రెండు రోజులు ఊడవకపోతే చాలు దుమ్ము పేరుకుపోయి చెత్తచెత్తగా తయారవుతుంది ఇల్లు. అలాగే రెండు రోజులు స్నానం చేయకపోతే కంపుకొడుతుంది ఒళ్లు. మరి శరీరాన్ని యేళ్ల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే... చిన్నా చితకా జబ్బులతో పాటు ప్రాణాంతక వ్యాధులు సైతం చుట్టుముడతాయి. ఇటువంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఏంచేయాలి? 'శరీరం లోపలి వ్యర్థాలను బయటికి పంపాలి (డీటాక్సిఫికేషన్). ఆ పనిలో మీకు సాయపడేందుకు సింధూర బుర్రా 'క్లీన్స్ హై' అనే జ్యూస్‌లతో తయారుగా ఉంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
"డీటాక్సిఫికేషన్‌ని సులువుగా వివరించాలంటే మన ఉపవాసం లాంటిదని చెప్పొచ్చు. శరీరంలోపల పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపేందుకు డీటాక్సిఫికేషన్ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉపవాసం ఉన్న వాళ్లు ఆ రోజు ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోతారు. కాని ఇప్పుడున్న బిజీ యుగంలో ఒక్క క్షణం కూడా ఖాళీగా ఇంట్లో ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. అసలు కుదరదు కూడా. నీరసంతో పనికెళ్లలేరు. అందుకే చాలామంది ఉపవాసం ఆలోచననే దరిచేరనీయడం లేదు. అటువంటి వాళ్లకోసమే పోషకాలతో కూడిన ద్రవపదార్ధాలను తయారుచేసి అందిస్తున్నాను. వీటిని మీమీ కార్యాలయాలకు వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఆఫీసుకి సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండానే శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవచ్చు.
ఆలోచన ఎలా వచ్చిందంటే...
పై చదువులకోసం కాలిఫోర్నియా వెళ్లినప్పుడు అక్కడ నాకు ఈ డీటాక్సిఫికేషన్ గురించి తెలిసింది. న్యూట్రిషనిస్టు ఫ్రెండ్ ఒకావిడ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే నేను కూడా అందులో పాల్గొన్నాను. ఆ తర్వాత శరీరం చాలా తేలికగా ఉన్నట్టు అనిపించడమే కాక మనసు కూడా ఎంతో హాయిగా ఉంది. ఇదేదో బాగుందే అనుకుని ఆమె వద్ద శిక్షణ తీసుకున్నాను. కాలిఫోర్నియాలో చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చాక నా స్నేహితుల్లో చాలామంది రెస్టారెంట్లు తెరిచే ఆలోచనలు చేశారు. నాకు మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా చేస్తే బాగుండనిపించింది. అప్పుడే డీటాక్సిఫికేషన్ ఆలోచన తట్టింది. శరీరంలోపలికి వ్యర్థాలను చేర్చే అంశాలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. తీసుకునే ఆహారం, కాలుష్యపూరితమైన వాతావరణం, డిటర్జెంట్‌లు, సబ్బుల వంటివి. వాటిని బయటికి పంపే మార్గాన్ని నేనెందుకు ఎన్నుకోకూడదు అనిపించి వెంటనే కాలిఫోర్నియాలోని ఉన్న నా స్నేహితురాలిని సంప్రదించాను. తన గైడెన్స్‌తో 'జ్యూస్ ఫాస్టింగ్' ఉత్పత్తులు తయారుచేశాను.
ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్
డీటాక్సిఫికేషన్ ఒక రోజు టైంటేబుల్ ఎలా ఉంటుందంటే... ఉదయం ఏడున్నరకి నిమ్మ రుచి కలిగిన జ్యూస్‌తో మొదలవుతుంది. ఆ తరువాత తొమ్మిది గంటలకి గ్రీన్ జ్యూస్ (ఇందులో ప్రొటీన్లు ఉంటాయి.), పదిన్నరకి టీ, పన్నెండున్నరకి సూప్, రెండున్నరకి పళ్లరసం, ఐదు గంటలకి మళ్లీ గ్రీన్‌జ్యూస్, సాయంత్రం ఏడుగంటలకి నట్‌మిల్క్ (ప్రొటీన్‌లు కలిగిన), రాత్రి ఎనిమిది గంటలకి టీ. కరెక్టుగా అవే టైంలు కాకపోయినా మీ సౌలభ్యాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఎనిమిది జ్యూస్‌ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూనే ఉపవాసం చేస్తారన్నమాట. మామూలుగా అయితే శరీరం డీటాక్స్ కావడానికి మూడు రోజులు పడుతుంది. కాకపోతే మొదటిసారి ప్రయత్నించే వాళ్లు ఒక్కరోజే చేయాలి. అలవాటయ్యాక మూడు రోజులు చేయొచ్చు. ఈ ప్రక్రియను జీవితంలో ఒక భాగంలా అంటే రెగ్యులర్ హెల్త్‌చెకప్‌లు ఎలా చేసుకుంటారో అలా చేస్తే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా దరిచేరనీయకుండా జాగ్రత్తపడొచ్చు.
ఎవరు చేయొచ్చు?
