితులో పరిచయస్తులో చేస్తున్నట్లయితే రెండు మూడు రోజుల ముందే ఒకసారి మీకు ఎలాంటి మేకప్ నప్పుతుందో తెలుసుకోవాలి. రెండు రోజుల ముందు ఫేషియల్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సందర్భం కోసం కుట్టించుకున్న దుస్తులన్నీ ముందుగానే ఒకసారి వేసి చూసుకుంటే.. ఏమన్నా తేడాలుంటే.. సరిచేసుకోవడానికి వీలవుతుంది. అంటే.. రిహార్సల్ అన్నమాట.
పెళ్ళికి ఒకరోజు ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవాలి. పెళ్ళి దగ్గర్లోకి వచ్చాక కొత్తగా మేకప్ వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ వాడకండి. తేడా వస్తే కష్టం. ఇక, వీటన్నిటికీ ఫినిషింగ్ టచ్…
మనసారా నచ్చి చేసుకుంటూ.. కళ్ళనిండా కమ్మని కలలతో ఆనందకరమైన భవిష్యత్తుకు స్వాగతగీతం పలికే పెళ్ళికళ!
Courtesy-http://sevalive.com/mahila/?p=257
Tuesday, 3 December 2013
విజయం: స్తుతి... అందరమ్మాయిల్లా కాదు!

సాధారణంగా ఓ అమ్మాయికి 23 ఏళ్లొచ్చేసరికి ఏం చేస్తుంటుంది? సరదాగా కాలేజీకి వెళ్తూ చదువు కొనసాగిస్తుంటుంది! మరి అదే వయసులో ఓ మార్వాడి అమ్మాయి ఏం చేస్తుంటుంది..? సంప్రదాయబద్ధులారై పెళ్లి చేసుకుని తల్లి కూడా అవుతుంది. కానీ స్తుతి జలన్ ఆ వయసులో మిగతా అమ్మాయిల్లా పుస్తకాలతో కుస్తీ పట్టలేదు.. తోటి అమ్మాయిల్లా పిల్లల్ని కనే పనిలోనూ పడలేదు!
ఏ అండా లేకుండానే, పెద్దగా పెట్టుబడి కూడా పెట్టకుండానే సొంతంగా కంపెనీ ఆరంభించింది! ఆపై ఎంతో శ్రమించి.. దాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. ఆ కథేంటో తెలుసుకుందాం రండి!
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజ్‌గంగపూర్ అనే చిన్న పట్టణంలో మార్వాడి కుటుంబానికి చెందిన స్తుతి జలన్.. తమ ఊర్లో సరైన పాఠశాలలు లేవని, తన అక్కతో కలిసి జైపూర్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. ఐతే చదువు మీద స్తుతికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో ఆమెకు దిగులు పట్టుకుంది. చదువు ఆపేస్తే తనకూ పెళ్లి చేసేస్తారని పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక.. మీడియా-కమ్యూనికేషన్‌తో పాటు కొన్ని కోర్సులు చేసింది. తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఐతే ఆ ఉద్యోగం ఆమెకు నచ్చలేదు. మరోవైపు పెళ్లి కోసం తల్లిదండ్రుల పోరు! ఈ పరిస్థితుల్లో ఓ నిర్ణయం స్తుతి జీవితాన్ని మలుపు తిప్పింది. అదే.. సొంతంగా క్రాస్‌హెయిర్స్ కమ్యూనికేషన్స్ అనే పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ ఆరంభించడం!
వ్యాపారం ఎవరైనా ఆరంభిస్తారు.. కానీ ఆరంభంలో వచ్చే ఒడుదొడుకుల్ని తట్టుకుని, దాన్ని నిలబెట్టడంలోనే ఉంది గొప్పదనం! స్తుతి చేసిందదే. తన దగ్గర ఉన్న పొదుపు డబ్బులతో ముంబయిలో తన గురువు ప్రహ్లాద్ కక్కర్ కార్యాలయంలోనే ఓ వైపు టేబుల్ మీద కంప్యూటర్‌తో తన కంపెనీని మొదలెట్టింది స్తుతి. ఉద్యోగులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి తనూ శ్రమించింది. ఏడాది పాటు కష్టపడితే.. సొంతంగా మరో ఆఫీస్ తీసుకునేంత ఆదాయం సమకూరింది. కంపెనీ ఆరంభించిన తర్వాతి ఏడాది, అంటే 2002లో స్తుతికి ఓ పెద్ద ఈవెంట్ చేసే అవకాశం దక్కింది. అనురాధ అనే ఓ జిమ్ యజమాని.. అనాథ బాలల కోసం చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమం అది. దీన్నుంచి పెద్దగా డబ్బులేమీ రాలేదు కానీ.. స్తుతి పీఆర్ ఏజెన్సీకి మంచి పబ్లిసిటీ లభించింది. దీని తర్వాత ఈవెంట్లు వరుస కట్టాయి. ఫోస్టర్స్, యాక్స్ పల్స్ వంటి సంస్థలు ఆమెతో ఈవెంట్లు చేయించాయి. అందరిలా మామూలుగా ఈవెంట్లు చేయకుండా.. తన ప్రత్యేకత చూపించింది స్తుతి. తక్కువ ఖర్చుతో గ్రాండ్ ఈవెంట్లు చేయడం, కొత్తదనం చూపించడంతో ముంబయిలో ‘క్రాస్‌హెయిర్స్’కు మంచి పేరొచ్చింది. ఐతే ఆ సమయంలోనే పెళ్లి కావడం వల్ల స్తుతి ఢిల్లీకి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడ మళ్లీ కొత్తగా ‘క్రాస్‌హెయిర్స్’ ప్రయాణం మొదలైంది. రెండు మూడేళ్ల తర్వాత అక్కడ కూడా పేరు తెచ్చుకున్న స్తుతి రెండు ప్రధాన నగరాల్లోనూ ‘క్రాస్‌హెయిర్స్’ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.
ప్రస్తుతం క్రాస్‌హెయిర్స్‌కు ఢిల్లీ ఫ్యాషన్ వీక్, బ్రిటిష్ కౌన్సిల్, సత్యపాల్, సోనీ పిక్చర్స్, ప్రొవోగ్, నీతా లుల్లా, బకార్డి వంటి క్లైంట్లు సొంతం. 2011లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ గ్లోబల్ ఉమెన్స్ ప్రోగ్రాంలో నికోల్ కిడమన్, చెల్సియా క్లింటన్ వంటి ప్రముఖులతో కలిసి పాల్గొనే అవకాశం దక్కింది స్తుతికి. అంతే కాదు.. ఉమెన్ లీడర్స్ ఇండియా అవార్డ్స్‌లో ఆమెకు ‘బెస్ట్ యంగ్ ఉమన్ ఎంటర్‌ప్రెన్యూర్’ పురస్కారం కూడా దక్కింది. దేశవిదేశాల్లో మహిళా సాధికారతకు సంబంధించిన సెమెనార్లలో పాల్గొన్న స్తుతి తన కంపెనీని కేవలం మహిళా ఉద్యోగులతోనే నడిపిస్తుండటం విశేషం!
అస్త్ర తంత్ర : ఒంటరి ప్రయాణమా... జాగ్రత్త!

వాహనంలో ఆడవాళ్లు ఎవరూ లేకపోతే, వీలైనంతవరకూ వేరేదానిలో వెళ్లేందుకు ప్రయత్నించడం మంచిది. లేదంటే కనీసం మెయిన్‌డోరుకు దగ్గరలో ఉన్న సీట్లో కూర్చోవడం ఉత్తమం!
కొందరు కావాలని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. అస్సలు మాట్లాకుండా ఉండనక్కర్లేదు. ఆచితూచి మాట్లాడండి. వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు!
నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది, మీదోసారి ఇవ్వమని ఎవరైనా అడిగితే... నిర్మొహమాటంగా ‘నో’ అనండి. వాళ్లు మీ నంబర్ సేవ్ చేసుకుని తర్వాత విసిగించే ప్రమాదం ఉంది!
ఎవరైనా ఏదైనా పెడితే తినవద్దు. వాళ్లు ఫీలవుతారు అనుకుంటే, అది మీరు తినకూడదనో, ఒంటికి పడదనో చెప్పి తప్పించుకోండి!
రైలు కంపార్ట్‌మెంట్లో మీరొక్కరే ఆడవాళ్లయితే... బాగా పై బెర్తులోనే పడుకోండి. అలాగే టాయిలెట్‌కు వెళ్లినప్పుడు సెల్‌ఫోన్, ఏవైనా సేఫ్టీ వెపన్స్ ఉంటే వాటిని కూడా తప్పక తీసుకెళ్లండి!
ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినా, మీమీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనో లేక మిమ్మల్ని ఎక్కువగా పరిశీలిస్తున్నారనో అనుమానం వచ్చినా... రైలయితే కంపార్ట్‌మెంట్ మారండి. బస్సయితే సీటు మారండి. టీసీకో లేక బస్సు డ్రైవరుకో విషయం తప్పక చెప్పండి!
వీలైనంతవరకూ నిద్రపోకుండా ఉండేందుకు ట్రై చేయండి. మరీ దూర ప్రయాణం అయితే ఎలాగూ తప్పదు కదా! అలాంటప్పుడు నిద్రపోయినా మరీ మొద్దు నిద్రపోవడం అంత మంచిది కాదని గుర్తుంచుకోండి!
Monday, 2 December 2013
స్వచ్ఛమైన మనసులకు ఆలంబన
Sakshi | Updated: December 03, 2013 05:03 (IST)
ఇంటింటికి వెళ్లి...
‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్‌ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు.
ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు....
మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను.
ఆటపాటలతో...
మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత.
Thursday, 28 November 2013
Wednesday, 27 November 2013
మృదువైన అధరాలకు....!
పెదవులు అందంగా, మృదువుగా కనిపించేందుకు రసాయనాలతో పనిలేకుండా కొన్ని చిట్కాలున్నాయి.
- కొన్ని చుక్కల ఆలివ్ నూనెని పెదవులకు రాసి మృదువుగా రుద్దాలి.
- నిమ్మరసాన్ని ప్రతిరోజూ పెదవులపై మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
- బీట్‌రూట్ రసాన్ని పెదవులకి రాస్తుంటే పెదాలు ఎర్రగా మారడం ఖాయం.
- పంచదార పొడిలో వెన్న కలిపి పేస్ట్‌లా చేసి పెదవులపై సున్నితంగా మర్దనా చేయాలి.
- గులాబీ పూరేకుల్లో వెన్న వేసి మెత్తటి పేస్ట్ చేసి రాసుకుంటే పెదవులు అందంగా తయారవుతాయి.
ఫౌండేషన్ వాడుతున్నారా?
చలికాలం ఫౌండేషన్ కట్టిపెట్టడానికి ముఖ్యమైన కాలం. ఈ కాలం చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం దురద పెడుతుంది.
పొడిబారిన చర్మాన్ని మరింత ఇబ్బందిపెట్టకుండా వాతారణాన్ని తట్టుకునే విధంగా సరైన ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి.
లిక్విడ్ ఫౌండేషన్ మేలైన ఎంపిక. మాయిశ్చైరైజర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్, నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మం పొలుసులుగా అవదు. ఏ మేకప్‌వేసుకున్నా ముందుగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి.
