Sakshi | Updated: November 12, 2013 23:35 (IST)
‘నిర్భయ’ అప్లికేషన్: దేశరాజధానిలో అకృత్యానికి గురైన ‘నిర్భయ’ను గుర్తుచేస్తూ మహిళలకు సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన అప్లికేషన్ ఇది. ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేసే ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నంబర్‌ను ఫీడ్ చేసుకుంటే చాలు... ఆపత్కాలంలో ఒకే ఒక్క క్లిక్‌తో వారికి మెసేజ్ లేదా ఫోన్‌కాల్ వెళ్లిపోతుంది.
ఫైట్‌బ్యాక్: ఇది కూడా నిర్భయ లాంటి మరో అప్లికేషన్. ఒక్కసారి టచ్ చేస్తే, వెంటనే మీ వాళ్లకు కాల్ వెళ్లిపోతుంది. మిస్సింగ్ కేసుల్లో తమకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతోందని పోలీసులు సైతం చెబుతున్నారు. ఇంటర్నెట్‌తో కనెక్టయ్యి ఉండే ఈ అప్లికేషన్... లొకేషన్ ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
హెల్ప్ అలర్ట్: అహ్మదాబాద్‌కు చెందిన దేశీయ అప్లికేషన్ డెవలపర్ పయనీర్ వెబ్‌సిస్టమ్స్ వారు ఈ అప్లికేషన్‌ను డెవలప్ చేశారు. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీలో, దాడి, కిడ్నాపింగ్ సమయాల్లో ఉపయోగపడే విధంగా ఈ అప్లికేషన్‌ను తీర్చిదిద్దారు. ఆండ్రాయిడ్ ఫోన్లపై ఇది పనిచేస్తుంది.
ఐ ఫాలో: ఇది అన్నిటికంటే బెస్ట్ యాప్. దీనిని అన్నిటిలాగే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రమాదం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫోన్ చేసేంత, యాప్‌ను క్లిక్ చేసేంత సమయం ఉండదు కదా! అందుకే... ఈ యాప్‌ని అసలు క్లిక్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్, మొబైల్‌ను కదిలిస్తే చాలు... అందులో ఉన్న నంబర్లకు ఈ అప్లికేషన్ ద్వారా కాల్స్ వెళ్లిపోతాయి. ఇది సహాయపడే తీరును చూసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఈ అప్లికేషన్ రూపకర్తలను సత్కరించింది.
No comments:
Post a Comment