ఇరవై నుంచి యాభై యేళ్ల వయసు వాళ్లు ఎవరైనా దీన్ని చేయొచ్చు. ఈ జ్యూస్‌ల్లో వాడే మసాలాలు, తేనె, కొన్ని వనమూలికలను మెక్సికో, దక్షిణాఫ్రికాల నుంచి తెప్పిస్తాను. కూరగాయలు ఎలాగూ మన దగ్గరే లభిస్తాయి. వీటి తయారీలో ప్రిజర్వేటివ్‌లు గాని, ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు గాని వాడను. అందుకని వీటిని ఏ రోజుకి ఆ రోజే వాడాలి. అది కూడా రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచుకుని మాత్రమే వాడాలి. డీటాక్సిఫికేషన్‌ను అందరూ చేయొచ్చు కాని గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్లు మాత్రం చేయకూడదు. అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్లు కూడా చేయకూడదు. డయాబెటిక్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని తేనె, ఖర్జూరాలు వాడాను. అయినప్పటికీ వాళ్లు డాక్టర్లని సంప్రదించి చేయొచ్చు. ఒకవేళ ఇది చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఒక యాపిల్ లేదా గుడ్డు తినొచ్చు. అలాగే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన వాళ్లు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారాక మాత్రమే డీటాక్సిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నాకే జ్యూస్ ప్యాక్‌ను ఇస్తాను.
సిగ్నల్స్ అందుతాయి ఇలా...
డీటాక్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపేందుకు కొన్ని సంకేతాలు అందిస్తుంది మీ శరీరం. అవి... వట్టిగానే అలసిపోతుంటారు. బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉండి బుర్ర పనిచేయకుండా పోతుంది. శరీరంలో నొప్పులు, పోట్లు వస్తాయి. కంటికింద తిత్తులు ఏర్పడతాయి. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. జీర్ణం సరిగా కాకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోవడం, జలుబు, ఫ్లూ, పలు ఇన్ఫెక్షన్లు, శరీరమంతా సన్నగా ఉన్నా కడుపు ఉబ్బుగా ఉండడం, నెలసరిలో తేడాల వంటివి శరీరాన్ని శుభ్రపరచాలనేందుకు సంకేతాలన్నమాట. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే శుభ్రపరిచే ప్రక్రియ మొదలుపెట్టాల్సిందే. ఈ ఉపవాసం ద్వారా శరీరంలోపలి అవయవాలకి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలు అంది శరీరానికి నూతన శక్తి వస్తుంది.
ఉద్యోగులకి ఓ రోజు
ఏడాది కాలంగా ఈ ఉత్పత్తులను అమ్ముతున్నాను. శరీరంలో వ్యర్థాలను తొలగించుకోవాలన్న అవగాహన ఈ మధ్య యువతలో బాగా పెరిగింది. మా దగ్గరికి డాక్టర్లు, ఐటి కంపెనీల వాళ్లు ఎక్కువగా వస్తున్నారు. ఐటి కంపెనీల్లో ఉద్యోగులందరూ కలిసి 'డీటాక్సిఫికేషన్ డే' అని ప్రత్యేకంగా చేస్తున్నారు. ఒరాకిల్, డెలాయిట్, మహీంద్రా, యాహు కంపెనీల నుంచి గ్రూప్ క్లయింట్‌లు ఉన్నారు. ఇప్పటివరకు ఐదువందల మందికి పైగా ఈ ఉత్పత్తులని వినియోగించారు. నెలలో ఇరవై రోజులకి ఒకసారి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ చేస్తే మంచిది. ప్రతీవారం ఒక రోజు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. చాలామంది దీనివల్ల బరువు తగ్గుతామా అని అడుగుతారు. అది వారి వారి శరీరతత్వాలను బట్టి ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియ మాత్రమే ఇది. సెలవు పెట్టాల్సిన పనిలేకుండా, దినచర్య డిస్టర్బ్ కాకుండా శరీరాన్ని సరిచేసుకోవచ్చుననేది మాత్రమే నేను చెప్పేది.
పెళ్లి కూతుళ్ల సౌందర్యానికి...
ఇప్పటివరకు ఎనిమిది జ్యూస్‌ల ప్యాక్ మాత్రమే ఉంది. పెద్దవాళ్లు చాలామంది రాత్రికి డిన్నర్ ఉండేలా ప్యాకేజి ఉంటే బాగుంటుందని అడిగారు. వాళ్లకోసం ఆరు జ్యూస్‌ల ప్యాక్ తయారుచేస్తున్నాను. దీని టైంటేబుల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రాత్రికి డిన్నర్ చేసేయొచ్చు. అలాగే పెళ్లికూతుళ్ల కోసం కూడా స్పెషల్ ప్యాకేజి ఒకటి రూపొందించే ఆలోచనలో ఉన్నాను. దీని తయారీలో డీటాక్సిఫికేషన్‌తో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాను. డీటాక్సిఫికేషన్ జ్యూస్‌లు తయారుచేయడం మన దేశంలో ఇదే మొదలు. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇక్కడయినా, వేరే ప్రాంతానికయినా ఐస్ బ్యాగుల్లో ఉంచే రవాణా చేయాలి. త్వరలో బెంగళూరు, పూణేలో కూడా ' క్లీన్స్‌హై' యూనిట్లు ప్రారంభించబోతున్నాను'' అని చెప్పారామె.
- కిరణ్మయి
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment