Thursday, 31 October 2013

ఫెంగ్ షూ : ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే...

- శ్రీభావ

కొన్ని ఇళ్లలోకి వెళ్లిన వెంటనే చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఏదో తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది.ఇంకొన్ని ఇళ్లలోకి వెళ్తే వాతావరణంగా గంభీరంగా ఉంటుంది.వీచే గాలిలో కూడా ఏదో తెలియని ఆందోళన మిళితమై ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ తేడాలకు కారణాలేమిటి? అందరూ ఒకే విధమైన వాస్తును ఉపయోగించి కట్టినా- ఇంటి వాతావరణంలో ఉండే తేడాలకు కారణాలేమిటి?- ఈ ప్రశ్నకు 'ఫెంగ్ షూ' సమాధానమిస్తుంది. శక్తి ప్రసారం ద్వారా మనలో కలిగే మార్పులను వివరిస్తుంది.

ఫెంగ్ షూ పద్ధతిలో ఇంటిని ఎలా సర్దుకోవాలో తెలుసుకొనే ముందు- ఈ సిద్ధాంతానికి సంబంధించిన మౌలిక సూత్రాలను తెలుసుకోవటం అవసరం.

మూలమిదే..
ఫెంగ్ షూకు మూలాధారం 'యాన్ యాంగ్ సిద్ధాంతం'. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రకృతి నియమాలను అనుసరించి చైనీయులు అభివృద్ధి చేసిన సిద్ధాంతమిది. సంప్రదాయక చైనీయుల వైద్య విధానానికి, మార్షల్ ఆర్ట్స్‌కి, టావోయిజానికి - ఈ సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం- యాన్ (స్త్రీ), యాంగ్ (పురుషుడు) అనే రెండు వ్యతిరేక శక్తులతో ఏర్పడింది. ఈ రెండూ ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొకటి మనలేదు. అలాగే ఒకటికి మరొకటి ప్రత్యామ్నాయం కూడా కాదు. యాన్ యాంగ్ సిద్ధాంతంలో- యాన్‌ను నలుపు రంగుతోను, యాంగ్‌ను తెలుపు రంగుతోను వ్యక్తపరుస్తారు. ఇక శక్తి ప్రసారంలో - యాన్ ఒక సున్నితమైన శక్తి. ఇది ఎటువంటి ఆందోళన లేకుండా చల్లటి గాలిలో నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది.

నీటి మృదుత్వం, చంద్రుడి సున్నితత్వం, నల్లరేగడి నేల రంగు, అమావాస్య రాత్రి నిశ్శబ్దంతో ఈ శక్తిని పోల్చవచ్చు. యాంగ్ దీనికి పూర్తిగా భిన్నం. ఈ శక్తి సూర్య కిరణాల మాదిరి తీక్షణంగా ఉంటుంది. అణువులంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. పర్వతాలలోని రాళ్లల్లా గట్టిగా ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే శక్తి సమతౌల్యం ఏర్పడుతుంది. ఫెంగ్ షూ సూత్రాల ఆధారంగా ఇంటిని నిర్మించుకున్నప్పుడు, లేదా సర్దుకున్నప్పుడు శక్తి అన్ని ప్రాంతాలలోకి ప్రసరిస్తుంది. చాలా మంది- ఇంటి ముఖ ద్వారం, బెడ్ రూమ్, లివింగ్ రూమ్ మొదలైన వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాటిని జాగ్రత్తగా అమర్చుకుంటారు. వంటిల్లు, అటకలు, అలమార్లను అస్సలు పట్టించుకోరు. ఒక ఇంటిలో వీటి వల్ల కూడా ప్రతికూల శక్తులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం ఇంట్లో ప్రతి ప్రాంతాన్ని సర్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడు శక్తి వినిమయం సక్రమంగా సాగుతుంది. ఒక ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎలాంటి రంగులు వాడాలో చూద్దాం..

* ఇంట్లో అత్యంత ముఖ్యమైనది బెడ్ రూం. ఇది ప్రశాంతంగా ఉండాలి. అంటే దీనిలో యాన్ శక్తి ఎక్కువ ప్రసరిస్తూ ఉండాలి. యాన్ శక్తిని ప్రేరేపితం చేసే ఎర్రటి కొవ్వొత్తులు, మనోహరమైన చిత్రాలు బెడ్‌రూమ్‌లో ఉండాలి. యాంగ్ శక్తిని ప్రేరేపితం చేసే- టీవీ, ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్, ఆఫీసు టేబుల్స్ ఉండకూడదు. బాత్‌రూమ్‌లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. బెడ్‌రూమ్‌లోకి లేత రంగులు వేయించుకోవాలి.

* డ్రాయింగ్ రూమ్, ఆఫీసు రూమ్, వంటిల్లు మొదలైన చోట్ల యాంగ్ శక్తి ప్రసరిస్తూ ఉండాలి. అందువల్ల ఈ ప్రాంతాలలో ముదురు రంగులు వేయించుకోవాలి. అయితే శక్తి సమతౌల్యానికి యాన్, యాంగ్‌లు రెండూ అవసరం కాబట్టి- ఇక్కడ కూడా యాన్ శక్తిని ప్రసరింపచేసే చిత్రాలను ఉంచాలి.
Courtesy-Andhrjyothy

ఫెంగ్ షూ : ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే...

- శ్రీభావ

కొన్ని ఇళ్లలోకి వెళ్లిన వెంటనే చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఏదో తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది.ఇంకొన్ని ఇళ్లలోకి వెళ్తే వాతావరణంగా గంభీరంగా ఉంటుంది.వీచే గాలిలో కూడా ఏదో తెలియని ఆందోళన మిళితమై ఉన్నట్లు అనిపిస్తుంది.ఈ తేడాలకు కారణాలేమిటి? అందరూ ఒకే విధమైన వాస్తును ఉపయోగించి కట్టినా- ఇంటి వాతావరణంలో ఉండే తేడాలకు కారణాలేమిటి?- ఈ ప్రశ్నకు 'ఫెంగ్ షూ' సమాధానమిస్తుంది. శక్తి ప్రసారం ద్వారా మనలో కలిగే మార్పులను వివరిస్తుంది.

ఫెంగ్ షూ పద్ధతిలో ఇంటిని ఎలా సర్దుకోవాలో తెలుసుకొనే ముందు- ఈ సిద్ధాంతానికి సంబంధించిన మౌలిక సూత్రాలను తెలుసుకోవటం అవసరం.

మూలమిదే..
ఫెంగ్ షూకు మూలాధారం 'యాన్ యాంగ్ సిద్ధాంతం'. కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రకృతి నియమాలను అనుసరించి చైనీయులు అభివృద్ధి చేసిన సిద్ధాంతమిది. సంప్రదాయక చైనీయుల వైద్య విధానానికి, మార్షల్ ఆర్ట్స్‌కి, టావోయిజానికి - ఈ సిద్ధాంతమే పునాది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం- యాన్ (స్త్రీ), యాంగ్ (పురుషుడు) అనే రెండు వ్యతిరేక శక్తులతో ఏర్పడింది. ఈ రెండూ ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొకటి మనలేదు. అలాగే ఒకటికి మరొకటి ప్రత్యామ్నాయం కూడా కాదు. యాన్ యాంగ్ సిద్ధాంతంలో- యాన్‌ను నలుపు రంగుతోను, యాంగ్‌ను తెలుపు రంగుతోను వ్యక్తపరుస్తారు. ఇక శక్తి ప్రసారంలో - యాన్ ఒక సున్నితమైన శక్తి. ఇది ఎటువంటి ఆందోళన లేకుండా చల్లటి గాలిలో నదీ ప్రవాహంలా సాగిపోతూ ఉంటుంది.

నీటి మృదుత్వం, చంద్రుడి సున్నితత్వం, నల్లరేగడి నేల రంగు, అమావాస్య రాత్రి నిశ్శబ్దంతో ఈ శక్తిని పోల్చవచ్చు. యాంగ్ దీనికి పూర్తిగా భిన్నం. ఈ శక్తి సూర్య కిరణాల మాదిరి తీక్షణంగా ఉంటుంది. అణువులంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. పర్వతాలలోని రాళ్లల్లా గట్టిగా ఉంటుంది. ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే శక్తి సమతౌల్యం ఏర్పడుతుంది. ఫెంగ్ షూ సూత్రాల ఆధారంగా ఇంటిని నిర్మించుకున్నప్పుడు, లేదా సర్దుకున్నప్పుడు శక్తి అన్ని ప్రాంతాలలోకి ప్రసరిస్తుంది. చాలా మంది- ఇంటి ముఖ ద్వారం, బెడ్ రూమ్, లివింగ్ రూమ్ మొదలైన వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాటిని జాగ్రత్తగా అమర్చుకుంటారు. వంటిల్లు, అటకలు, అలమార్లను అస్సలు పట్టించుకోరు. ఒక ఇంటిలో వీటి వల్ల కూడా ప్రతికూల శక్తులు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం ఇంట్లో ప్రతి ప్రాంతాన్ని సర్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడు శక్తి వినిమయం సక్రమంగా సాగుతుంది. ఒక ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎలాంటి రంగులు వాడాలో చూద్దాం..

* ఇంట్లో అత్యంత ముఖ్యమైనది బెడ్ రూం. ఇది ప్రశాంతంగా ఉండాలి. అంటే దీనిలో యాన్ శక్తి ఎక్కువ ప్రసరిస్తూ ఉండాలి. యాన్ శక్తిని ప్రేరేపితం చేసే ఎర్రటి కొవ్వొత్తులు, మనోహరమైన చిత్రాలు బెడ్‌రూమ్‌లో ఉండాలి. యాంగ్ శక్తిని ప్రేరేపితం చేసే- టీవీ, ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్, ఆఫీసు టేబుల్స్ ఉండకూడదు. బాత్‌రూమ్‌లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. బెడ్‌రూమ్‌లోకి లేత రంగులు వేయించుకోవాలి.

* డ్రాయింగ్ రూమ్, ఆఫీసు రూమ్, వంటిల్లు మొదలైన చోట్ల యాంగ్ శక్తి ప్రసరిస్తూ ఉండాలి. అందువల్ల ఈ ప్రాంతాలలో ముదురు రంగులు వేయించుకోవాలి. అయితే శక్తి సమతౌల్యానికి యాన్, యాంగ్‌లు రెండూ అవసరం కాబట్టి- ఇక్కడ కూడా యాన్ శక్తిని ప్రసరింపచేసే చిత్రాలను ఉంచాలి.
Courtesy-Andhrjyothy

ఫెంగ్ షూ : మీ కువా నెంబర్ ఏమిటి?


- శ్రీభావ

కొందరు చాలా వేగంగా పరిగెత్తుతారు. కొందరి వేగం తక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి వేగం అతనికి ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి అందరికి ఒకే విధంగా ఉండదు. ఫెంగ్‌షూ ఈ మౌలిక సూత్రాన్ని గుర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి అవసరమైన శక్తి వినిమయం భిన్నంగా ఉంటుంది కాబట్టి దానిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశాన్ని వివరిస్తుంది.

ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం మనం నివసించే దిక్కు, మనం నివసించే ప్రదేశంలో ఉండే వస్తువులు, వాటి రంగులు, వాటి ఆకృతుల వల్ల శక్తి వినిమయంలో తేడాలు ఏర్పడతాయి. అసలు మనకు ఎంత శక్తి ఉందనే విషయం తెలుసుకుంటే- దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటానికి వీలవుతుంది.

ఎన్ని రకాలు...
ఫెంగ్‌షూలో శక్తి ప్రసారం ఆధారంగా- మొత్తం మానవులందరినీ తూర్పు, పడమర వ్యక్తులుగా వర్గీకరిస్తారు. మనం ఏ దిక్కుకు చెందుతామో తెలుసుకోవాలంటే - కువా నెంబర్‌ను ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. కువా నెంబర్‌ను ఒక వ్యక్తి పుట్టిన (చైనీయుల) సంవత్సరం, స్త్రీ, పురుష భేదం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. చైనీయుల సంవత్సరాలకు ఆంగ్ల సంవత్సరాలకు మధ్య తేడా ఉంటుంది. ప్రతి ఏడాది చైనీయులకు కొత్త సంవత్సరం వేర్వేరు రోజుల్లో ప్రారంభమవుతుంది.

ఇంటర్నెట్‌లో మనం పుట్టిన సంవత్సరం ఆధారంగా- చైనీయుల సంవత్సరాన్ని తెలియజేసే వెబ్‌సైట్లు అనేకం ఉన్నాయి. వీటి ద్వారా మనం చైనా క్యాలెండర్ ప్రకారం ఏ సంవత్సరంలో పుట్టామో తెలుసుకోవచ్చు. స్త్రీ, పురుషులకు కువా నెంబర్‌ను ఎలా గణించాలో ఇప్పుడు చూద్దాం.

స్త్రీల కువా నెంబర్

చైనీయుల క్యాలెండర్ ప్రకారం వచ్చే మన జన్మ సంవత్సరంలోని చివరి రెండు అంకెలను కలపాలి. ఆ సంఖ్యకు ఐదు కలపాలి. (ఒక వేళ రెండంకెలు వస్తే- దానిని కూడా ఒక అంకెగా మార్చాలి). అప్పుడు వచ్చేదే కువా నెంబర్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అమ్మాయి చైనీయుల క్యాలెండర్ ప్రకారం 1998లో పుట్టిందనుకుందాం. ఆమె పుట్టిన సంవత్సరంలో చివరి రెండు అంకెలు కలిపితే (9+8) 17 అవుతుంది. ఈ రెండింటినీ కలిపితే 8 వస్తుంది. దీనికి 5 కలిపితే 13 అవుతుంది. ఈ రెంటినీ కలిపితే వచ్చే 4 ఆ అమ్మాయి కువా నెంబర్.

పురుషులకు కువా నెంబర్
దీనిలో కూడా సంవత్సరం చివరలో ఉన్న రెండు అంకెలను కలిపి ఒక సంఖ్య తేవాలి. దానిని పదిలో నుంచి తీసివేయాలి. అప్పుడు వచ్చేదే పురుషుల కువా నెంబర్. ఉదాహరణకు ఒక పురుషుడు 1965లో పుట్టాడనుకుందాం. చివర రెండు అంకెలను కలిపితే 11 వస్తుంది. ఆ రెండింటినీ కలిపితే రెండు అవుతుంది. దీనిని పదిలో నుంచి తీసేస్తే వచ్చే 8 సంఖ్య ఆ పురుషుడి కువా నెంబర్.

ఈ కువా నెంబర్ల ఆధారంగా ఒక వ్యక్తి తూర్పు, పడమర దిక్కులలో దేనికి చెందినవారో తెలుసుకోవచ్చు. ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం- 1,3,4, 9 సంఖ్యలకు చెందిన వారు తూర్పు దిక్కుకు చెందిన వారు. 2,5,6,7,8 సంఖ్యలకు చెందిన వారు పశ్చిమ దిక్కుకు చెందిన వారు.

ఫెంగ్ షూ : మన అదృష్ట దిక్కులను తెలుసుకోవటం ఎలా?
- శ్రీభావ

గత వారం కువా నెంబర్లను గణించటం తెలుసుకున్నాం. ఈ సారి ఈ కువా నెంబర్ల ద్వారా మనలోని శక్తిని ఎలా పెంచుకోవాలో, అదృష్టాన్ని దగ్గరకు ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం.
 కువా నెంబర్ల ఆధారంగా ఏఏ దిక్కుల్లో మన ఇంటిని, ఆఫీసును సర్దుకోవాలో తెలియజేసే ఒక చార్టును చూద్దాం..
ఈ చార్టు ప్రకారం మనకు అత్యంత ముఖ్యమైన వాటిని ముందుగా నిర్దేశించుకొని, దానికి తగినట్లుగా ఇంటిని, ఆఫీసును ఆ దిక్కులలో ఉండే విధంగా సర్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సార్లు భాగస్వాములకు, భార్యాభర్తలకు వేర్వేరు దిక్కులు వచ్చే అవకాశముంది. అప్పుడు ఇద్దరి చార్టుల్లోను ముఖ్యమైన దిక్కును తీసుకొని దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం దిక్కులు మంచివని వచ్చాయనుకుందాం. అతని భాగస్వామికి పశ్చిమం, ఈశాన్యం, ఉత్తరం, నైరుతి దిక్కులు మంచివని వచ్చాయనుకుందాం. అప్పుడు ఇంటిలో ముఖ్యమైన అంశాలకు ఉత్తరం దిక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సర్దుకోవాల్సి ఉంటుంది.

మన భారతీయ సంస్కృతిలో ఆవుకు ఒక విశిష్టమైన స్థానముంది. భారత్, నేపాల్ వంటి దేశాల్లో ఆవును కామధేనువుగా కొలుస్తారు. బౌద్ధమతంలో కూడా ఆవుకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. మన కోర్కెలను తీర్చటానికి ఆవును ఒక సాధనంగా బౌద్ధమతం పేర్కొంటుంది. ఆవును కరుణతో ఆదరిస్తే- అది మన కోర్కెలను తీరుస్తుందని బౌద్ధులు నమ్ముతారు. ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఆఫీసు టేబుల్‌పైన బంగారు నాణేలపై కూర్చుని ఉన్న ఆవు బొమ్మను పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుంది. ఇంట్లో ఆగ్నేయ మూల ఆవు బొమ్మను పెట్టుకుంటే కూడా ధనం సమృద్ధిగా చేకూరుతుందని నమ్మకం. మన దేశంలోని కొన్ని పురాతనమైన ఇళ్లలో కూడా ఆగ్నేయం మూల కృష్ణుడు, ఆవులు ఉన్న ఫోటోలు ఉంటాయి
Courtesy-Andhrajyothy

ఫెంగ్ షూ : అభివృద్ధికి ఎరువు రంగు చిహ్నం

- శ్రీభావ

కాంతి, రంగులు- ఈ రెండూ లేకపోతే ఈ ప్రపంచం నిస్సారమే. అంతే కాదు. అసలు మానవ మనుగడే కాంతిపై ఆధారపడి ఉంది. ఆ కాంతే మనుషులకు శక్తిని ఇస్తుంది. అలాంటి కాంతి అనేక రంగుల మిశ్రమం. ఈ రంగులను విడదీస్తే వాటిలోని శక్తి కూడా విడిపోతుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఫెంగ్ షూ చెబుతుంది.

ఈ రంగులలోని శక్తిని , ఫెంగ్ షూలోని ఐదు ఎలిమెంట్స్ (అగ్ని, భూమి, లోహం, నీరు, చెక్క)ను కలిపితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ ఐదు ఎలిమెంట్స్‌లకు ఏఏ రంగులు ప్రాతినిధ్యం వహిస్తాయో, వాటి వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం.

1. అగ్ని- (అదనపు శక్తి కోసం)
ఎరుపు, నారింజ, పింక్, ముదురు పసుపు రంగులు అగ్నికి చిహ్నాలు. అగ్ని వల్ల అదనపు శక్తి లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటికి దక్షిణ భాగంలో అగ్నికి ప్రాతినిధ్యం వహించే రంగులు వేస్తే - యజమానికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈశాన్యం, నైరుతి భాగాలలో అగ్ని రంగులు వేయటం వల్ల లైంగిక శక్తి ఉద్దీపనం చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వాత్సల్యం బాగా పెరుగుతుంది.

2. భూమి- (స్థిరత్వం, వృద్ధి కోసం)
లేత పసుపు, గోధుమ రంగు, మట్టి రంగు భూమికి చిహ్నాలు. భూమి స్థిరత్వాన్ని కలగజేస్తుంది. చక్కటి అనుబంధాలకు కారణమవుతుంది. శారీరక సమతౌల్యం కోసం ఉపయోగపడుతుంది. ఇంటికి ఈశాన్యం, నైరుతిలలో భూమి రంగులను ఉపయోగించాలి.

3. లోహం- (స్పష్టత, సామర్థ్యం కోసం)
దీని వల్ల ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. అనవసరపు ఆలోచనలు వేధించవు. తెలుపు, కాఫీ పొడి రంగులు దీనికి చిహ్నాలు. పడమర, ఉత్తర భాగాలలో లోహం రంగులను వాడటం వల్ల ఆలోచనలో స్పష్టత కలుగుతుంది. ఆఫీసులలో పై మూలలలో లోహపు రంగులు వేయటం వల్ల అనవసరపు చికాకులు కలగవు.

4. నీరు - (అన్నీ సమృద్ధిగా ఉండాలంటే)
ప్రతి రోజు తాజాగా, స్వచ్ఛంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. నలుపు, నీలం రంగులు దీని చిహ్నాలు. సమృద్ధిగా సంపద సమకూరాలంటే ఈ రంగులను ఇంటి ఉత్తర, తూర్పు భాగాలలో ఉపయోగించాలి. ఈ రంగులతో పాటు చిన్న చిన్న ఫౌంటెన్‌లను, అద్దాలను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

5. చెక్క (అభివృద్ధి)
ఫెంగ్ షూలో చెక్క అభివృద్ధికి చిహ్నం. సంపదకు, ఐశ్వర్యానికి, మంచి ఆరోగ్యానికి కూడా చెక్క చిహ్నం. బ్రౌన్, ఆకుపచ్చ రంగులు చెక్కకు ప్రాతినిధ్యం వహిస్తాయి. తూర్పు, దక్షిణ, ఆగ్నేయ భాగాలలో ఈ రంగులను ఉపయోగించటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. రంగులతో పాటు కొన్ని మొక్కలను ఈ భాగాలలో వాడాలి.

ఇంట్లో మొక్కలు పెట్టుకుంటే ఆక్సిజన్‌ను ఇస్తాయి. చెడు వాసనలు పీల్చుకుంటాయి. శక్తి ప్రసారంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సరిచేస్తాయి. ఫెంగ్‌షూ సిద్ధాంతం ప్రకారం- కొన్ని రకాల మొక్కల వల్ల సంపద కలుగుతుంది. ఈ మొక్కలను 'మనీ ట్రీ' (డబ్బు మొక్క) అని పిలుస్తారు. సాధారణంగా ఫెంగ్‌షూలో క్రాసులా ఒవేటా (శాస్త్రీయ నామం- దీనినే జేడ్ ట్రీ అని కూడా పిలుస్తారు) అనే మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పచీరా ఎక్విటికా అనే మొక్కను కూడా ఇంట్లో పెంచుతారు. దీనికి అనేక కాండాలు, ఆకులు ఉంటాయి
Courtesy-Andhrajyothy

ఫెంగ్ షూ : మహిళా శక్తికి చిహ్నం నలుపు

-శ్రీభావ

రంగులు మనలో రకరకాల భావావేశాలను ప్రేరేపిస్తాయి. తెల్ల రంగు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆరెంజ్ సత్సంబంధాలను పెంపొందిస్తుంది. నలుపు మిస్టరీకి, శక్తికి చిహ్నం. మట్టి రంగు స్థిరత్వాన్నిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం...

నలుపు చీకటికి, చిక్కదనానికి సంకేతం. ఫెంగ్ షూ సిద్ధాంతాల ప్రకారం- నలుపు మిస్టరీకి, శక్తికి కూడా చిహ్నం. మహిళలలో నిబిడీకృతమైన ఆధ్యాత్మిక శక్తిని కూడా నలుపుతో పోలుస్తారు. మిగిలిన రంగులతో పోలిస్తే నలుపుకు ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. ముఖ్యంగా పిల్లల గదులలోను, బెడ్ రూమ్‌లలోని సీలింగ్‌లలోను దీనిని అస్సలు వాడకూడదు. ఉత్తర, దక్షిణ, ఆగ్నేయ దిశలలో ఈ రంగును వాడవచ్చు. ఇంటి ముఖద్వారానికి దీనిని వాడితే ఎక్కువ శక్తి లభిస్తుంది. వృత్తిపరంగా ఎక్కువగా రాణించాలనుకొనేవారు ఉత్తర దిశలో ఈ రంగును ఎక్కువగా వాడాలి. సాధారణంగా ఈ రంగును గోడలకు వాడరు కాబట్టి- ఫర్నిచర్‌లోను, ఫొటో ఫ్రేములలోను ఈ రంగు ఉంటే మంచిది.

తెలుపు (కొత్త ఆశలకు నాంది)
ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం- తెలుపు నిర్మలత్వానికి, స్వచ్ఛతకు, కొత్త ఆశలకు చిహ్నం. మొత్తం అన్ని రంగులలో ఉన్న శక్తి- తెలుపులో ఉంటుంది. అన్ని యోగా పద్ధతుల్లోను తెలుపునకు ఒక విశిష్టత ఉంది. దాదాపు అన్ని సంస్కృతులలోను- పెళ్లి కూతురుకు తెల్లరంగు బట్టలే వేస్తారు. కొత్త ఆశలకు, కొత్త జీవితానికి నాందిగా తెలుపును భావిస్తారు కాబట్టే ఈ రంగు బట్టలు వేస్తారు. ఈ రంగును వాడటం వల్ల రకరకాల లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా దీనిని ఉపయోగించవచ్చు. పశ్చిమ, వాయవ్య దిక్కుల్లో లోహంతో చేసిన ఫర్నిచర్ లేదా ఫ్రేములకు తెల్లని రంగు వేసి ఉంచితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు, ఆగ్నేయ దిక్కుల్లో మొత్తం తెల్లరంగును వేయటం వల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

ఆరంజ్ (సామాజిక సంబంధాలకు చిహ్నం)
ఇంట్లో ఎర్ర రంగును ఉపయోగించటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు- దానికి బదులుగా ఆరంజ్ రంగును వాడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను పెంపొందించటానికి ఈ రంగు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శీతల వాతావరణంలో నివసించే వారు తమ ఇళ్లలో ఈ రంగును వేయించుకోవటం వల్ల అదనపు శక్తి అందుతుంది. వృత్తిలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలంటే దక్షిణ దిక్కులోను, ప్రేమ-పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఫలించాలంటే నైరుతీ దిక్కులోను, ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలంటే ఈశాన్య దిక్కులోను ఈ రంగును వాడాలి. అయితే పశ్చిమ దిక్కులో ఈ రంగును ఎక్కువగా వాడటం వల్ల సృజనాత్మకత మందగిస్తుంది. వాయవ్య దిక్కులో వాడితే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడతాయి. తూర్పు దిక్కులో ఎక్కువగా ఉపయోగిస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆగ్నేయంలో వాడితే ఆర్థిక నష్టం జరుగుతుంది.

మట్టి రంగు (స్థిరత్వానికి చిహ్నం)
కాఫీ, చాక్‌లెట్, గట్టి చేవ కర్ర- ఇలా ప్రకృతిలో మనకు ఎంతో ఉపకరించే వస్తువులన్నీ మట్టి రంగులోనే ఉంటాయి. ఒకప్పుడు ఫెంగ్‌షూలో ఈ రంగుకు పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ ఈ మధ్య కాలంలో దీనికి చాలా ఆదరణ లభిస్తోంది. ఆరోగ్యం కావాలనుకొనేవారు ఈ రంగును తూర్పు దిక్కులోను, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే వారు ఆగ్నేయ దిక్కులోను, కీర్తి ప్రతిష్టలు కావాలనుకొనేవారు దక్షిణ దిక్కులోను ఈ రంగును విరివిగా వాడాలి. ఇంటి ముఖ ద్వారం, వంటింటి ద్వారం, బెడ్ రూమ్‌లో వెనక గోడలకు ఈ రంగును వాడితే మంచిది.

ఫెంగ్ షూ : ఫెంగ్ షూ రంగుల కథ

- శ్రీభావ

కాంతి, రంగులు- ఈ రెండూ లేకపోతే ఈ ప్రపంచం నిస్సారమే. అంతే కాదు. అసలు మానవ మనుగడే కాంతిపై ఆధారపడి ఉంది. ఆ కాంతే మనుషులకు శక్తిని ఇస్తుంది. అలాంటి కాంతి అనేక రంగుల మిశ్రమం. ఈ రంగులను విడదీస్తే వాటిలోని శక్తి కూడా విడిపోతుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఫెంగ్ షూ చెబుతుంది.

తెల్ల రంగు చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎర్ర రంగు విప్లవాన్ని గుర్తుచేస్తుంది.. ఆకుపచ్చ కంటికి ఆహ్లాదంగా ఉంటుంది.. ఇలా రంగులు మనలో రకరకాల భావావేశాలను ప్రేరేపిస్తాయి.

ఫెంగ్ షూ రంగులు ప్రతిఫలించే భావోద్వేగాలను మాత్రమే కాదు.. అవి ప్రసారం చేసే శక్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇళ్లలోను, ఆఫీసుల్లోను రంగుల ద్వారా శక్తి సమతౌ ల్యం ఎలా సాధ్యమవుతుందో తెలియజేస్తుంది. అలాంటి కొన్ని రంగులను ఇప్పుడు చూద్దాం..

ఎరుపు- అగ్నికి చిహ్నం
అగ్ని సూర్యుడికి, జీవానికి చిహ్నం. సృష్టికి, వినాశనానికి కూడా చిహ్నమే. ఇది లేకపోతే జీవమే లేదు కాబట్టి అదృష్టానికి, సంతోషానికి ఎరుపు రంగు ప్రాతినిధ్యం వహిస్తుంది. హిందువులు పెళ్లి సమయంలో పెళ్లికూతురుకి ఎరుపు చీర కట్టడం సంప్రదాయం. చైనీయులు కూడా ఎరుపును తమ అదృష్టరంగుగా భావిస్తారు. అయితే ఎరుపు రంగును అవసరమైన మేరకు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఎరుపు రంగును డ్రాయింగ్ రూమ్‌లో, వంటింట్లో ఉపయోగించవచ్చు. కాని పిల్లల గదుల్లో తక్కువగా వాడాలి. తూర్పు, ఆగ్నేయం మూలల్లో ఎర్రటి రంగు వేసిన చెక్క ఫర్నిచర్ కాని సూర్యుడి పెయింటింగ్స్ కాని వాడితే మంచిది. పశ్చిమం, వాయవ్య దిక్కుల్లో లోహాలతో చేసిన పెయింటింగ్‌లకు ఎర్ర రంగు వేస్తే మంచిది. దక్షిణంలో ఎర్రటి రంగు ఉంటే కీర్తి ప్రఖ్యాతులు వస్తాయి.

పసుపు- శుభాలకు చిహ్నం
పసుపు శుభానికి చిహ్నం. ఎక్కడ పసుపు రంగు ఉంటుందో అక్కడ ఆనందం, ఆహ్లాదం వెల్లివిరుస్తాయని ఫెంగ్ షూ సిద్ధాంతం చెబుతుంది. పిల్లల గదుల్లోను, ఆఫీసుల్లోను, డ్రాయింగ్ రూమ్‌లలోను ఈ రంగు వేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ముదురు రంగులు వేసిన గదులలో కూడా పసుపు రంగు పెయింటింగ్‌లను పెడితే మంచిది. పసుపు రంగు క్రిస్టల్స్‌ను డ్రాయింగ్ రూమ్‌లో వేళ్లాడదీస్తే ఇంట్లో వారికి ఎటువంటి అనారోగ్యం కలగదు. పసుపు రంగును తూర్పు, ఆగ్నేయం, పశ్చిమం, వాయవ్యాలలో తక్కువ వాడాలి. దక్షిణం, నైరుతి, ఈశాన్య ప్రాంతాల్లో విరివిగా వాడచ్చు.

నీలం- నిశ్చలతకు చిహ్నం
ఆకాశ నీలం, సముద్ర నీలం, ఇండిగో నీలం- ఇలా రకరకాల నీలం షేడ్స్, వాటి వల్ల వచ్చే ఫలితాలను ఫెంగ్‌షూ సిద్ధాంతం వివరిస్తుంది. ఆరోగ్యం కోసం తూర్పు భాగంలోను, ధనం కోసమైతే ఆగ్నేయ భాగంలోను, కెరీర్ కోసమైతే ఉత్తర భాగంలోను నీలం రంగు వేయటం మంచిది. పిల్లల గదుల్లో సీలింగ్‌కు నీలం రంగు వేయటంవల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. పడక గదిలో నీలం రంగు క్రిస్టల్స్ పెట్టుకోవటం వల్ల ప్రశాంతత చేకూరుతుంది. నీలం, తెలుపు రంగులను కలిపి వాడితే ఇంట్లో శక్తివినియమంలో ఎటువంటి తేడాలు రావు.

ఆకుపచ్చ- ఆరోగ్యానికి చిహ్నం
ఫెంగ్‌షూ సిద్ధాంతం ప్రకారం ఆకుపచ్చ ఆరోగ్యానికి చిహ్నం. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పరిహరించే సామర్థ్యం ఈ రంగుకు ఉంటుంది. ఇంట్లో పచ్చటి మొక్కలను పెట్టుకోవటం వల్ల శక్తి సమతుల్యం అవుతుంది. అందువల్ల ఇంట్లో అరిసా చెట్లు (కొబ్బరి చెట్ల మాదిరి ఆకులు ఉంటాయి) పెట్టుకుంటే శక్తి ప్రసారం సజావుగా సాగుతుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన పరిశోధనల్లో ఈ చెట్టు ఇంట్లో ఉండే అన్ని వాసనలను తొలగిస్తుందని తేలింది.

(వచ్చే వారం తెలుపు, నలుపు, నారింజ, మట్టి రంగులు ఏం చెబుతాయో తెలుసుకుందాం)
Courtesy-Andhrajyothy

కవర్‌స్టోరీ : నేను..మలాలాను

మహిళలు చదువుకోకూడదు. బురఖాలు వేసుకోకుండా బయటకి రాకూడదు. కనీసం నెయిల్ పాలిష్ కూడా వేసుకోకూడదు... తాలిబన్ ఫత్వాలివి.
ఇస్లాం అందరికి సమాన హక్కులిచ్చింది. నేను చదువుకుంటే ఏమవుతుంది? బురఖా వేసుకోకుండా స్కూలుకు వెళ్తే ఏం చేస్తారు ?- అని ఒక పన్నెండేళ్ల పిల్ల ప్రశ్నించింది.
అగ్రరాజ్యం అమెరికాను సైతం గడగడలాడించిన తాలిబన్ ఈ ప్రశ్నలకు నివ్వెరపోయింది. ఏం చెప్పాలో తెలియక ఆమెపై బులెట్ల వర్షం కురిపించింది. కాని ఆ పిల్ల బులెట్లను సైతం తట్టుకొంది. దాడి జరిగిన ఏడాది లోపునే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంది. యూరోపియన్ యూనియన్ ప్రతి ఏడాది మానవ హక్కుల కార్యకర్తలకు ఇచ్చే అత్యున్నత బహుమతిని పొందింది. అతి చిన్న వయస్సులో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన వ్యక్తిగా చరిత్రకెక్కింది.
ఆమె పేరు మలాలా. ఆమె ఆత్మకథే 'ఐయామ్ మలాలా'. ఈ నెల 9వ తేదీన విడుదలయిన ఈ పుస్తకంలో కొన్ని ఆసక్తికర భాగాలే ఈ వారం కవర్ స్టోరీ..

అర్థరాత్రి పుట్టిన దేశం నాది. మధ్యాహ్నం సమయంలో నేను మరణానికి చేరువయ్యాను..
ఏడాది క్రితం.. నేను ఇంటి నుంచి స్కూలుకు వెళ్లా. మళ్లీ ఇప్పటి దాకా నేను మా ఇంటికి తిరిగి వెళ్లలేదు. నన్ను తాలిబన్లు బుల్లెట్లతో కాల్చారు. కొందరు నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లనన్నారు. కాని ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వెళ్తానని నా మనసుకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన దేశాన్ని వదిలి వెళ్లాలని ఎవరూ అనుకోరు. నేనూ అంతే! ప్రతి రోజు ఉదయం నేను నిద్ర లేచిన వెంటనే కళ్లు తెరిచి చూస్తా. నా స్వదేశం నుంచి ఐదు గంటల దూరంలో ఉన్నాననే సత్యం ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులతో పోలిస్తే నా దేశం వందల ఏళ్లు వెనకబడి ఉంది. సుఖవంతమైన జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్నాయి.

ప్రతి కుళాయి నుంచి వేన్నీళ్లు, చన్నీళ్లు వస్తాయి. స్విచ్ వేసిన వెంటనే లైట్లు వెలుగుతాయి. చమురు దీపాల అవసరమే ఉండదు. బజారు నుంచి గ్యాస్ సిలిండర్లు తేవాల్సిన అవసరముండదు. ఇక్కడ మన తిండి కూడా ప్యాకెట్లలో తినటానికి రెడీగా ఉంటుంది. కిటికీలో నుంచి బయటకు చూస్తే పెద్ద పెద్ద భవంతులు కనబడతాయి. నల్లటి రోడ్ల మీద వాహనాలు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. మరో వైపు చూస్తే లాన్లు కనిపిస్తాయి. కానీ నా కళ్లు మూసుకుంటే- స్వాట్ వ్యాలీ- కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక వైపు మంచు కొండలు... మరో వైపు పచ్చని చెట్లు... వేగంగా ప్రవహించే నదులు... ఇవన్నీ గుర్తుకొస్తే నా మనసు పులకించిపోతుంది. నా స్కూలు గుర్తుకొస్తుంది. నా స్నేహితురాలు మోనిబా కళ్లముందు కదులుతుంది. నేను, నా స్నేహితులు స్కూల్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కాని నేను లండన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్నది నిజం. కల చెదిరిపోతుంది.

***

2012, అక్టోబర్ 9. నా జీవితం మారిపోయిన రోజు. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాకు పరీక్షలంటే పెద్దగా భయం లేదు. స్వాట్ వ్యాలీలో తాలిబన్ల పాలన తర్వాత స్కూలు బోర్డులన్నీ మాయమైపోయాయి. బయట నుంచి చూస్తే లోపల స్కూలు ఉందనే విషయం కూడా తెలియదు. నాలాంటి అమ్మాయిలకు స్కూలు ఒక వేరే ప్రపంచం. అప్పటి దాకా మా ముఖాలను కప్పిఉంచిన స్కార్ఫ్‌లన్నీ మాయమైపోతాయి. మేము మా బ్యాగులన్నింటినీ క్లాస్‌రూమ్‌లో ఉంచి మార్నింగ్ అసెంబ్లీ కోసం గ్రౌండ్‌లోకి వస్తాం. పైన ఆకాశం.. చుట్టూ పర్వతాలు.. మధ్యలో మేము. ఒక అమ్మాయి 'ఆసాన్ భాష్' (స్టాండ్ ఎట్ ఈజ్) అని అరుస్తుంది. మేము మా కాళ్లను నేలకు వేసి కొడతాం. 'అల్లా' అని అరుస్తాం.

ఆ తర్వాత ఆమె 'హోషియార్' (అటెన్షన్) అని అరుస్తుంది. మేమందరం మళ్లీ అల్లా అని అరుస్తాం. ఆ స్కూలును నేను పుట్టకముందు మా నాన్న స్థాపించాడు. గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గోడ మీద 'కుషాల్ స్కూల్' అని పెద్ద పెద్ద అక్షరాల్లో రాసి ఉంటుంది. మేము వారానికి ఆరు రోజులు స్కూలుకు వెళ్తాం. ఉర్దూ గ్రామర్ చదువుతాం. ఇంగ్లీషులో స్టోరీలు రాయటానికి ప్రయత్నిస్తాం. నా స్నేహితుల్లో చాలామందికి డాక్టర్ కావాలనేది ఒక కల. వారు డాక్టర్లు కావటం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని స్కూలు బయట చాలా మంది అలా అనుకోరు. స్వాట్ వ్యాలీలోని ప్రధాన నగరమైన మింగోరాకు చెందిన కొందరికి, తాలిబన్‌లకు అమ్మాయిలు చదువుకోవటం ఇష్టం లేదు.


ఆ రోజు కూడా మామూలుగానే ప్రారంభమయింది. పరీక్ష మాత్రం ఒక గంట ఆలస్యంగా మొదలయింది. ఆ రోజు నేను ఆలస్యంగా లేచా. అందువల్ల ఉదయాన్నే లేచి చదువుకోవటానికి వీలు కాలేదు. ఒక గంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభం కావటం వల్ల నాకు చదువుకోవటానికి సమయం చిక్కింది. ఉదయాన్నే మా నాన్న ప్రతి రోజు మాదిరిగానే 'టైం అయిపోయింది..జానేమన్' అని లేపాడు. 'కొద్దిసేపు పడుకోనీ..అబ్బా' అన్నా. ఆ తర్వాత మా అమ్మ వచ్చి 'పిషో' అని గట్టిగా అరిచింది. పర్షియన్‌లో పిషో అంటే పిల్లి అని అర్థం. మా అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరిది. "బాబీ..లేటు అయింది..'' అని గట్టిగా అరిచా. మా సంస్కృతిలో మగవాళ్లందరిని సోదరులని పిలుస్తాం. ఆడవాళ్లను సోదరి అని పిలుస్తాం. సోదరుడి భార్య వదిన అవుతుంది. మా నాన్న స్కూలు పెట్టినప్పుడు అమ్మను అక్కడకు తీసుకువెళ్లాడు. అక్కడ పనిచేసేవారు- అమ్మను బాబీ(వదిన) అని పిలిచేవారు. అమ్మను ఏడిపించాలంటే అప్పుడప్పుడు నేను కూడా అలా పిలుస్తూ ఉంటా.

మా ఇంటి ముందు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఒక బెడ్, ఒక బీరువా ఉంటుంది. ఈ ఫర్నిచర్‌ను నేనే కొన్నా. స్వాట్ వ్యాలీలో శాంతి కోసం ప్రచారం చేసినందుకు, ఆడపిల్లలు స్కూలుకు వెళ్లాలని ప్రచారం చేసినందుకు నాకు వచ్చిన అవార్డుల ద్వారా ఈ ఫర్నిచర్ కొన్నాను. ఆ బీరువాలో నాకు క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు బహుమతిగా ఇచ్చిన ట్రోఫీలు ఉన్నాయి. నేను రెండే రెండుసార్లు క్లాస్ ఫస్ట్ రాలేదు. ఆ రెండు సార్లు మల్కానూర్ ఫస్ట్ వచ్చింది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈసారి నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలని కష్టపడి చదివా.

