మహిళల్లో ఎవరిని పలకరించినా 'థైరాయిడ్ సమస్య' గురించి వినిపిస్తోంది. గొంతు భాగంలో ఉండే ఈ గ్రంథి పనితీరు మారిపోవడం వల్ల హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే రెండు రకాల సమస్యలు ఏర్పడతాయి. వీటి వల్ల అయితే మరీ సన్నగా అయిపోవడం, లేదంటే బాగా లావు అయిపోవడం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచెయ్యడానికి కొన్ని ఆసనాలు, ప్రాణాయామం బాగా పనికొస్తాయి. ఈ ఆసనాలు రోజూ ఆరుబయట ప్రాతఃకాల సమయంలో చేస్తే చాలావరకూ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడగలుగుతాం.
సింహగర్జన : చాపమీద వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్ల మధ్య దూరాన్ని పెంచి రెండు అరచేతులను మోకాళ్ల దగ్గర వెనక్కి తిప్పి పెట్టాలి. తలను పూర్తిగా కిందకి వంచి గడ్డం తాకేలా ఉంచి పూర్తిగా శ్వాస తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పైకి లేచి తల పైకి తీసుకొచ్చి గాలి వదులుతూ నాలుక బైట పెట్టి ఓంకార ధ్వనితో గర్జన చెయ్యాలి. ఇలా 5సార్లు చేశాక ధ్యానముద్రలో కూర్చోవాలి. గాలి వదిలేటప్పుడు కంఠం దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథిని గమనిస్తూ రెండు కనుబొమల మధ్యా దృష్టి పెట్టాలి.
ఉష్ట్రాసనం : ఉష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసన భంగిమ ఒంటెను పోలి ఉంటుంది కనుక దానికా పేరు వచ్చింది. చాప మీద ముందు వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా మోకాళ్ల మీద లేచి రెండు కాళ్ల మధ్య ఒక అడుగు దూరం ఉంచి గాలి తీసుకుంటూ ఉండాలి. కుడి చేతిని పైకి లేపి వెనక్కి వంగుతూ కుడి చేత్తో కుడి కాలి మడమను, ఎడమ చేత్తో ఎడమ కాలి మడమనూ పట్టుకుని గాలి వదులుతూ పొట్టను ముందుకు లాగి నడుమును వెనక్కి పెట్టి దృష్టి థైరాయిడ్ గ్రంథి మీద పెట్టాలి. ఈ ఆసనంలో 3 నిమిషాలు ఉండి, తర్వాత గాలి తీసుకుంటూ వజ్రాసనంలో కూర్చోవాలి.
Courtesy-Andhrajyothi
శశాంకాసనం : వెనక్కి వంగే ఆసనాలు ఏవి చేసినా వెంటనే ముందుకు వంగే ఆసనం కూడా చెయ్యాలి. శశాంకం అంటే కుందేలు. ఈ ఆసన భంగిమ కుందేలును పోలి ఉంటుంది. వజ్రాసనంలో కూర్చుని గాలి తీసుకుంటూ రెండు చేతులూ పైకి లేపి శరీరాన్ని బాగా సాగదియ్యాలి. గాలి వదులుతూ తల, చేతులు నేలకు ఆన్చి నుదురు పూర్తిగా నేలకు ఆనేలా పెట్టాలి. రెండు అరచేతులను తలకిరువైపులా బోర్లించాలి. ఈ ఆసనంలో మూడు నిమిషాలు ఉండి గాలి తీసుకుంటూ రెండు చేతులూ పైకి లేపి సుఖాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఆహారం : కాబేజి, కాలిఫ్లవర్ అస్సలు తినకూడదు.
ఉపయోగాలు : సింహగర్జన ఆసనం వల్ల కంఠం దగ్గరున్న థైరాయిడ్ గ్రంథి చైతన్యవంతమవుతుంది. సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
కూచిపూడి వెంకటలక్ష్మి
యోగా శిక్షకురాలు

No comments:
Post a Comment