చర్మతత్త్వం తెలుసుకుంటే ఎలాంటి ఉత్పత్తులు వాడాలో సులువుగా తెలుస్తుంది. అందుకని కాలానుగుణంగా వచ్చే చర్మసమస్యలకు వైద్యనిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు ఉత్పాదనలను ఎంచుకోవాలి.
పౌడర్ వాడటం వల్ల పొడిబారిన చర్మం పొరల్లోకి చేరి మరింత తేమను కోల్పోయేలా చేస్తుంది. పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఉన్నవాటిని ఎంచుకోవాలి.
లిక్విడ్ ఫౌండేషన్‌లో మాయిశ్చరైజర్స్, చర్మం పై తేమను ఉంచే సుగుణాలు ఉన్నాయా, లేవా అనేది ప్రొడక్ట్ లేబుల్‌పై చూసి ఎంచుకోవాలి.
ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం ఫెయిర్‌గా, మెడ నలుపుగా కనిపించే ప్రమాదం ఉంది.
ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం
=మరికొన్ని విధివిధానాలు ఖరారు
=నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ
ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు.
ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి.
వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి.
ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి.
పబ్లిక్ అడ్రస్‌సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి.
బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి.
పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి.
నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ
‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’.
నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?
మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు.
ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు.
ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్‌ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!
Tuesday, 26 November 2013
నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీ
'నిర్భయ' డాక్యుమెంటరీ
చట్టాలను కాగితాలకే పరిమితం చేస్తే ప్రయోజనం ఏముంది? వాటినే డాక్యుమెంటరీలుగా చూపిస్తే పదిమందికీ వెంటనే అర్థమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇలా ఆలోచించిన వరంగల్ జిల్లా డీఎస్పీ రమాదేవి 'నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీని రూపొందించారు.
ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' సంఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. ఏడాదిపాటు ఊరువాడ ఎక్కడ చూసినా ఇదే చర్చ. మహిళల భద్రత కోసం నిర్భయ పేరుతోనే చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. 'దాని ఫలితం గ్రామీణ స్థాయిలోని మహిళలందరికీ అవగాహన కలిగినప్పుడే' అంటున్నారు డీఎస్పీ రమాదేవి. ఈమె జిల్లా పోలీసు అధికారుల ప్రోత్సాహంతో 'నిర్భయ'చట్టం మీద అందరికీ సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ ప్రయత్నం వెనక ఒక విషాదముంది. వరంగల్ - ఖమ్మం పరిధిలోని ఒక నిరుపేద గిరిజన బాలికను వచించాడు ఒక ప్రబుద్ధుడు. ఫలితంగా ఆమె గర్భవతైంది. అతను అమ్మాయి శీలానికి వెల కట్టడమే కాదు, ఊరు వదిలి వెళ్లిపొమ్మన్నాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పటి వరంగల్ ఎస్పీ రాజేష్‌కుమార్ సంఘటనను సవాలుగా స్వీకరించి.. కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశించారు. బాధితురాలికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమ్మాయికి అండగా నిలబడింది డీఎస్పీ రమాదేవి. ఆమెకు వైద్యం చేయించి మనోస్థయిర్యాన్ని నింపింది. "ఆడపిల్లలంటే తల్లిదండ్రులకే కాదు. సమాజానికీ చిన్నచూపుంది. అది తొలగిపోవాలి. అందరిలోను చైతన్యం రావాలి. ముందుగా అమ్మాయిలందరూ తమకు రక్షణగా నిలిచే చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది'' అంటున్న రమాదేవి స్వయంగా నిర్భయ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్‌తో పాటు వాయిస్ఓవర్ కూడా ఇచ్చారు. స్థానిక కళాకారులైన ప్రియ, గీత, శ్వేత, షాలిని మొదలైనవారు నటించారు. బైరీ పూర్ణచందర్ దర్శకత్వంతోపాటు సంగీతాన్ని సమకూర్చారు. నర్సింహులపేట మండలం పెద్దముప్పారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి స్పాన్సర్‌గా వ్యవహరించారు.
మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చైతన్యాన్ని కలగజేయడం, కళాబృందాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి నేరాలపై అవగాహన కల్పించడం వంటివి చేస్తున్న రమాదేవి రూపొందించిన డాక్యుమెంటరీని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో, పల్లెటూళ్లలో ప్రదర్శిస్తున్నారు. డీఎస్పీ కాకముందు తొమ్మిదిసార్లు ఉత్తమ ఎంపీడీవోగా పురస్కారం అందుకున్న రమాదేవి పోలీసు రంగంలోనూ ప్రజల మన్ననలను పొందుతుండటం విశేషం.
- ఎనుబోతుల భాస్కర్, ఖమ్మం
"ప్రభుత్వం 'నిర్భయ' చట్టం తీసుకొచ్చినా పరిస్థితి తీవ్రతలో ఏమాత్రం మార్పు రావడం లేదు. బా«ధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేకపోవడం.. ఒకవేళ చెబితే తనవాళ్ల పరువు మంటగలుస్తుందన్న భయం.. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం.. వంటి కారణాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ తొలగించేందుకే డాక్యుమెంటరీని తీశాం. దీన్ని చూసిన ఎంతోమంది ఆడపిల్లలు నాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు''

ఉపవాసాలకో జ్యూస్‌ప్యాక్-A self employment model
రెండు రోజులు ఊడవకపోతే చాలు దుమ్ము పేరుకుపోయి చెత్తచెత్తగా తయారవుతుంది ఇల్లు. అలాగే రెండు రోజులు స్నానం చేయకపోతే కంపుకొడుతుంది ఒళ్లు. మరి శరీరాన్ని యేళ్ల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే... చిన్నా చితకా జబ్బులతో పాటు ప్రాణాంతక వ్యాధులు సైతం చుట్టుముడతాయి. ఇటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఏంచేయాలి? 'శరీరం లోపలి వ్యర్థాలను బయటికి పంపాలి (డీటాక్సిఫికేషన్). ఆ పనిలో మీకు సాయపడేందుకు సింధూర బుర్రా 'క్లీన్స్ హై' అనే జ్యూస్‌లతో తయారుగా ఉంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
"డీటాక్సిఫికేషన్‌ని సులువుగా వివరించాలంటే మన ఉపవాసం లాంటిదని చెప్పొచ్చు. శరీరంలోపల పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉపవాసం ఉన్న వాళ్లు ఆ రోజు ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోతారు. కాని ఇప్పుడున్న బిజీ యుగంలో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఇంట్లో ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అసలు కుదరదు కూడా. నీరసంతో పనికెళ్లలేరు. అందుకే చాలామంది ఉపవాసం ఆలోచననే దరిచేరనీయడం లేదు. అటువంటి వాళ్లకోసమే పోషకాలతో కూడిన ద్రవపదార్ధాలను తయారుచేసి అందిస్తున్నాను. వీటిని మీమీ కార్యాలయాలకు వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఆఫీసుకి సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండానే శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవచ్చు.
ఆలోచన ఎలా వచ్చిందంటే...
పై చదువులకోసం కాలిఫోర్నియా వెళ్లినప్పుడు అక్కడ నాకు ఈ డీటాక్సిఫికేషన్ గురించి తెలిసింది. న్యూట్రిషనిస్టు ఫ్రెండ్ ఒకావిడ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే నేను కూడా అందులో పాల్గొన్నాను. ఆ తర్వాత శరీరం చాలా తేలికగా ఉన్నట్టు అనిపించడమే కాక మనసు కూడా ఎంతో హాయిగా ఉంది. ఇదేదో బాగుందే అనుకుని ఆమె వద్ద శిక్షణ తీసుకున్నాను. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాక నా స్నేహితుల్లో చాలామంది రెస్టారెంట్లు తెరిచే ఆలోచనలు చేశారు. నాకు మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. అప్పుడే డీటాక్సిఫికేషన్ ఆలోచన తట్టింది. శరీరంలోపలికి వ్యర్థాలను చేర్చే అంశాలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. తీసుకునే ఆహారం, కాలుష్యపూరితమైన వాతావరణం, డిటర్జెంట్‌లు, సబ్బుల వంటివి. వాటిని బయటికి పంపే మార్గాన్ని నేనెందుకు ఎన్నుకోకూడదు అనిపించి వెంటనే కాలిఫోర్నియాలోని ఉన్న నా స్నేహితురాలిని సంప్రదించాను. తన గైడెన్స్‌తో 'జ్యూస్ ఫాస్టింగ్' ఉత్పత్తులు తయారుచేశాను.
ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్
డీటాక్సిఫికేషన్ ఒక రోజు టైంటేబుల్ ఎలా ఉంటుందంటే... ఉదయం ఏడున్నరకి నిమ్మ రుచి కలిగిన జ్యూస్‌తో మొదలవుతుంది. ఆ తరువాత తొమ్మిది గంటలకి గ్రీన్ జ్యూస్ (ఇందులో ప్రొటీన్లు ఉంటాయి.), పదిన్నరకి టీ, పన్నెండున్నరకి సూప్, రెండున్నరకి పళ్లరసం, ఐదు గంటలకి మళ్లీ గ్రీన్‌జ్యూస్, సాయంత్రం ఏడుగంటలకి నట్‌మిల్క్ (ప్రొటీన్‌లు కలిగిన), రాత్రి ఎనిమిది గంటలకి టీ. కరెక్టుగా అవే టైంలు కాకపోయినా మీ సౌలభ్యాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఎనిమిది జ్యూస్‌ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూనే ఉపవాసం చేస్తారన్నమాట. మామూలుగా అయితే శరీరం డీటాక్స్ కావడానికి మూడు రోజులు పడుతుంది. కాకపోతే మొదటిసారి ప్రయత్నించే వాళ్లు ఒక్కరోజే చేయాలి. అలవాటయ్యాక మూడు రోజులు చేయొచ్చు. ఈ ప్రక్రియను జీవితంలో ఒక భాగంలా అంటే రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు ఎలా చేసుకుంటారో అలా చేస్తే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా దరిచేరనీయకుండా జాగ్రత్తపడొచ్చు.
ఎవరు చేయొచ్చు?
ఇరవై నుంచి యాభై యేళ్ల వయసు వాళ్లు ఎవరైనా దీన్ని చేయొచ్చు. ఈ జ్యూస్‌ల్లో వాడే మసాలాలు, తేనె, కొన్ని వనమూలికలను మెక్సికో, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పిస్తాను. కూరగాయలు ఎలాగూ మన దగ్గరే లభిస్తాయి. వీటి తయారీలో ప్రిజర్వేటివ్‌లు గాని, ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు గాని వాడను. అందుకని వీటిని ఏ రోజుకి ఆ రోజే వాడాలి. అది కూడా రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచుకుని మాత్రమే వాడాలి. డీటాక్సిఫికేషన్‌ను అందరూ చేయొచ్చు కాని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్లు మాత్రం చేయకూడదు. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్లు కూడా చేయకూడదు. డయాబెటిక్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని తేనె, ఖర్జూరాలు వాడాను. అయినప్పటికీ వాళ్లు డాక్టర్లని సంప్రదించి చేయొచ్చు. ఒకవేళ ఇది చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఒక యాపిల్ లేదా గుడ్డు తినొచ్చు. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన వాళ్లు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారాక మాత్రమే డీటాక్సిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాకే జ్యూస్ ప్యాక్‌ను ఇస్తాను.
సిగ్నల్స్ అందుతాయి ఇలా...
