Sakshi | Updated: November 05, 2013 23:28 (IST)
రాధికకు రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. సుకన్య, వినయ కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. డ్రైవర్ అన్నాక లిఫ్ట్ ఇవ్వకుండా ఉంటాడా అన్నారు. ఓ రెండు కిలోమీటర్లు వెళ్లాక కుడివైపుకి వెళ్లాల్సిన ఆటో ఎడమవైపుకి మళ్లింది. తారురోడ్డుని వదలి మట్టిరోడ్డులో ఆటోస్పీడుగా పోతుంటే ముగ్గురమ్మాయిలు ఆటో ఆపమని గట్టిగా అడిగారు. ‘ఇక్కడ వీడిల్లు ఉంది. అక్కడ దించేసి వెనక్కి వెళదాం’ అని చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం కావడం వల్ల జనసంచారం లేదు. ఇంతలో రాధిక ఆటోలో నుంచి కిందకి దూకేసింది. సుకన్య, వినయ డ్రైవర్ కాలర్ పట్టుకుని గట్టిగా వెనక్కి లాగబోతుంటే రెండోవ్యక్తి సుకన్య చేతిపై గట్టిగా కొట్టాడు. వినయ చొక్కా కాలర్‌ని గట్టిగా బిగించడంతో డ్రైవర్ స్టీరింగ్ వదిలిపెట్టేశాడు. ఆటో ఆగిపోయింది. ఇంతలో రాధిక పరిగెట్టుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఆపి అందులో ఉన్న ఓ ఇద్దరిని వెంటబెట్టుకుని రావడాన్ని చూసి ఆటోడ్రైవర్ స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
రాధిక వెంట వచ్చినవారు డ్రైవర్‌కి దేహశుద్ధి చేశారు. రాధిక, సుకన్య, వినయ వారిసాయంతో అదే ఆటోలో వెనక్కి వెళ్లి డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించారు. దీనిపై భూమిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు కె. వి. సత్యవతి మాట్లాడుతూ ‘‘సమస్యలో పడ్డామని తెలియగానే ఏ మహిళైనా కంగారు పడి ఆత్మరక్షణ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోలేదు. రాధిక, సుకన్య, వినయలు కూడా ముందు భయపడ్డా, వెంటనే తేరుకుని తమని తాము రక్షించుకోవడానికి కావాల్సిన పథకాన్ని నిమిషాల్లో అమలుపరిచారు. అమ్మాయిలకు కావాల్సిన అసలైన ఆయుధం ధైర్యమే. ధైర్యాన్ని కోల్పోకుండా...తెలివిని, బలాన్ని ఉపయోగించి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిఘటించడం చాలా సందర్భాల్లో అవసరం. చదువులకి, ఉద్యోగాలకే కాదు...సమస్యలకు కూడా మన తెలివితేటల్ని, ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ఉపయోగించాలనే ఆలోచన అమ్మాయిలందరిలో పెరగాలి’’ అని చెప్పారామె.
- ఫ్యామిలీ డెస్క్
No comments:
Post a Comment