Wednesday, 27 November 2013

Woman success in refrigirator business

Courtesy-Eenadu

మృదువైన అధరాలకు....!



పెదవులు అందంగా, మృదువుగా కనిపించేందుకు రసాయనాలతో పనిలేకుండా కొన్ని చిట్కాలున్నాయి.

- కొన్ని చుక్కల ఆలివ్ నూనెని పెదవులకు రాసి మృదువుగా రుద్దాలి.

- నిమ్మరసాన్ని ప్రతిరోజూ పెదవులపై మర్దనా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

- బీట్‌రూట్ రసాన్ని పెదవులకి రాస్తుంటే పెదాలు ఎర్రగా మారడం ఖాయం.

- పంచదార పొడిలో వెన్న కలిపి పేస్ట్‌లా చేసి పెదవులపై సున్నితంగా మర్దనా చేయాలి.

- గులాబీ పూరేకుల్లో వెన్న వేసి మెత్తటి పేస్ట్ చేసి రాసుకుంటే పెదవులు అందంగా తయారవుతాయి.

ఫౌండేషన్ వాడుతున్నారా?


Sakshi | Updated: November 28, 2013 01:31 (IST)
సీజన్ మారింది. మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వార్డ్‌రోబ్‌లో చలిని తట్టుకోవడానికి దుస్తులను ఎలా సెట్ చేసుకుంటారో అలాగే సౌందర్య ఉత్పాదనల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
   
 చలికాలం ఫౌండేషన్ కట్టిపెట్టడానికి ముఖ్యమైన కాలం. ఈ కాలం చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం దురద పెడుతుంది.

 పొడిబారిన చర్మాన్ని మరింత ఇబ్బందిపెట్టకుండా వాతారణాన్ని తట్టుకునే విధంగా సరైన ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి.

 లిక్విడ్ ఫౌండేషన్ మేలైన ఎంపిక. మాయిశ్చైరైజర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్, నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మం పొలుసులుగా అవదు. ఏ మేకప్‌వేసుకున్నా ముందుగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి.

  చర్మతత్త్వం తెలుసుకుంటే ఎలాంటి ఉత్పత్తులు వాడాలో సులువుగా తెలుస్తుంది. అందుకని కాలానుగుణంగా వచ్చే చర్మసమస్యలకు వైద్యనిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు ఉత్పాదనలను ఎంచుకోవాలి.

 వేసవిలో పౌడర్ వాడుతున్నాం కదా అని చలికాలంలోనూ ఉపయోగించడం సరైనది కాదు.

 పౌడర్ వాడటం వల్ల పొడిబారిన చర్మం పొరల్లోకి చేరి మరింత తేమను కోల్పోయేలా చేస్తుంది. పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఉన్నవాటిని ఎంచుకోవాలి.
   
 లిక్విడ్ ఫౌండేషన్‌లో మాయిశ్చరైజర్స్, చర్మం పై తేమను ఉంచే సుగుణాలు ఉన్నాయా, లేవా అనేది ప్రొడక్ట్ లేబుల్‌పై చూసి ఎంచుకోవాలి.

 ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం ఫెయిర్‌గా, మెడ నలుపుగా కనిపించే ప్రమాదం ఉంది.

ఏటీఎం సెంటర్లలో ప్యానిక్ అలారం


Sakshi | Updated: November 28, 2013 06:04 (IST)
 =తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న పోలీసులు
 =మరికొన్ని విధివిధానాలు ఖరారు
 =నెల రోజుల గడువిచ్చాం : కొత్వాల్ అనురాగ్ శర్మ


సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు ‘ఏటీఎం ఉదంతం’తోపాటు నగరంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద వరుసగా చోటు చేసుకుంటున్న చోరీలు, దోపిడీల నేపథ్యంలో ఏటీఎంల వద్ద భత్రతా చర్యలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో పాటు అదనపు కమిషనర్లు అంజనీ కుమార్ (శాంతిభద్రతలు), సందీప్ శాండిల్య (నేరాలు), సంయుక్త కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇందులో బ్యాంకు అధికారులకు పోలీసులు చేసిన సూచనలివీ...
   
 ఏటీఎం కేంద్రాల్లో ‘ప్యానిక్ అలారం’ ఏర్పాటు చేయాలి. లోపల ఉన్న వినియోగదారుడు ఏవైనా అనుమానాస్పద పరిణామం గమనిస్తే దీన్ని మోగిస్తే అంతా అప్రమత్తం అవుతారు.
   
 ఈ కేంద్రాలకు ముందు భాగంలో ఉండే అద్దాలు పూర్తి పాదర్శకంగా ఉండి, లోపల ఏం జరుగుతోందో బయటి వ్యక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలి.
   
 వీటి షట్టర్లు పటిష్టంగా ఉండటంతో పాటు సాధారణ వ్యక్తులు ఎప్పుడు పడితే అప్పుడు కిందికి లాగే అవకాశం లేకుండా ఏర్పాటు చేయాలి.
   
 ఏటీఎం కేంద్రం, బ్యాంకుల లోపల, బయట కచ్చితంగా సీసీ కెమెరా ఉండాలి. అది పూర్తి క్వాలిటీతో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే వారిని స్పష్టంగా చిత్రీకరించే దిశలో ఏర్పాటు చేయాలి.
   
 పబ్లిక్ అడ్రస్‌సిస్టం ఏర్పాటు చేసుకుని ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ అప్రమత్తం చేయాలి.
   
 బ్యాంకులతో పాటు ఏటీఎం కేంద్రాల వద్దా కచ్చితంగా సెక్యూరిటీ గార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరు సుశిక్షుతులై ఉండేలా చూడాలి.
   
 పోలీసు అధికారులు సైతం తమ పరిధిలోని బ్యాంకులను నిత్యం సందర్శిస్తూ అవసరమైన సహాయసహకారాలు, సూచనలు అందించాలి.

 నెల రోజుల గడువిచ్చాం : అనురాగ్ శర్మ

 ‘బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు నేరాల నివారణ కోసం బ్యాంకు అధికారులకు అనేక సూచనలు చేశాం. వీటిని కచ్చితంగా అమలు చేయాలని కోరాం. నెల రోజుల పాటు గడువు ఇచ్చాం. అప్పటి లోగా అమలు కాకుంటే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’.

నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?


Sakshi | Updated: November 28, 2013 01:20 (IST)
భోజనం ముగించి డైనింగ్ హాల్ నుంచి తన రూమ్‌కి వచ్చింది మీనా. రూమ్‌మేట్ సంధ్య కోసం హాస్టల్ మొత్తం వెతికింది. ఎక్కడా సంధ్య లేదు. కిందికి వచ్చి వాచ్‌మన్‌ని అడిగింది. ఆమె అసలు కిందికే రాలేదని చెప్పాడతను. తిరిగి పైకి వెళ్లిపోదామనుకుంటూండగా పెద్ద శబ్దం. ఓ గావుకేక. శబ్దం వచ్చిన వైపు చూసింది మీనా. రక్తపు మడుగులో సంధ్య! ఏడడుగుల హాస్టల్ భవనం మీద నుంచి దూకేసింది. పరుగు పరుగున స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది మీనా. కానీ అప్పటికే ఆమె ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది.

 హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీనా ద్వారా వెల్లడయింది. సంధ్య విజయనగరం జిల్లాలో ఓ చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చింది. తెలివైన పిల్ల. పీజీ చేసింది. కానీ వెనుకబడిన ప్రాంతానికి చెందినది కావడంతో కాస్త నాగరికత తెలియదంతే. చాలామంది అమ్మాయిల్లాగ సిటీకి అలవాటు పడలేకపోయింది. ఇక్కడి వాళ్లతో పోటీ పడలేకపోయింది. అంత యాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండలేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఓడిపోసాగింది. దాంతో తాను ఎందుకూ పనికిరానేమోనన్న న్యూనతను ఏర్పరచుకుంది. చివరికి అదే పెరిగి పెద్దదై ఆమె ప్రాణాలను తీసింది.

 మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు.

 ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి.  ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు.

 ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్‌ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!

Tuesday, 26 November 2013

Property rights to women at inlaws house

Courtesy-Sakshi

Post Graduation @ 13 years

Courtesy-Sakshi

Alert from strangers at ATMs

Courtesy-Sakshi

నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీ

'నిర్భయ' డాక్యుమెంటరీ
చట్టాలను కాగితాలకే పరిమితం చేస్తే ప్రయోజనం ఏముంది? వాటినే డాక్యుమెంటరీలుగా చూపిస్తే పదిమందికీ వెంటనే అర్థమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇలా ఆలోచించిన వరంగల్ జిల్లా డీఎస్పీ రమాదేవి 'నిర్భయ' చట్టం మీద డాక్యుమెంటరీని రూపొందించారు.

ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' సంఘటనను ఇప్పటికీ దేశం మరిచిపోలేదు. ఏడాదిపాటు ఊరువాడ ఎక్కడ చూసినా ఇదే చర్చ. మహిళల భద్రత కోసం నిర్భయ పేరుతోనే చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. 'దాని ఫలితం గ్రామీణ స్థాయిలోని మహిళలందరికీ అవగాహన కలిగినప్పుడే' అంటున్నారు డీఎస్పీ రమాదేవి. ఈమె జిల్లా పోలీసు అధికారుల ప్రోత్సాహంతో 'నిర్భయ'చట్టం మీద అందరికీ సులభంగా అర్థమయ్యేలా డాక్యుమెంటరీని రూపొందించారు.

ఈ ప్రయత్నం వెనక ఒక విషాదముంది. వరంగల్ - ఖమ్మం పరిధిలోని ఒక నిరుపేద గిరిజన బాలికను వచించాడు ఒక ప్రబుద్ధుడు. ఫలితంగా ఆమె గర్భవతైంది. అతను అమ్మాయి శీలానికి వెల కట్టడమే కాదు, ఊరు వదిలి వెళ్లిపొమ్మన్నాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పటి వరంగల్ ఎస్పీ రాజేష్‌కుమార్ సంఘటనను సవాలుగా స్వీకరించి.. కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశించారు. బాధితురాలికి తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అమ్మాయికి అండగా నిలబడింది డీఎస్పీ రమాదేవి. ఆమెకు వైద్యం చేయించి మనోస్థయిర్యాన్ని నింపింది. "ఆడపిల్లలంటే తల్లిదండ్రులకే కాదు. సమాజానికీ చిన్నచూపుంది. అది తొలగిపోవాలి. అందరిలోను చైతన్యం రావాలి. ముందుగా అమ్మాయిలందరూ తమకు రక్షణగా నిలిచే చట్టాల గురించి తెలుసుకుంటే మంచిది'' అంటున్న రమాదేవి స్వయంగా నిర్భయ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్‌తో పాటు వాయిస్ఓవర్ కూడా ఇచ్చారు. స్థానిక కళాకారులైన ప్రియ, గీత, శ్వేత, షాలిని మొదలైనవారు నటించారు. బైరీ పూర్ణచందర్ దర్శకత్వంతోపాటు సంగీతాన్ని సమకూర్చారు. నర్సింహులపేట మండలం పెద్దముప్పారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దీనికి స్పాన్సర్‌గా వ్యవహరించారు.

మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చైతన్యాన్ని కలగజేయడం, కళాబృందాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి నేరాలపై అవగాహన కల్పించడం వంటివి చేస్తున్న రమాదేవి రూపొందించిన డాక్యుమెంటరీని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో, పల్లెటూళ్లలో ప్రదర్శిస్తున్నారు. డీఎస్పీ కాకముందు తొమ్మిదిసార్లు ఉత్తమ ఎంపీడీవోగా పురస్కారం అందుకున్న రమాదేవి పోలీసు రంగంలోనూ ప్రజల మన్ననలను పొందుతుండటం విశేషం.
- ఎనుబోతుల భాస్కర్, ఖమ్మం

"ప్రభుత్వం 'నిర్భయ' చట్టం తీసుకొచ్చినా పరిస్థితి తీవ్రతలో ఏమాత్రం మార్పు రావడం లేదు. బా«ధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోలేకపోవడం.. ఒకవేళ చెబితే తనవాళ్ల పరువు మంటగలుస్తుందన్న భయం.. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం.. వంటి కారణాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ తొలగించేందుకే డాక్యుమెంటరీని తీశాం. దీన్ని చూసిన ఎంతోమంది ఆడపిల్లలు నాకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు''
Courtesy-Andhrajyothy

ఉపవాసాలకో జ్యూస్‌ప్యాక్-A self employment model

రెండు రోజులు ఊడవకపోతే చాలు దుమ్ము పేరుకుపోయి చెత్తచెత్తగా తయారవుతుంది ఇల్లు. అలాగే రెండు రోజులు స్నానం చేయకపోతే కంపుకొడుతుంది ఒళ్లు. మరి శరీరాన్ని యేళ్ల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే... చిన్నా చితకా జబ్బులతో పాటు ప్రాణాంతక వ్యాధులు సైతం చుట్టుముడతాయి. ఇటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఏంచేయాలి? 'శరీరం లోపలి వ్యర్థాలను బయటికి పంపాలి (డీటాక్సిఫికేషన్). ఆ పనిలో మీకు సాయపడేందుకు సింధూర బుర్రా 'క్లీన్స్ హై' అనే జ్యూస్‌లతో తయారుగా ఉంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

"డీటాక్సిఫికేషన్‌ని సులువుగా వివరించాలంటే మన ఉపవాసం లాంటిదని చెప్పొచ్చు. శరీరంలోపల పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉపవాసం ఉన్న వాళ్లు ఆ రోజు ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోతారు. కాని ఇప్పుడున్న బిజీ యుగంలో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఇంట్లో ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అసలు కుదరదు కూడా. నీరసంతో పనికెళ్లలేరు. అందుకే చాలామంది ఉపవాసం ఆలోచననే దరిచేరనీయడం లేదు. అటువంటి వాళ్లకోసమే పోషకాలతో కూడిన ద్రవపదార్ధాలను తయారుచేసి అందిస్తున్నాను. వీటిని మీమీ కార్యాలయాలకు వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఆఫీసుకి సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండానే శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవచ్చు.

ఆలోచన ఎలా వచ్చిందంటే...
పై చదువులకోసం కాలిఫోర్నియా వెళ్లినప్పుడు అక్కడ నాకు ఈ డీటాక్సిఫికేషన్ గురించి తెలిసింది. న్యూట్రిషనిస్టు ఫ్రెండ్ ఒకావిడ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే నేను కూడా అందులో పాల్గొన్నాను. ఆ తర్వాత శరీరం చాలా తేలికగా ఉన్నట్టు అనిపించడమే కాక మనసు కూడా ఎంతో హాయిగా ఉంది. ఇదేదో బాగుందే అనుకుని ఆమె వద్ద శిక్షణ తీసుకున్నాను. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాక నా స్నేహితుల్లో చాలామంది రెస్టారెంట్లు తెరిచే ఆలోచనలు చేశారు. నాకు మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. అప్పుడే డీటాక్సిఫికేషన్ ఆలోచన తట్టింది. శరీరంలోపలికి వ్యర్థాలను చేర్చే అంశాలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. తీసుకునే ఆహారం, కాలుష్యపూరితమైన వాతావరణం, డిటర్జెంట్‌లు, సబ్బుల వంటివి. వాటిని బయటికి పంపే మార్గాన్ని నేనెందుకు ఎన్నుకోకూడదు అనిపించి వెంటనే కాలిఫోర్నియాలోని ఉన్న నా స్నేహితురాలిని సంప్రదించాను. తన గైడెన్స్‌తో 'జ్యూస్ ఫాస్టింగ్' ఉత్పత్తులు తయారుచేశాను.

ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్
డీటాక్సిఫికేషన్ ఒక రోజు టైంటేబుల్ ఎలా ఉంటుందంటే... ఉదయం ఏడున్నరకి నిమ్మ రుచి కలిగిన జ్యూస్‌తో మొదలవుతుంది. ఆ తరువాత తొమ్మిది గంటలకి గ్రీన్ జ్యూస్ (ఇందులో ప్రొటీన్లు ఉంటాయి.), పదిన్నరకి టీ, పన్నెండున్నరకి సూప్, రెండున్నరకి పళ్లరసం, ఐదు గంటలకి మళ్లీ గ్రీన్‌జ్యూస్, సాయంత్రం ఏడుగంటలకి నట్‌మిల్క్ (ప్రొటీన్‌లు కలిగిన), రాత్రి ఎనిమిది గంటలకి టీ. కరెక్టుగా అవే టైంలు కాకపోయినా మీ సౌలభ్యాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఎనిమిది జ్యూస్‌ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూనే ఉపవాసం చేస్తారన్నమాట. మామూలుగా అయితే శరీరం డీటాక్స్ కావడానికి మూడు రోజులు పడుతుంది. కాకపోతే మొదటిసారి ప్రయత్నించే వాళ్లు ఒక్కరోజే చేయాలి. అలవాటయ్యాక మూడు రోజులు చేయొచ్చు. ఈ ప్రక్రియను జీవితంలో ఒక భాగంలా అంటే రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు ఎలా చేసుకుంటారో అలా చేస్తే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా దరిచేరనీయకుండా జాగ్రత్తపడొచ్చు.

ఎవరు చేయొచ్చు?
ఇరవై నుంచి యాభై యేళ్ల వయసు వాళ్లు ఎవరైనా దీన్ని చేయొచ్చు. ఈ జ్యూస్‌ల్లో వాడే మసాలాలు, తేనె, కొన్ని వనమూలికలను మెక్సికో, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పిస్తాను. కూరగాయలు ఎలాగూ మన దగ్గరే లభిస్తాయి. వీటి తయారీలో ప్రిజర్వేటివ్‌లు గాని, ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు గాని వాడను. అందుకని వీటిని ఏ రోజుకి ఆ రోజే వాడాలి. అది కూడా రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచుకుని మాత్రమే వాడాలి. డీటాక్సిఫికేషన్‌ను అందరూ చేయొచ్చు కాని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్లు మాత్రం చేయకూడదు. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్లు కూడా చేయకూడదు. డయాబెటిక్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని తేనె, ఖర్జూరాలు వాడాను. అయినప్పటికీ వాళ్లు డాక్టర్లని సంప్రదించి చేయొచ్చు. ఒకవేళ ఇది చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఒక యాపిల్ లేదా గుడ్డు తినొచ్చు. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన వాళ్లు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారాక మాత్రమే డీటాక్సిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాకే జ్యూస్ ప్యాక్‌ను ఇస్తాను.

సిగ్నల్స్ అందుతాయి ఇలా...
డీటాక్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపేందుకు కొన్ని సంకేతాలు అందిస్తుంది మీ శరీరం. అవి... వట్టిగానే అలసిపోతుంటారు. బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉండి బుర్ర పనిచేయకుండా పోతుంది. శరీరంలో నొప్పులు, పోట్లు వస్తాయి. కంటికింద తిత్తులు ఏర్పడతాయి. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. జీర్ణం సరిగా కాకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడం, జలుబు, ఫ్లూ, పలు ఇన్ఫెక్షన్లు, శరీరమంతా సన్నగా ఉన్నా కడుపు ఉబ్బుగా ఉండడం, నెలసరిలో తేడాల వంటివి శరీరాన్ని శుభ్రపరచాలనేందుకు సంకేతాలన్నమాట. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే శుభ్రపరిచే ప్రక్రియ మొదలుపెట్టాల్సిందే. ఈ ఉపవాసం ద్వారా శరీరంలోపలి అవయవాలకి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలు అంది శరీరానికి నూతన శక్తి వస్తుంది.

ఉద్యోగులకి ఓ రోజు
ఏడాది కాలంగా ఈ ఉత్పత్తులను అమ్ముతున్నాను. శరీరంలో వ్యర్థాలను తొలగించుకోవాలన్న అవగాహన ఈ మధ్య యువతలో బాగా పెరిగింది. మా దగ్గరికి డాక్టర్లు, ఐటి కంపెనీల వాళ్లు ఎక్కువగా వస్తున్నారు. ఐటి కంపెనీల్లో ఉద్యోగులందరూ కలిసి 'డీటాక్సిఫికేషన్ డే' అని ప్రత్యేకంగా చేస్తున్నారు. ఒరాకిల్, డెలాయిట్, మహీంద్రా, యాహు కంపెనీల నుంచి గ్రూప్ క్లయింట్‌లు ఉన్నారు. ఇప్పటివరకు ఐదువందల మందికి పైగా ఈ ఉత్పత్తులని వినియోగించారు. నెలలో ఇరవై రోజులకి ఒకసారి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ చేస్తే మంచిది. ప్రతీవారం ఒక రోజు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. చాలామంది దీనివల్ల బరువు తగ్గుతామా అని అడుగుతారు. అది వారి వారి శరీరతత్వాలను బట్టి ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియ మాత్రమే ఇది. సెలవు పెట్టాల్సిన పనిలేకుండా, దినచర్య డిస్టర్బ్ కాకుండా శరీరాన్ని సరిచేసుకోవచ్చుననేది మాత్రమే నేను చెప్పేది.

పెళ్లి కూతుళ్ల సౌందర్యానికి...
ఇప్పటివరకు ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్ మాత్రమే ఉంది. పెద్దవాళ్లు చాలామంది రాత్రికి డిన్నర్ ఉండేలా ప్యాకేజి ఉంటే బాగుంటుందని అడిగారు. వాళ్లకోసం ఆరు జ్యూస్‌ల ప్యాక్ తయారుచేస్తున్నాను. దీని టైంటేబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రాత్రికి డిన్నర్ చేసేయొచ్చు. అలాగే పెళ్లికూతుళ్ల కోసం కూడా స్పెషల్ ప్యాకేజి ఒకటి రూపొందించే ఆలోచనలో ఉన్నాను. దీని తయారీలో డీటాక్సిఫికేషన్‌తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. డీటాక్సిఫికేషన్ జ్యూస్‌లు తయారుచేయడం మన దేశంలో ఇదే మొదలు. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇక్కడయినా, వేరే ప్రాంతానికయినా ఐస్ బ్యాగుల్లో ఉంచే రవాణా చేయాలి. త్వరలో బెంగళూరు, పూణేలో కూడా ' క్లీన్స్‌హై' యూనిట్లు ప్రారంభించబోతున్నాను'' అని చెప్పారామె.
- కిరణ్మయి
Courtesy-Andhrajyothy

Monday, 25 November 2013

Profession thro Paper Art

Courtesy-Eenadu

Bangaru thalli for girl child protection


Courtesy-Eenadu

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించే చర్యలు

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించే ఉద్దేశంతో రూపొందించిన ఈ మార్గదర్శక సూత్రాల్లో ఏముందో తెలుసుకుందాం..
లైంగిక వేధింపులంటే ఏమిటి?
1) శరీరాన్ని ముట్టుకోవడం, ముట్టుకోవటానికి ప్రయత్నించటం
2) లైంగికపరంగా తృప్తి పరచాలని కోరటం లేదా డిమాండ్ చేయటం
3) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం
4) అశ్లీలమైన చిత్రాలు, వీడియోలు (పోర్నోగ్రఫీ) చూపించడం.
5) లైంగిక భావాలను మాటలు లేదా చేతలు లేదా సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించటం.
సంస్థలు ఏం చేయాలి?
ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని సంస్థలు లైంగిక వేధింపులను అరికట్టడానికి ఈ కింది చర్యలు తీసుకోవాలి.
ఎ) లైంగిక వేధింపులంటే ఏమిటనే విషయాలను పనిచేసే వారందరికి తెలియపరచాలి.
బి) ఒక వేళ ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకొనే విధంగా నిబంధనలను రూపొందించాలి.
సి) ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) యాక్ట్, 1946లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉండేలా తగిన మార్పులు చేయాలి.
డి) పని ప్రదేశంలో మహిళలకు సరైన వాతావరణం ఉండాలి. పనివేళలు, విరామ సమయం, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలలో మహిళల పట్ల వివక్ష చూపించకూడదు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండాలి.
క్రిమినల్ చర్యలు
ఎవరైనా ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడితే భారతీయ శిక్షాస్మృతిలో అధికరణల కింద అతనిపై యజమాని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతే కాకుండా ఫిర్యాదు చేయటం వల్ల వివక్షకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా యజమానిపైనే ఉంటుంది. లైంగిక వేధింపులకు గురయిన వారు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయమని అడిగే హక్కు కూడా కల్పించాలి.
క్రమశిక్షణ చర్యలు
సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే యజమాని క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలి
ఫిర్యాదు ప్రక్రియ
ఒక మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే .. దానిని పరిష్కరించటానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యజమానిపై ఉంది. ఈ వ్యవస్థ నిర్ణీత కాలపరిమితిలో సిబ్బంది చేసిన ఫిర్యాదులను పరిష్కరించాలి.
ఫిర్యాదుల కమిటీ
జూ ఈ కమిటీలో సగానికిపైగా మహిళలు ఉండాలి. దీనికి ఒక మహిళ నేతృత్వం వహించాలి. ఉన్నత స్థాయిలో ఒత్తిడి లేకుండా చూడటానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కాని ఈ అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తను కాని కమిటీలో సభ్యురాలిగా నియమించాలి.
జూ తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాము తీసుకున్న చర్యలపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించాలి.
సిబ్బంది వైపు నుంచి..
సిబ్బంది జరుపుకొనే మీటింగ్‌లలో లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలను లేవనెత్తనివ్వాలి.
లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలి. నిబంధనలన్నింటినీ సిబ్బందికి తెలియజేయాలి.
ఇతరుల నుంచి..
ఇతరుల చేతిలో తమ సిబ్బంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వెంటనే యజమాని చర్యలు తీసుకోవాలి.
Courtesy-andhrajyothy
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించే ఉద్దేశంతో రూపొందించిన ఈ మార్గదర్శక సూత్రాల్లో ఏముందో తెలుసుకుందాం..
లైంగిక వేధింపులంటే ఏమిటి?
1) శరీరాన్ని ముట్టుకోవడం, ముట్టుకోవటానికి ప్రయత్నించటం
2) లైంగికపరంగా తృప్తి పరచాలని కోరటం లేదా డిమాండ్ చేయటం
3) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం
4) అశ్లీలమైన చిత్రాలు, వీడియోలు (పోర్నోగ్రఫీ) చూపించడం.
5) లైంగిక భావాలను మాటలు లేదా చేతలు లేదా సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించటం.
సంస్థలు ఏం చేయాలి?
ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని సంస్థలు లైంగిక వేధింపులను అరికట్టడానికి ఈ కింది చర్యలు తీసుకోవాలి.
ఎ) లైంగిక వేధింపులంటే ఏమిటనే విషయాలను పనిచేసే వారందరికి తెలియపరచాలి.
బి) ఒక వేళ ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకొనే విధంగా నిబంధనలను రూపొందించాలి.
సి) ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) యాక్ట్, 1946లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉండేలా తగిన మార్పులు చేయాలి.
డి) పని ప్రదేశంలో మహిళలకు సరైన వాతావరణం ఉండాలి. పనివేళలు, విరామ సమయం, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలలో మహిళల పట్ల వివక్ష చూపించకూడదు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండాలి.
క్రిమినల్ చర్యలు
ఎవరైనా ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడితే భారతీయ శిక్షాస్మృతిలో అధికరణల కింద అతనిపై యజమాని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతే కాకుండా ఫిర్యాదు చేయటం వల్ల వివక్షకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా యజమానిపైనే ఉంటుంది. లైంగిక వేధింపులకు గురయిన వారు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయమని అడిగే హక్కు కూడా కల్పించాలి.
క్రమశిక్షణ చర్యలు
సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే యజమాని క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలి
ఫిర్యాదు ప్రక్రియ
ఒక మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే .. దానిని పరిష్కరించటానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యజమానిపై ఉంది. ఈ వ్యవస్థ నిర్ణీత కాలపరిమితిలో సిబ్బంది చేసిన ఫిర్యాదులను పరిష్కరించాలి.
ఫిర్యాదుల కమిటీ
జూ ఈ కమిటీలో సగానికిపైగా మహిళలు ఉండాలి. దీనికి ఒక మహిళ నేతృత్వం వహించాలి. ఉన్నత స్థాయిలో ఒత్తిడి లేకుండా చూడటానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కాని ఈ అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తను కాని కమిటీలో సభ్యురాలిగా నియమించాలి.
జూ తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాము తీసుకున్న చర్యలపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించాలి.
సిబ్బంది వైపు నుంచి..
సిబ్బంది జరుపుకొనే మీటింగ్‌లలో లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలను లేవనెత్తనివ్వాలి.
లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలి. నిబంధనలన్నింటినీ సిబ్బందికి తెలియజేయాలి.
ఇతరుల నుంచి..
ఇతరుల చేతిలో తమ సిబ్బంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వెంటనే యజమాని చర్యలు తీసుకోవాలి. - See more at: http://www.andhrajyothy.com/node/33237#sthash.pAasWQOI.dpuf
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించే ఉద్దేశంతో రూపొందించిన ఈ మార్గదర్శక సూత్రాల్లో ఏముందో తెలుసుకుందాం..
లైంగిక వేధింపులంటే ఏమిటి?
1) శరీరాన్ని ముట్టుకోవడం, ముట్టుకోవటానికి ప్రయత్నించటం
2) లైంగికపరంగా తృప్తి పరచాలని కోరటం లేదా డిమాండ్ చేయటం
3) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం
4) అశ్లీలమైన చిత్రాలు, వీడియోలు (పోర్నోగ్రఫీ) చూపించడం.
5) లైంగిక భావాలను మాటలు లేదా చేతలు లేదా సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించటం.
సంస్థలు ఏం చేయాలి?
ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని సంస్థలు లైంగిక వేధింపులను అరికట్టడానికి ఈ కింది చర్యలు తీసుకోవాలి.
ఎ) లైంగిక వేధింపులంటే ఏమిటనే విషయాలను పనిచేసే వారందరికి తెలియపరచాలి.
బి) ఒక వేళ ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకొనే విధంగా నిబంధనలను రూపొందించాలి.
సి) ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) యాక్ట్, 1946లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉండేలా తగిన మార్పులు చేయాలి.
డి) పని ప్రదేశంలో మహిళలకు సరైన వాతావరణం ఉండాలి. పనివేళలు, విరామ సమయం, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలలో మహిళల పట్ల వివక్ష చూపించకూడదు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండాలి.
క్రిమినల్ చర్యలు
ఎవరైనా ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడితే భారతీయ శిక్షాస్మృతిలో అధికరణల కింద అతనిపై యజమాని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతే కాకుండా ఫిర్యాదు చేయటం వల్ల వివక్షకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా యజమానిపైనే ఉంటుంది. లైంగిక వేధింపులకు గురయిన వారు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయమని అడిగే హక్కు కూడా కల్పించాలి.
క్రమశిక్షణ చర్యలు
సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే యజమాని క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలి
ఫిర్యాదు ప్రక్రియ
ఒక మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే .. దానిని పరిష్కరించటానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యజమానిపై ఉంది. ఈ వ్యవస్థ నిర్ణీత కాలపరిమితిలో సిబ్బంది చేసిన ఫిర్యాదులను పరిష్కరించాలి.
ఫిర్యాదుల కమిటీ
జూ ఈ కమిటీలో సగానికిపైగా మహిళలు ఉండాలి. దీనికి ఒక మహిళ నేతృత్వం వహించాలి. ఉన్నత స్థాయిలో ఒత్తిడి లేకుండా చూడటానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కాని ఈ అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తను కాని కమిటీలో సభ్యురాలిగా నియమించాలి.
జూ తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాము తీసుకున్న చర్యలపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించాలి.
సిబ్బంది వైపు నుంచి..
సిబ్బంది జరుపుకొనే మీటింగ్‌లలో లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలను లేవనెత్తనివ్వాలి.
లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలి. నిబంధనలన్నింటినీ సిబ్బందికి తెలియజేయాలి.
ఇతరుల నుంచి..
ఇతరుల చేతిలో తమ సిబ్బంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వెంటనే యజమాని చర్యలు తీసుకోవాలి. - See more at: http://www.andhrajyothy.com/node/33237#sthash.pAasWQOI.dpuf

'నిర్భయ' తర్వాత...లైంగిక అత్యాచారాల చట్టంలో మార్పులు

దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసు తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం లైంగిక అత్యాచారాల చట్టంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇవి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల లైంగిక అత్యాచారాల కేసుల్లో కఠినమైన శిక్షలు విధించే అవకాశం కలిగింది. వీటిలో కొన్ని ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం..

- 376, 377- ఇలా భారత శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లలో మార్పులు జరిగాయి. శిక్షలు మరింత కఠినతరమయ్యాయి.
- లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. గతంలో ఎప్పుడైనా ఈ తరహా నేరాలకు పాల్పడితే వారికి మరణశిక్ష కూడా విధించవచ్చు.
- మహిళల వెంటపడి పదేపదే వేధించటం, రహస్యంగా వారి జీవితాలలోకి చొరబడటం(వోయరిజం) వంటి నేరాలను తీవ్రంగా పరిగణిస్తారు. మొదటి సారి ఈ తరహా నేరం చేస్తే అది బెయిలబుల్ నేరమే. రెండో సారి నుంచి అది నాన్‌బెయిలబుల్ నేరంగా మారుతుంది.
- యాసిడ్ దాడులు చేసేవారికి కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
- స్వచ్ఛందంగా లైంగిక చర్యకు అంగీకరించటానికి తగిన వయస్సును 18ఏళ్లుగా ఈ చట్టం నిర్దేశించింది. ఇంత కన్నా తక్కువ వయస్సు ఉన్న స్త్రీతో లైంగిక చర్యలో పాల్గొంటే దానిని అత్యాచారంగా పరిగణిస్తారు.
Courtesy-andhrajyothy
 Courtesy-EEnadu

గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?

Sakshi | Updated: November 22, 2013 05:39 (IST)
 నాకిప్పుడు ఆరోనెల నడుస్తోంది. మావారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను. గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా? నాకు కాస్త వివరంగా చెప్పండి.
 - సుచిత్ర, హైదరాబాద్

ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్‌ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం  తీసుకోవాలి.

గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్‌లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్‌లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.

 ఇక రెండో ట్రైమిస్టర్‌లో తల్లి ఆరోగ్య పరిస్థితి, బిడ్డకు సంబంధించిన వివరాలు (స్కానింగ్ రిపోర్టులు) అన్నీ బాగా ఉంటే, అటువంటి వారు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి బిడ్డ పుట్టాక, చిన్నారి సపర్యలతో చాలాకాలం వరకు ఎటూ కదలడానికి, వెళ్లడానికి  వీలుకాదు కాబట్టి ఒకవేళ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే రెండో ట్రైమిస్టర్ అన్నది చాలా సౌకర్యవంతమైన సమయం అనుకోవచ్చు. అయితే దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి.

 మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి తాము ప్రసూతి ప్లాన్ చేసుకున్న చోటికి వచ్చి ఉండటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా మొదలవుతాయో తెలియదు. పైగా ఒక్కోసారి అకస్మాత్తుగా ఉమ్మనీరు బయటకు చిమ్మడం వంటివి కూడా కనిపించవచ్చు. అందుకే 34 వారాల తర్వాత ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోకుండా, తాము ప్రసూతి కావాలనుకున్న చోటే ఉండటం మంచిది.

 ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్‌లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని అడుగుతుంటారు. కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్‌లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా కార్ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటి వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. ఇక కార్ నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ సీట్ బెల్ట్‌ను సౌకర్యంగా పొట్ట కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి.

 ఇక విమాన ప్రయాణం చేసేవారు తాము ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటున్నారో, వారిని సంప్రదించాలి. ఎందుకంటే కంపెనీని బట్టి వారు ప్రెగ్నెన్సీలో ఏ సమయం వరకు ప్రయాణాన్ని అనుమతిస్తారో, ఆ సమయం వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఒకవేళ విమాన ప్రయాణం అన్నది ఆరు గంటల కంటే ఎక్కువగా కొనసాగాల్సి వస్తే మాత్రం... ప్రతి రెండు గంటలకొకసారి ఫ్లైట్‌లోనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిరగాలి. ఇక ఎనిమిది గంటలకు పైగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తే మాత్రం విధిగా స్టాకింగ్స్ ధరించాలి. దీనివల్ల కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని నివారించవచ్చు.

ఒకవేళ 8 నుంచి 10 గంటలకు పైగా విదేశాలకు వెళ్లడం వంటి దూరప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే... ప్రయాణానికి ముందే తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అవసరాన్ని బట్టి రక్తం గడ్డకట్టకుండా నివారించే ఇంజెక్షన్స్ (థ్రాంబోప్రొఫిలాక్టిక్ ఇంజెక్షన్స్) ఇచ్చి, ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఇక గర్భవతులు విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు విధిగా తమ డాక్టర్‌నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ / ట్రావెల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకుపోవడం మరచిపోవద్దు.

 ఇక మీ విషయానికి వస్తే... మీ రిపోర్టులన్నీ బాగున్నాయి కాబట్టి... ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో కనీసం ఆరు నెలల పాటు ఎటూ వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఈ సమయంలో మీరు నిరభ్యంతరంగా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.

 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,  ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్

గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?

Sakshi | Updated: November 22, 2013 05:39 (IST)
గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?
 నాకిప్పుడు ఆరోనెల నడుస్తోంది. మావారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను. గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా? నాకు కాస్త వివరంగా చెప్పండి.
 - సుచిత్ర, హైదరాబాద్

ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్‌ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం  తీసుకోవాలి.

గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్‌లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్‌లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.

 ఇక రెండో ట్రైమిస్టర్‌లో తల్లి ఆరోగ్య పరిస్థితి, బిడ్డకు సంబంధించిన వివరాలు (స్కానింగ్ రిపోర్టులు) అన్నీ బాగా ఉంటే, అటువంటి వారు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి బిడ్డ పుట్టాక, చిన్నారి సపర్యలతో చాలాకాలం వరకు ఎటూ కదలడానికి, వెళ్లడానికి  వీలుకాదు కాబట్టి ఒకవేళ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే రెండో ట్రైమిస్టర్ అన్నది చాలా సౌకర్యవంతమైన సమయం అనుకోవచ్చు. అయితే దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి.

 మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి తాము ప్రసూతి ప్లాన్ చేసుకున్న చోటికి వచ్చి ఉండటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా మొదలవుతాయో తెలియదు. పైగా ఒక్కోసారి అకస్మాత్తుగా ఉమ్మనీరు బయటకు చిమ్మడం వంటివి కూడా కనిపించవచ్చు. అందుకే 34 వారాల తర్వాత ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోకుండా, తాము ప్రసూతి కావాలనుకున్న చోటే ఉండటం మంచిది.

 ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్‌లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని అడుగుతుంటారు. కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్‌లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా కార్ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటి వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. ఇక కార్ నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ సీట్ బెల్ట్‌ను సౌకర్యంగా పొట్ట కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి.

 ఇక విమాన ప్రయాణం చేసేవారు తాము ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటున్నారో, వారిని సంప్రదించాలి. ఎందుకంటే కంపెనీని బట్టి వారు ప్రెగ్నెన్సీలో ఏ సమయం వరకు ప్రయాణాన్ని అనుమతిస్తారో, ఆ సమయం వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఒకవేళ విమాన ప్రయాణం అన్నది ఆరు గంటల కంటే ఎక్కువగా కొనసాగాల్సి వస్తే మాత్రం... ప్రతి రెండు గంటలకొకసారి ఫ్లైట్‌లోనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిరగాలి. ఇక ఎనిమిది గంటలకు పైగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తే మాత్రం విధిగా స్టాకింగ్స్ ధరించాలి. దీనివల్ల కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని నివారించవచ్చు.

ఒకవేళ 8 నుంచి 10 గంటలకు పైగా విదేశాలకు వెళ్లడం వంటి దూరప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే... ప్రయాణానికి ముందే తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అవసరాన్ని బట్టి రక్తం గడ్డకట్టకుండా నివారించే ఇంజెక్షన్స్ (థ్రాంబోప్రొఫిలాక్టిక్ ఇంజెక్షన్స్) ఇచ్చి, ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఇక గర్భవతులు విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు విధిగా తమ డాక్టర్‌నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ / ట్రావెల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకుపోవడం మరచిపోవద్దు.

 ఇక మీ విషయానికి వస్తే... మీ రిపోర్టులన్నీ బాగున్నాయి కాబట్టి... ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో కనీసం ఆరు నెలల పాటు ఎటూ వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఈ సమయంలో మీరు నిరభ్యంతరంగా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.

 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,  ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్

వంటగదిలో వేలాడే మినీ ఉద్యానవనం

Sakshi | Updated: November 22, 2013 05:36 (IST)
 వెయ్యి చదరపు గజాల్లో ఇల్లు... మధ్య తరగతి బడ్జెట్‌కి అదే స్వర్గసీమ. ఈ స్వర్గసీమలో వంటగది కేటాయింపు పదిశాతానికి లోపే ఉంటుంది. స్టవ్, గ్యాస్ సిలిండర్, మిక్సీ, గ్రైండర్, రైస్ కుకర్, అవెన్‌లు నిర్మొహమాటంగా వాటికి కావల్సినంత జాగాను ఆక్రమించుకుంటాయి. ఇక వంటకు కావల్సిన దినుసులు, వండాల్సిన పాత్రలు, వడ్డించాల్సిన రొటీన్ డిన్నర్‌సెట్‌లు...

అన్నీ ఇక్కడే. గోడలను అంగుళం కూడా వదలకుండా షెల్ఫులతో నింపేస్తే ఆ అరల్లో వంటదినుసులు వగైరాలన్నీ సర్దుకుంటాయి. కానీ వండడానికి వాడే పాత్రలకు ఎన్ని అరలున్నా సరిపోయినట్లు అనిపించదు. ఇక్కడ కనిపిస్తున్న పాట్ హ్యాంగర్‌లను చూస్తే... వంటగదిలోకి వెళ్తున్నట్లు కాక, వంటపాత్రలను అమ్మే దుకాణంలోకి అడుగు పెడుతున్నట్లు ఉంది. కానీ ఈ అమరిక వంటగదికి సౌకర్యంగానే ఉంటుంది. ఊయలలూగే రాక్‌లతో మరో ఉపయోగం కూడా ఉంది. కడిగిన వెంటనే పాత్రలను యథాతథంగా ఈ హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు.

శుభ్రం చేసిన పాత్రలను తేమ ఆరేవరకు నిల్వ చేసే జల్లెడలాంటి బౌల్ అవసరం ఉండదు. వేళ్లాడే ఉద్యానవనాలను రోజూ చూడడం ఎలాగూ సాధ్యం కాదు. పాట్ హ్యాంగర్‌లకే చక్కటి మనీప్లాంట్ తీగ అల్లించుకుంటే వేలాడే మినీ ఉద్యానవనం మీ వంటగదిలోనే పెరుగుతుంది మరి!

స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం

Sakshi | Updated: November 22, 2013 05:31 (IST)
ఏ అమ్మాయీ తనకై  తాను ఇల్లొదిలి వచ్చేయదు.
 ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
 ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
 ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
 ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
 మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
 తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
 కానీ ఇలాంటి అమ్మాయికి...
 దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
 తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
 కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు.
 ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి.
 అయితే జయశ్రీ భయపడలేదు.
 ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు.
 ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని...
 పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది.
 వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే... ఈవారం జనహితం.


తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్‌లోని ‘స్వధార్‌హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్‌ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్‌ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు.

 ‘ప్రకృతి’ నీడలో...

 సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్‌ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

‘‘స్వధార్ హోమ్‌లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్‌లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్‌జీవోని నడుపుతున్నారు.

 ఆశ్రయంతో పాటు...

 ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్‌కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది.

అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్‌కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్‌లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్‌కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ.

 చదువు... ఉపాధి...

 స్వధార్ హోమ్‌లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్‌లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం.

  ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్‌లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్‌కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్‌కి రప్పించుకుని, స్కూల్‌లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్‌ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ.

 ఆ హోమ్‌కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం.

 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు: ఎస్. ఎస్ ఠాగూర్

Thursday, 21 November 2013

ఆకర్షణీయమైన ముఖం కోసం 'ఫేస్ యోగా'

మన శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ముఖం. మనకో ప్రత్యేక గుర్తింపును ఇచ్చే ముఖాన్ని యోగా ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్ని 'ఫేస్ యోగా' అంటారు. రోజుకో పది నిమిషాలు కేటాయిస్తే ముఖం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. వయసును పట్టిచ్చే గీతలు, ముడతలు, నల్లమచ్చలు మాయమవుతాయి.
చెవులు : రెండు చేతుల బొటనవే ళ్లు, చూపుడు వేళ్లతో రెండు చెవులను పైనుంచి కింద వరకు, కింద నుంచి పైవరకు మసాజ్ చెయ్యాలి. తర్వాత చూపుడు వేలితో చెవి లోపల, వెనకాల మసాజ్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి తలనొప్పికి ఉపశమనం కలుగుతుంది.
కనుబొమలు : బొటనవేలితో కనుబొమల కింద భాగాన్ని పైకి లేపుతూ చూపుడువేలితో వాటి పైభాగాన్ని మసాజ్ చెయ్యాలి. ఇలా పదిసార్లు చెయ్యడం వల్ల కళ్ల చుట్టూ నల్లచారలు, ముడతలు ఏర్పడవు.
ముక్కు : చూపుడువేలితో ముక్కుపై భాగంలో ఉన్న ఎముకను పైకి నొక్కాలి. ఇలా రోజుకు పదిసార్లు చెయ్యడం వల్ల సైనస్ సమస్య తగ్గుతుంది.
దవడ పై ఎముక : చూపుడు వేలితో బుగ్గల పైభాగంలో ఉన్న ఎముకను గట్టిగా నొక్కాలి.
గడ్డం : బొటనవేలితో గట్టిగా ఒత్తుతూ పైకి లేపాలి.
పెదవులు : పెదవులు మూసి ఉంచే సాగదీస్తూ నవ్వాలి. ఇలా రోజుకు పదిసార్లు చెయ్యడం వల్ల బుగ్గలు మెరుస్తూ అందంగా తయారవుతాయి.
ఓంకారం : ఓంకారంలో అ, ఉ, మ అక్షరాలుంటాయి. పెదవులు బాగా తెరచి 'అ'కారం, పెదవులు సున్నాలా పెట్టి 'ఉ'కారం, పెదవులు మూసి 'మ'కార శబ్దం చెయ్యాలి. దీనివల్ల ముఖంలో ముడతలు త గ్గుతాయి.
Courtesy-andhrajyothy

మహిళకూ రిటైర్‌మెంట్ ప్లాన్ అవసరమే!