డీటాక్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపేందుకు కొన్ని సంకేతాలు అందిస్తుంది మీ శరీరం. అవి... వట్టిగానే అలసిపోతుంటారు. బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉండి బుర్ర పనిచేయకుండా పోతుంది. శరీరంలో నొప్పులు, పోట్లు వస్తాయి. కంటికింద తిత్తులు ఏర్పడతాయి. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. జీర్ణం సరిగా కాకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడం, జలుబు, ఫ్లూ, పలు ఇన్ఫెక్షన్లు, శరీరమంతా సన్నగా ఉన్నా కడుపు ఉబ్బుగా ఉండడం, నెలసరిలో తేడాల వంటివి శరీరాన్ని శుభ్రపరచాలనేందుకు సంకేతాలన్నమాట. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే శుభ్రపరిచే ప్రక్రియ మొదలుపెట్టాల్సిందే. ఈ ఉపవాసం ద్వారా శరీరంలోపలి అవయవాలకి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలు అంది శరీరానికి నూతన శక్తి వస్తుంది.
ఉద్యోగులకి ఓ రోజు
ఏడాది కాలంగా ఈ ఉత్పత్తులను అమ్ముతున్నాను. శరీరంలో వ్యర్థాలను తొలగించుకోవాలన్న అవగాహన ఈ మధ్య యువతలో బాగా పెరిగింది. మా దగ్గరికి డాక్టర్లు, ఐటి కంపెనీల వాళ్లు ఎక్కువగా వస్తున్నారు. ఐటి కంపెనీల్లో ఉద్యోగులందరూ కలిసి 'డీటాక్సిఫికేషన్ డే' అని ప్రత్యేకంగా చేస్తున్నారు. ఒరాకిల్, డెలాయిట్, మహీంద్రా, యాహు కంపెనీల నుంచి గ్రూప్ క్లయింట్‌లు ఉన్నారు. ఇప్పటివరకు ఐదువందల మందికి పైగా ఈ ఉత్పత్తులని వినియోగించారు. నెలలో ఇరవై రోజులకి ఒకసారి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ చేస్తే మంచిది. ప్రతీవారం ఒక రోజు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. చాలామంది దీనివల్ల బరువు తగ్గుతామా అని అడుగుతారు. అది వారి వారి శరీరతత్వాలను బట్టి ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియ మాత్రమే ఇది. సెలవు పెట్టాల్సిన పనిలేకుండా, దినచర్య డిస్టర్బ్ కాకుండా శరీరాన్ని సరిచేసుకోవచ్చుననేది మాత్రమే నేను చెప్పేది.
పెళ్లి కూతుళ్ల సౌందర్యానికి...
ఇప్పటివరకు ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్ మాత్రమే ఉంది. పెద్దవాళ్లు చాలామంది రాత్రికి డిన్నర్ ఉండేలా ప్యాకేజి ఉంటే బాగుంటుందని అడిగారు. వాళ్లకోసం ఆరు జ్యూస్‌ల ప్యాక్ తయారుచేస్తున్నాను. దీని టైంటేబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రాత్రికి డిన్నర్ చేసేయొచ్చు. అలాగే పెళ్లికూతుళ్ల కోసం కూడా స్పెషల్ ప్యాకేజి ఒకటి రూపొందించే ఆలోచనలో ఉన్నాను. దీని తయారీలో డీటాక్సిఫికేషన్‌తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. డీటాక్సిఫికేషన్ జ్యూస్‌లు తయారుచేయడం మన దేశంలో ఇదే మొదలు. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇక్కడయినా, వేరే ప్రాంతానికయినా ఐస్ బ్యాగుల్లో ఉంచే రవాణా చేయాలి. త్వరలో బెంగళూరు, పూణేలో కూడా ' క్లీన్స్‌హై' యూనిట్లు ప్రారంభించబోతున్నాను'' అని చెప్పారామె.
- కిరణ్మయి

Monday, 25 November 2013
Subscribe to:
Posts (Atom)