Sakshi | Updated: November 22, 2013 05:33 (IST)
 నాకు ఆరు నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటూ ఓ స్వంత ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్ అవసరాలు, రెండేళ్లలో పెళ్లి, అయిదేళ్లలో ఇల్లు, 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులు, రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్... వీటికోసం ఏ పొదుపు మార్గాలున్నాయి. ఎక్కువ రిస్కు భరించలేను.
 - రాగలలిత, హైదరాబాద్


 రెండేళ్లలో పెళ్లి పెట్టుకుంటున్నారంటే బ్యాంకులో ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమ మార్గం. ఎందుకంటే స్వల్పకాలానికి మీరు మార్కెట్లోకి వెళ్లడం మంచిది కాదు. మీ జీతం వచ్చే బ్యాంకులో స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసిస్తే, బ్యాంక్ కంప్యూటర్లే ఆ మొత్తాన్ని బదిలీ చేస్తాయి. ఇక మీరు ఐదేళ్లలో ఇల్లు కొనాలంటే చేతిలో డౌన్‌పేమెంట్ కొంతకావాలి. ఆర్.డి.ద్వారా వచ్చే వడ్డీ హోమ్‌లోన్ స్వల్పతేడాతోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పట్నుంచే దానికోసం కూడా ఆర్.డి. చేసుకోవడం మంచిది. ఇందులో చక్రవడ్డీ పరంగా చూస్తే హోమ్‌లోన్‌కు కట్టే వడ్డీ మీకు గిట్టుబాటు అయినట్లే.

 ఇక 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులకి ప్లాన్ చేయాలనుకుంటే మదుపు అవకాశాలు పెరుగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సొమ్ము దాచుకోవచ్చు. ఇది పన్ను రహితం. మీ ఆదాయంలో కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ పెట్టొచ్చు. ప్రతినెలా సిప్ మార్గంలో సొమ్ము దాచుకుంటూ పోతే దీర్ఘకాలానికి రిస్క్ పోయి మదుపు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి పిల్లల చదువులకు ఈ రెండు మార్గాలు ఉత్తమమైనవి.

 ఇక 35 ఏళ్ల తర్వాత రిటైర్‌మెంట్ గురించి మీరు ఆలోచించడం అభినందనీయం. మీ వయసు ఇంకా తక్కువే కాబట్టి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్ మార్కెట్‌పై అవగాహన వచ్చేవరకు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. సుదీర్ఘ భవిష్యత్‌లో మార్కెట్ భారీగా వృద్ధి చెందే అవకాశం ఉన్నవి మార్కెట్, రియల్ ఎస్టేట్... ఈ రెండే. వీటిలో పెట్టుబడి మంచిదే.

Role model in changing society

Courtesy-Eenadu

మహిళకో 'సేఫ్టీపిన్'!

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు మొబైల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలావరకు మహిళలు ప్రమాదానికి గురైనప్పుడు వారి కుటుంబసభ్యులకి, స్నేహితులకి ఆ సమాచారాన్ని అందించేవే. వాటన్నింటికీ కాస్త భిన్నంగా 'సేఫ్టీపిన్' అనే మరో కొత్త అప్లికేషన్ ఒకటి ఈ మధ్యనే విడుదలైంది. ఇది మ్యాప్ ఆధారిత మొబైల్‌ఫోన్ అప్లికేషన్. దీనిద్వారా పట్టణాలు, చుట్టుపక్కల ప్రదేశాలు మహిళలకు ఎంత వరకు సురక్షితం అనే విషయం తెలుసుకోవచ్చు. సేఫ్టీపిన్ అప్లికేషన్ ద్వారా ఒక పోస్టు చేస్తే అది మీ సర్కిల్స్‌లో ఉన్న అందరికీ ఆ సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకి మీరు ప్రయాణించిన రోడ్డులో వీథిదీపాలు లేకపోయినా, ఆ ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ లేకపోయినా, ఆ సమాచారాన్ని పోస్టు చేస్తే అది అందరికీ చేరుతుందన్నమాట. అలాగే ఈ అప్లికేషన్‌ను వినియోగించే వాళ్లు పిక్చర్స్ అప్‌లోడ్ చేయొచ్చు. ఆమె/అతడు ఆ ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాల్ని సర్కిల్‌లో ఉన్న వాళ్లతో పంచుకోవచ్చు. ఆ సమాచారంపై మీ సర్కిల్‌లో ఉన్న వాళ్లు వ్యాఖ్యలను పోస్ట్ చేసి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కూడా ఉంది. ఈ సమాచారమే కాకుండా అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఆ ప్రాంత సమీపంలోని ఫార్మసీ, పోలీస్ స్టేషన్‌ల సమాచారాన్నీ ఇందులో అప్‌లోడ్ చేయొచ్చు.

"సిటీలో రక్షణలేని ప్రదేశాలను ఎరుపు రంగు మార్క్‌లో, పర్వాలేదన్న వాటిని ఆరెంజ్ రంగులో, సురక్షిత ప్రదేశాలని ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది ఇది. ఇందులో ఉన్న మరో సౌకర్యం ఏమిటంటే ఏవైనా వేధింపులు ఎదుర్కొంటే వాటిని రికార్డు చేసుకోవచ్చు. పగిలిన వీథి దీపాలు, నోరు తెరిచిన నాలాల వంటి సమాచారాన్ని కూడా ఇందులో చేర్చొచ్చు. సేఫ్టీపిన్ ప్రధాన ఉద్దేశం ప్రజల సహకారంతో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం. ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న హింసను తగ్గించడం'' అని చెప్పారు అప్లికేషన్ తయారీదారులు ఆశిష్ బసు, కల్పనా విశ్వనాథ్‌లు. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్, గూగుల్ ప్లేల నుంచి ఈ అప్లికేషన్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Courtesy- andhrajyothy

Wednesday, 20 November 2013

ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్‌లో పోటీపడుతున్నారా?

Sakshi | Updated: November 20, 2013 23:58 (IST)
పోటీపడుతున్నారా?
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్‌లో తమ చిన్నారులు పాల్గొనాల ని, బహుమతులు గెలుచుకోవాలని తల్లులు తపనపడుతుంటారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే ఈ షోలో పేరెంట్స్  చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
   
 ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్ అంటేనే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే డ్రెస్ డిజైనింగ్‌లో కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి.
   
 ఫ్యాన్సీ డ్రెస్ కాస్ట్యూమ్స్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటున్నాయి. స్కూల్ టీచర్, డిజైనర్ సలహాలతో, టైలర్‌కి చెప్పి డిజైన్ చేయించుకోవచ్చు.
   
 ఎలాంటి డ్రెస్ ఎంచుకున్నా, వేదిక మీద క్యారెక్టర్‌కు తగ్గ లుక్ ఆహూతులను ఆకట్టుకునేలా వేషధారణ ఉండాలి.
   
 కాంపిటిషన్ సమయంలో చాలామంది పిల్లలు సీతాకోకచిలుకల్లా అందమైన డ్రెస్సులు ధరించి కనువిందు చేస్తుంటారు. ఈ సమయంలో న్యాయనిర్ణేతల దృష్టి హ్యాండ్ క్రాఫ్డ్ డ్రెస్‌ల మీదే అధికం గా ఉంటుంది. సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్‌కు మరో డ్రెస్ ఎప్పుడూ పోటీ కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌ను డిజైన్ చేసుకోవాలి.
   
 పోటీలో చురుగ్గా పిల్లలు పాల్గొన్న విధానమూ పేరక్షకులను, న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటుంది. అందుకని వారి లేత చర్మానికి హాని కలిగించని క్లాత్, డిజైన్స్ మాత్రమే డ్రెస్సులకు ఎంచుకోవాలి.
   
 పాత్రకు తగిన విధంగా కొన్ని పెయింటింగ్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ, చమ్కీ.. వంటివి డ్రెస్సుల మీద ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు అలంకరణలో వాడే రంగులు, లేసులు, ఐరన్ పిన్స్ ... వంటివి శరీరానికి గుచ్చుకునేలా ఉంటే పిల్లలు చిరాకుపడతారు.
   
 ఏ డ్రెస్‌కైనా లోపల మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి.

గొప్ప స్థానం కోసం టెన్ కమాండ్‌మెంట్స్

Sakshi | Updated: November 20, 2013 23:54 (IST)
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.

 నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.

 ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి.

 మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి.

 కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు.

 ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు.

 ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు.

 మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్‌గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం.

 బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి.

 నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు.

 రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి!

Self employment with juices-Radhika

Courtesy-Eenadu

professional training at Mahaboob nagar for women

Courtesy-Eenadu

అమరిక : స్పాత్ రూమ్!

Sakshi | Updated: November 20, 2013 00:30 (IST)
అమరిక : స్పాత్ రూమ్!
 బాత్‌రూమ్ ప్రతి ఇంటికీ ఉంటుంది. కాని, దానిని ఉపయోగించుకోవడంలోనే బోలెడంత క్రియేటివిటీ అవసరం. స్నానం అంటే... టైమ్ చూసుకుంటూ ఆదరాబాదరాగా నాలుగు మగ్గుల నీటిని ఒంటి మీద పోసుకుని, ఆ తొందరలో రెండు మగ్గుల నీటిని నేలమీద ఒలకబోసి ఈ పూటకి అయిందనిపించుకునేది కాదు. ఒక్కో నీటి చుక్క ఒంటి మీద నుంచి జారుతూ ఉంటే ఆ హాయిని ప్రశాంతంగా ఆస్వాదించాలి. అలా ఆస్వాదించాలంటే బాత్‌రూమ్ తీరుగా ఉండాలి. అందుకోసం బాత్‌రూమ్‌కు స్పా లుక్ తీసుకువస్తే ఎలా ఉంటుంది?

 ఈ ప్రశ్నకు చాలామంది నుంచి తక్షణం ‘చాలా ఖర్చవుతుంది’ అనే సమాధానమే వస్తుంది. నిజానికి ఇది పెద్ద ఖర్చేమీ కాదు. కొంచెం పొందిగ్గా ప్లాన్ చేసుకుంటే సింపుల్ బాత్‌ర్యాక్స్‌తో బాత్‌రూమ్‌కి స్పాలుక్ తీసుకురావచ్చు. సాధారణమైన బాత్‌రూమ్‌లోని ఒక మూలగా చిన్నస్టాండు ఏర్పాటు చేసి టవల్స్ చక్కగా రోల్ చేసి సర్దాలి. అలాగే గోడకు చిన్న ఉడెన్ ర్యాక్ చేయించుకుంటే షాంపూలు, లోషన్లు, ఇతరత్రా సౌందర్యసామగ్రి మొత్తం అందులో అమర్చేయవచ్చు. సింక్ పక్కనే టవల్స్ కోసం ఒక రాక్, షవర్ దగ్గరగా కొంచెం ఎత్తులో షాంపూ ర్యాక్ అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్ని ర్యాక్స్‌ను బాత్‌రూమ్ తలుపుకి వెనుక కూడా తగిలించుకోవచ్చు. ఇలా చేసుకుంటే టవళ్లు, సబ్బులు, షాంపూల వంటివి బెడ్‌రూమ్ షెల్ఫుల నుంచి వెళ్లిపోతాయి, ఇక ఆ ఖాళీని మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు.

అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్

Sakshi | Updated: November 20, 2013 00:06 (IST)
అస్త్ర తంత్ర :  కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
 ఆడవాళ్లు ఆరయ్యేసరికల్లా ఇంట్లో వాలిపోయే రోజులు కావివి. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవాళ్లకు చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవడం అంత సులభం కాదు. హైదరాబాద్‌లాంటి బిజీ నగరాల్లో అస్సలు సాధ్యం కాదు. పైగా కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్లు ఏ అర్ధరాత్రో డ్యూటీ ముగించుకుని రావలసిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు మనకు రక్షణ? ఎవరూ కాదు. మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. అందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

     బయటకు వెళ్లేముందు బ్యాగులో చాకు, పెప్పర్ స్ప్రే లాంటి రక్షణాయుధాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఏదీ లేకపోతే కనీసం కారప్పొడి, బాడీ స్ప్రే లాంటివైనా ఉంచుకోండి.

     నడిచి వెళ్తున్నా, టూ వీలర్ మీద వెళ్తున్నా... వీలైనంత వరకూ షార్‌‌టకట్ రూట్లలో వెళ్లకండి. మనుషులు ఎక్కువగా తిరిగే రూట్లోనే వెళ్లండి.

     తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మానుష్యంగా ఉండే దారుల్లో వెళ్లాల్సి వస్తే... టూ వీలర్‌ని పొరపాటున కూడా ఆపకండి. నడిచి వెళ్తుంటే కనుక బ్యాగులో ఉన్న ఆయుధాన్ని తీసి చేతితో పట్టుకోండి.

     ఒంటరిగా నడుస్తున్నప్పుడు భయంగా దిక్కులు చూడటం, టెన్షన్‌గా చేతులు నులుముకోవడం, చెమట తుడుచుకోవడం వంటివి చేయవద్దు. మీ నడకలో, బాడీలాంగ్వేజీలో స్టిఫ్‌నెస్ ఉండాలి. అది మీ కాన్ఫిడెన్‌‌సకు చిహ్నంలా కనబడాలి. అప్పుడు మీ జోలికి రావడానికి ఎవరైనా కాస్త జంకుతారు.

     ఫోను మాట్లాడుకుంటూనో, ఏదో ఆలోచిస్తూనో పరిసరాలను గమనించడం మర్చిపోవద్దు. నడుస్తూనే నలుదిశల్లో ఏం జరుగుతోందో చూసుకోవాలి.

     ఆటోలు ఎక్కే ముందు డ్రైవర్‌ని కాసేపు ఏదో ఒకటి మాట్లాడించండి. అతడు మామూలుగా ఉన్నాడా లేక మద్యం సేవించి ఉన్నాడా అన్నది తెలుస్తుంది.

  లేట్ నైట్ ఏ ఆటోనో, ట్యాక్సీనో ఎక్కితే... వెహికిల్ నంబర్ నోట్ చేసుకుని, వెంటనే ఇంట్లోవాళ్లకు చెప్పండి. వీలైతే ఆటో ఏ రూట్లో వెళ్తోందో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండి.

Tuesday, 19 November 2013

இணையம் பயன்படுத்தும் பெண்களை பாதுகாக்க சட்டம்

===இணையம் பயன்படுத்தும் பெண்களே. உங்களை பாதுகாக்க சட்டம் இருக்கிறது===

// பிறர் அறிய பகிர்ந்து உதவுங்கள் நண்பர்களே //

உங்கள் ஃபேஸ்புக் இன்பாக்ஸில் ஆபாசமாக மெசேஜ் அல்லது படங்கள் அனுப்பினாலோ, ஈமெயிலில் ஆபாசமாக மெசேஜ் அனுப்பினாலோ, ஃபோனில் ஆபாசமாக பேசினாலோ, வழக்கறிஞரை சந்தித்து 66A செக்ஷன் மூலம், சட்டப்பூர்வமாக நடவடிக்கை எடுக்கலாம். ஃபேக் ஐடியாக இருந்தாலும் காவல் துறையினர் ஆளை கண்டுப் பிடித்து விடுவர். மெசேஜ்களை டெலிட் செய்யாமல் வைத்திருங்கள். அதுவே ஆதாரமாகும்.
IT act section 66A. Punishment for sending offensive messages through communication service, etc. upto 3 years imprisonment

உங்களைப் பற்றி தரக்குறைவாக ஃபேஸ்புக் வாலிலோ, ப்ளாகிலோ போட்டிருந்தால் 509 செக்ஷன் மூலம் நடவடிக்கை எடுக்கலாம். ஒரு வருட சிறைத் தண்டணை. அந்த போஸ்ட்டை ஸ்க்ரீன்ஷாட் செய்து விடுங்கள். அதுவே ஆதாரமாகும்.
IPC Section 509: Word, gesture or act intended to insult the modesty of a woman: Acts of sexual harassment demeaning a woman on the basis of her gender or sexuality - and other forms of sexual abuse faced by women online - can fall under this. one year imprisonment

உங்கள் ஃபோட்டோக்களை இன்னொருவர் ஷேர் செய்து தரக்குறைவாக விமர்சித்து இருந்தாலோ, ஆபாச சைட்களில் உங்கள் ஃபோட்டோக்களை போட்டிருந்தாலோ, செக்ஷன் 499 படி ஒரு வருட சிறைத் தன்டணை கிடைக்க செய்யலாம். உங்கள் ஃபோட்டோ இருக்கும்னிடத்தை ஸ்க்ரீன்ஷாட் எடுங்கள்.
IPC Section 499: Defamation:
Harming the reputation of a person through words, signs, or visible representations. Many women bloggers and Tweeters say that the violent sexist slander they receive goes on to create an irrecoverably negative message for them within their communities, societies, etc. 2 years imprisonment

இந்தியாவில் எங்கு இருந்தாலும் இந்த சட்டம் செல்லுபடியாகும். வெளிநாட்டில் இருந்து இந்தியர்கள் குற்றம் புரிந்தால் IPC 188 படி மேற்சொன்ன சட்டப்பிரிவுகளில் உள்ளூரிலேயே வழக்கு பதிவு செய்யலாம்.

மேற்சொன்ன தகவல்களை வைத்து உங்களை இழிவுபடுத்தியவனை தொடர்பு கொண்டும் பனியவைக்கலாம்
தைரியமாக புகார் கொடுங்கள். உங்கள் உரிமையை நிலைநாட்டுங்கள்.

Home made facepack and pedicure


Courtesy-Eenadu

Wate to wealth-Lakshmi Raghava

Courtesy-Eenadu

Natural Ways to Remove Unwanted Hair at Home


Ingredients Required:

Sugar- 30 gm
Lemon juice- 10 ml
Water- 150 ml
Method:

Squeeze a fresh lemon and mix 30 gm sugar in it. Add 150 ml water to this lemon-sugar mixture. Mix it well, and apply on the face along the direction of growth of hair. After 15 minutes, wash your face with cold water, gently rubbing it. Apply it once in a week

Monday, 18 November 2013

Free computer training @Tirupati

Courtesy-Andhrajyothy

M defence in Ordinary phones too

COURTESY_Andhrajyothy

పిల్లలు చెప్పలేరు పెద్దలే తెలుసుకోవాలి

Sakshi | Updated: November 19, 2013 00:38 (IST)
ఎవరినైనా చూసి మన పాప/బాబు హడలిపోతుంటే... దానికి కారణం చిన్నపిల్లల్లో సహజంగా ఉండే బెరుకు కావచ్చు అనుకుంటాం మనం. అంతేతప్ప, అది అసహజమైన భయం కావచ్చునన్న ఆలోచనే రాదు. ‘‘ఇక్కడే చాలామంది తల్లులు తప్పు చేస్తున్నారు’’ అంటోంది హైదరాబాద్‌లోని ‘బ్రేక్ ద సెలైన్‌‌స’ సంస్థ.

శిశుహింస (చైల్డ్ అబ్యూజ్) అనేక విధాలుగా ఉంటుంది. పిల్లల్ని కొట్టడం, తిట్టడం, లైంగికంగా వేధించడం,  ఏ పని చేసినా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం, ఆఖరికి ప్రేమ చూపకపోవడం కూడా శిశుహింసే. వీటిల్లో అతి ప్రధానమైన లైంగిక హింసను  నివారించేందుకు ‘బ్రేక్ ద సెలైన్స్’ సంస్థ కృషి చేస్తోంది. లైంగిక హింసకు బలవుతున్న చిన్నారులను కాపాడటానికి, ఈ హింస గురించి తల్లిదండ్రులకు, చిన్నారులకు అవగాహన కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న  సంస్థ ఇది.

సంస్థ అంచనా ప్రకారం చిన్నపిల్లల పట్ల వేధింపులు రోజురోజుకీ పెరిగిపోవడానికి కారణాలు ముఖ్యంగా రెండు. పిల్లలు నోరు తెరచి తమ పట్ల జరుగుతోన్న హింసను చెప్పలేకపోవడం, పిల్లల విషయంలో ఏం జరుగుతుందో పేరెంట్స్ గుర్తించలేకపోవడం. ఈ పరిస్థితి మారాలంటే... తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ముందు తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి, తర్వాత పిల్లలను అప్రమత్తం చేయాలి.

మీ ఇంటికి తరచుగా వచ్చేవారు, బడిలో టీచర్లు తదితరులు మీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. వాళ్ల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. అనుచితంగా ఉంటే వారించండి.

ఎలాంటి మనుషులు ఉంటారు, వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారు, లోబర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు... వంటివి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించండి. చిన్నపిల్లలు కదా అని చెప్పడానికి మీరు సంకోచిస్తే... రేపు జరగరానిది జరగవచ్చు.

పిల్లలు కనుక తమ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెబితే తేలిగ్గా తీసి పారేయకండి. ‘నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా’ అంటూ కోప్పడకండి. అలా చేస్తే వాళ్లు ఇంకెప్పుడూ ఏమీ చెప్పరు. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.

ఎప్పుడూ అల్లరిచేసే పిల్లలు మౌనంగా ఉండిపోయినా, భయం భయంగానో దిగులుగానో ఉంటున్నా విషయమేంటో ఆరా తీయండి.

తగని చోట టచ్ చేస్తున్నా, మీరు లేనప్పుడు తనని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఫొటోలూ వీడియోలూ తీయాలని ప్రయత్నిస్తున్నా... వెంటనే మీకు చెప్పమని మీ చిన్నారికి బోధించండి.

వీలైనంత వరకూ పిల్లలను పరాయివాళ్ల ఇళ్లలో వదిలిపెట్టడం, పరాయి వాళ్లతో బయటకు పంపడం చేయకండి.

పిల్లలు ఎక్కువగా గడిపేది తల్లితోనే. కాబట్టి వారిని అనుక్షణం తల్లే కంటికి రెప్పలా చూసుకోవాలి. తమకు ఏం జరుగుతోందో, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పసివాళ్లు వాళ్లు. కాబట్టి ప్రమాదం ఎటునుంచి వస్తుందో, ఎలా వస్తుందో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదే. 

PHC- Inspiration

Courtesy-Eenadu

PHC Girl selected for Balasri award

Courtesy-Eenadu

Online లో ఆధార్ కార్డుని మీ Gas ఎకౌంటు కి లింక్ చేసేదేలా?

మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి. Online లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు.

Online లో లింక్ చేసే విధానం:

Online లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి.సులభమైన 4 steps follow అయితే చాలు. మీ ఫ్రెండ్స్ / బంధువులకి కూడా చేసిపెట్టండి .

ఇలా చేయండి :

ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .
https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx

Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి

Step 2: Choose Benefit Type లో ... Benefit Type - (LPG)

Scheme Name - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి

Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి. మీ గ్యాస్ పుస్తకంపై లేదా రసీదుపై ఏజెన్సీ పేరు ఉంటుంది.

Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి

Step 3: మీ వివరాలు:

Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమీ కాదు )
Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి.

మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో ఇవ్వబడిన మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ పంపబడుతుంది. మీ ఈ మెయిల్ కు కూడా మెసేజ్ వస్తుంది.

Step 4: Confirm Request

మీ మొబైల్ కి/ఈ మెయిల్ కి వచ్చిన OTP నెంబర్ ని "Enter the text shown" దగ్గర నెంబర్ ఎంటర్ చేయండి .

Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది .

మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబంధించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు .

తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు
(మీ స్నేహితులకోసం ఈ పోస్ట్ share చెయ్యండి)
 

Google rewards Rs. 3cr to a Telugu Girl

Google Success Story

Sunday, 17 November 2013

Free trainng in karate and home business


Courtesy-Sakshi

తల్లే తొలి స్నేహితురాలు

Sakshi | Updated: November 18, 2013 00:18 (IST)
తల్లే తొలి స్నేహితురాలు
అది 1998వ సంవత్సరం. మార్చి నెల. నా జీవితంలోకి ఓ కొత్త ఆనందం ప్రవేశించింది. ఓ అనిర్వచనీయమైన అనుభూతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది... నా చిట్టితండ్రి సాత్విక్ రూపంలో. అమ్మా అన్న పిలుపును నాకు తొలిసారి రుచి చూపించిన నా తొలి సంతానం సాత్విక్. బుజ్జి బుజ్జి కాళ్లు, చిన్ని చిన్ని చేతులు... ఓ అందమైన పుష్పాన్ని చూస్తున్నట్టుగా ఫీలయ్యాను. వాడిని తొలిసారి చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు... ప్రపంచంలో ఎవరూ పొందని గొప్ప విజయమేదో పొందినంత గర్వపడ్డాను. ఇదే ఆనందం నాకు రెండేళ్ల తరువాత మరోసారి దక్కింది. మా పాప శృతి పుట్టింది. ఓహ్... ఇక నాకు ప్రపంచంలో మరేదీ అక్కర్లేదనిపించింది.

 ఆ తరువాత కొన్ని సంవత్సరాల వరకూ నాకు నా పిల్లలు తప్ప మరెవరూ కనిపించలేదు. వాళ్ల సంతోషం తప్ప ఇంకేమీ కనిపించలేదు నా కంటికి. అంతకుముందు నేను ఉద్యోగం చేసేదాన్ని. కానీ పిల్లల కోసం మానేశాను. నా పిల్లల ముద్దొచ్చే ముఖాలను చూడటంతో మొదలై... వాళ్లను నిద్రపుచ్చి పక్కమీదకు చేరడంతో నా రోజు ముగిసేది. నేనో పోస్ట్ గ్రాడ్యుయేట్‌నని, ఉద్యోగినని మర్చిపోయాను. నా పిల్లలకు తల్లిని అన్న ఒకే ఒక్క విషయమే గుర్తుంది నాకు.

 ఓ బిడ్డకు జన్మనివ్వడమే పునర్జన్మను పొందడమనుకుంటే... ఆ పుట్టిన బిడ్డలను పెంచి పెద్ద చేయడం ఓ పెద్ద తపస్సు తల్లికి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వాళ్లతో పాటు మనమూ ఎదగాలి. నేను కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మరీ కోప్పడనుగానీ... చేయకూడనిది చేస్తే వెంటనే సరిచేస్తాను. దానిలో తప్పేంటో, ఎందుకలా చేయకూడదో వివరిస్తాను. ఈ పని అన్నిటికంటే కష్టమైనది. ఎందుకంటే, కాస్త మనం ఎక్కువ మాట్లాడినా వాళ్ల మనసులు నొచ్చుకుంటాయి. ఆ బాధ నుంచే వారికి భయం పుడుతుంది. ఆ భయం కాస్త హద్దు దాటిందంటే, మన పిల్లల దృష్టిలో మనం విలన్లయిపోవడం ఖాయం. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.

 నా దృష్టిలో తల్లే పిల్లలకు మొదటి స్నేహితురాలు. స్నేహం దేనినైనా చెప్పుకునే స్వేచ్ఛనిస్తుంది. నా పిల్లలకు నా దగ్గర ఆ స్వేచ్ఛ ఉండాలి. నేనేదో అంటానన్న భయంతో ఏదీ దాచిపెట్టకూడదు. అందుకే మా తల్లీపిల్లల బంధాన్ని స్నేహబంధంగా మార్చేసుకున్నాను నేను!

 - అరుణా శేఖర్, వైజాగ్ (సాక్షి పాఠకురాలు)