స్కూలు మా ఇంటికి దగ్గరలోనే ఉంది. గతంలో నడిచే వెళ్లేదాన్ని. తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత బస్సులో వెళ్ళాల్సి వచ్చేది. బస్సులో వెళ్తే ఐదు నిమిషాలు పడుతుందంతే. స్కూలుకు వెళ్లే దారిలో డాక్టర్ హుమయూన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. మా స్కూల్లో మాస్టర్లకు హఠాత్తుగా జట్టు రావటానికి డాక్టర్ హుమయూన్ కారణమని మేము జోకులు వేసుకుంటూ ఉంటాం. నాకు బస్సులో వెళ్లడమంటే ఇష్టం. బస్సు డ్రైవర్ ఉస్మాన్ అలీని 'భాయిజాన్'(సోదరుడు) అని పిలుస్తాం. అతను రకరకాల కథలు చెప్పి మమల్ని నవ్విస్తూ ఉంటాడు.

నేను బస్సులో వెళ్లటానికి మరో కారణం కూడా ఉంది. ఏడాది నుంచి నాకు తాలిబన్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పత్రికల్లో వార్తల రూపంలో కొన్ని బెదిరింపులు వచ్చాయి. చిన్న చిన్న చీటీల మీద బెదిరింపులు రాసి గుర్తు తెలియని వ్యక్తులు నా మీద విసిరేవారు. దీనితో మా అమ్మ నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నడిచి స్కూలుకు వెళ్లనిచ్చేది కాదు. తాలిబన్లు ఎప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకోలేదు. అందువల్ల నేను పెద్దగా భయపడలేదు. మా నాన్నపై దాడి చేస్తారనే భయం మాత్రం ఉంది. మా నాన్న తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. అందుకే వాళ్లు మా నాన్న స్నేహితుడు జహీద్‌ఖాన్‌ను ఆగస్టులో నుదుటి మీద కాల్చి చంపేశారు. మసీదుకు ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో అందరూ నాన్నను- "జాగ్రత్తగా ఉండు.. ఇక నీ వంతే'' అని హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు భయమేసేది.

మా వీధిలోకి బస్సు రాదు. అందువల్ల వీధి చివరే బస్సు దిగి ఇంటికి నడిచివచ్చేదాన్ని. ఎవరైనా దాడి చేస్తే ఇక్కడే చేస్తారని అనుకొనేదాన్ని. నేను వీధిలో నడుస్తూ ఉంటే హఠాత్తుగా ఒక టెర్రరిస్టు నా మీదకు దూకి కాల్చేసినట్లు కలలు వచ్చేవి. ఆ సమయంలో ఏం చేయాలని ఆలోచించేదాన్ని. కాలికి ఉన్న చెప్పు తీసి ఆ టెర్రరిస్టును కొట్టాలనుకొనేదాన్ని. కానీ అలా చేస్తే నాకు, టెర్రరిస్టుకు తేడా ఏముందనిపించేది. దాని కన్నా అతనిని- "నన్ను కాల్చు. కానీ నేను చెప్పేది విను. నువ్వు చేస్తున్నది తప్పు. నాకు, నీకు ఎలాంటి శతృత్వం లేదు. ప్రతి అమ్మాయి స్కూలుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా. అంతకు మించి నాకేం తెలియదు'' అని ప్రార్థించాలనిపించేది.

రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత గేటు తాళం పెట్టేదాన్ని. చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచిస్తూ పడుకొనేదాన్ని. నా ఆలోచనలన్నీ నా ప్రాణ స్నేహితురాలు మోనిబాకు చెప్పేదాన్ని. నాకు మోనిబా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. జస్టిన్‌బీవర్, ట్విలైట్ మూవీస్ దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల దాకా అన్ని విషయాలు మాట్లాడుకొనేవాళ్లం. మోనిబాకు ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది కోరిక. కానీ వాళ్లింట్లో ఒప్పుకోరని తెలుసు. అందువల్ల అందరితోను డాక్టర్ అవుతానని చెబుతూ ఉండేది. మా సమాజంలో అమ్మాయిలు టీచర్లు కావాలి. లేదా డాక్టర్లు కావాలి. ఇతర వృత్తుల్లో చేరటానికి అవకాశమే ఉండదు. నాకూ చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండేది. ఆ తర్వాత సైంటిస్ట్ కావాలనుకున్నా. రాజకీయాల్లోకి వెళ్లాలని ఉండేది. ఈ విషయం చెబితే మోనిబా భయపడింది. తాలిబన్లకు తెలిస్తే చంపేస్తారని హెచ్చరించింది. "ఏం భయపడకు. మనలాంటి వాళ్ల కోసం తాలిబన్లు బులెట్లు వేస్ట్‌చేసుకోరు'' అని ఆమెకు చెప్పా.

ఆ రోజు బస్సు హారన్ మోగిన వెంటనే మేమందరం పరిగెత్తుకుంటూ వీధి చివరకు వెళ్లాం. బస్సు అంటే మామూలు బస్సు కాదు. టయోటా టౌన్ ఏస్ ట్రక్కులో మూడు బెంచీలు వేసి ఉండేవి. దానిలో 20 మంది విద్యార్థులం, ముగ్గురు టీచర్లు కూర్చునేవాళ్లం. నా పక్కనే మోనిబా కూర్చునేది. మా బ్యాగులన్నీ బెంచీల కింద పెట్టేవాళ్లం.


ఆ రోజు ఉదయం ఎండగా ఉంది. బస్సు లోపల చాలా ఉక్కగా ఉంది. ట్రక్కు అన్ని వైపులా మూసేసి ఉంది కాబట్టి బయటకు చూడటానికి కూడా లేదు. బయట బాగా ఎండగా ఉందని మాత్రం తెలుస్తోంది. బస్సు కుడివైపునకు తిరగటం మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత అంతా ఒక కలలా జరిగిపోయింది. మాకు కుడివైపు స్వాట్ వ్యాలీ తొలి ఆర్థిక మంత్రి షేర్ మహ్మద్ ఖాన్ సమాధి ఉంది. ఎడమ వైపు ఒక ఫ్యాక్టరీ ఉంది. రోడ్డుకు అడ్డంగా లేత రంగు బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చాడు. బస్సును ఆపమని చేతులు ఊపాడు. "కుషాల్ స్కూలు బస్సు ఇదేనా?'' అని మా డ్రైవర్‌ను అడిగాడు.

భాయ్‌జాన్ అవునని సమాధానమిచ్చాడు. "కొంత మంది పిల్లలకు సంబంధించిన సమాచారం కావాలి'' అని ఆ వ్యక్తి డ్రైవర్‌ను అడిగాడు. "స్కూలు ఆఫీసులో తెలుసుకోండి'' అని భాయ్‌జాన్ సమాధానమిచ్చాడు. ఒక వైపు అతను మాట్లాడుతుంటే- మరో వైపు ఒక వ్యక్తి బస్సు వెనకవైపు వచ్చాడు. "ఎవరో జర్నలిస్టు నిన్ను ఇంటర్వ్యూ చేయటం కోసం వస్తున్నాడు..'' అంది మోనిబా. ఆ వస్తున్న వ్యక్తి మోహానికి రుమాలు కట్టి ఉంది. ఒక కాలేజీ స్టూడెంట్‌లా ఉన్నాడు తప్ప జర్నలిస్టులా లేడు. బస్సుపైకి ఎక్కి- "మలాలా ఎవరు?''అని అడిగాడు. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాని చాలా మంది నావైపు చూశారు. బస్సు మొత్తం మీద మొహాన్ని కవర్ చేసుకోంది నేను ఒక్కదాన్నే.

అతను నల్లటి తుపాకీని బయటకు తీసాడు. బస్సులో ఉన్నవారందరూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను మోనిబా చేతిని గట్టిగా పట్టుకున్నా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మూడు సార్లు కాల్చాడని నా స్నేహితులు తర్వాత చెప్పారు. ఒక బుల్లెట్ నా కంటిలోపలి నుంచి వెళ్లిపోయింది. మరో బుల్లెట్ ఎడమ భుజాన్ని తాకింది. మూడో బుల్లెట్ నా ఎడమ చెవికి తగిలింది. నాపక్కన కూర్చున్న షాజియా, కైనాత్ రియాజ్‌లకు కూడా బులెట్లు తగిలాయి. కాలుస్తున్న సమయంలో ఆ వ్యక్తి చేతులు వణికాయని నా స్నేహితులు చెప్పారు. నేను ఆసుపత్రికి వెళ్లే సమయానికి మోనిబా ఒళ్లంతా రక్తమే.

నా పేరు వెనక కథ
అఫ్గానిస్థాన్‌లో పుట్టిన గొప్ప మహిళలలో మలాలా ఒకరు. పస్థూన్ తెగకు చెందిన మలాలా గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. 1880లో అఫ్గానిస్థాన్‌పై బ్రిటీష్ వారు దండెత్తారు. అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బ్రిటీష్‌వారు ఘోరంగా విఫలమయ్యారు. బ్రిటీష్ వారిని ఘోరంగా ఓడించటంలో పస్థూన్ తెగ కీలకమైన పాత్ర పోషించింది. పస్థూన్‌లు బ్రిటీష్ వారిపై తిరగబడటంలో మలాలా పాత్ర చిరస్మరణీయమైనది.

కాందార్ సమీపంలో మైవాండ్ అనే చిన్న గ్రామంలో ఒక పశువుల కాపరి కూతురు మలాలా. ఆమెకు చిన్నప్పుడే మరొక పశువుల కాపరితో నిశ్చితార్థం చేసేశారు. బ్రిటీష్ వారితో యుద్ధం రావటంతో- మలాలా నాన్న, ఆమెకు కాబోయే భర్త కూడా యుద్ధానికి వెళ్లారు. వారందరికి సాయం చేయటం కోసం మైవాండ్‌కు చెందిన మహిళలందరూ యుద్ధరంగానికి వెళ్లారు. మలాలా, ఇతర మహిళలు యుద్ధరంగానికి వెళ్లే సమయానికి- బ్రిటీష్ వారి చేతితో పస్థూన్లు ఓడిపోతున్నారు. తమ వాళ్లు ఓడిపోవటం చూసి మలాలా సహించలేకపోయింది. తన బురఖాను తీసేసింది. బ్రిటిష్ సైనికుల వైపు పరుగెత్తుకు వెళ్లింది. తన వాళ్లకేసి చూసి- "మైవాండ్ యుద్ధంలో మీరు అమర వీరులు కాకపోతే, మీ జీవితాలు వృధా'' అని గట్టిగా అరుస్తూ బ్రిటీష్ సైనికుల బుల్లెట్లకు నేలకొరిగింది.

తమ గ్రామానికి చెందిన ఒక యువతిని బ్రిటీష్ సైనికులు చంపటం చూసి పస్థూన్లు తట్టుకోలేకపోయారు. బ్రిటీష్ సైన్యాన్ని ఊచకోత కోశారు. రెండో అఫ్గాన్ యుద్ధంలో ఎవరూ మరచిపోలేని సంఘటన ఇది. ఇప్పటికీ అఫ్గానిస్థాన్‌లో అనేక స్కూళ్లకు ఆమె పేరే ఉంటుంది. అయితే నాకు ఆ పేరు పెట్టడం మా తాతకు ఇష్టం లేదు. "అది ఒక విషాదమైన పేరు. మలాలా అంటే విషాదభరితమైనది అని అర్థం. ఆ పేరు వద్దు'' అని అడ్డుకున్నాడు. కాని మా నాన్న నాకు ఆ పేరే పెట్టాడు. చిన్నప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా- నా పేరు వెనకున్న కథను చెప్పేవాడు.

ఇలా మొదలైంది..
ఒక రోజు అబ్దుల్ హై కాకర్ అనే బీబీసీ రేడియో రిపోర్టర్ నుంచి మా నాన్నకు ఫోన్ వచ్చింది. తాలిబన్ల పాలనలో ఒక స్కూలుకు వెళ్లే అమ్మాయి జీవితం ఎలా ఉందో ప్రపంచానికి తెలియజేయటానికి వారు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నారని కాకర్ చెప్పాడు. ఒక అమ్మాయి తన ప్రతి రోజు జీవితాన్ని డైరీ రూపంలో రాస్తే దానిని వారు తమ వెబ్‌సైట్‌లో పెడతారు. దాని కోసం ఎవరైనా ఒక అమ్మాయిని చూడమని కాకర్ నాన్నను కోరాడు. నాన్న తన దగ్గర పనిచేసే అనేక మందిని అడిగాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఒక రోజు నాన్న ఈ విషయాలు ఎవరితోనో మాట్లాడుతుంటే నేను విన్నా. "నేను రాస్తా నాన్న..'' అని అడిగా. నాన్న వెంటనే అంగీకరించాడు. అప్పటి దాకా నాకు డైరీ ఎలా రాయాలో తెలియదు. పైగా మా ఇంట్లో కంప్యూటర్ కూడా లేదు. మొదట్లో కాకర్ ప్రతి రోజు నాకు ఫోన్ చేసేవాడు.

రకరకాల ప్రశ్నలు అడిగేవాడు. నా కలల గురించి, నా ఆలోచనల గురించి, వ్యక్తుల గురించి అడిగేవాడు. వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి డైరీ రూపంలో రాసేవాడు. దానిని బీబీసీ ఉర్దూ వెబ్‌సైట్‌లో వారానికి ఒకసారి పెట్టేవారు. నా అసలు పేరు పెడితే ప్రమాదం కాబట్టి- వెబ్‌సైట్‌లో నా పేరును గుల్ మకాయ్ (జొన్న పువ్వు) అని పెట్టేవారు. నా డైరీలో మొదటి పేజీ 2009, జనవరి 9వ తేదీన వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమయింది. నెల రోజుల లోపులోనే ఈ డైరీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించటం మొదలుపెట్టింది. ప్రపంచంలో అనేక పత్రికలు దీనిని ప్రచురించాయి. ఈ డైరీ ఎవరు రాస్తున్నారనే విషయాన్ని తాలిబన్లు కూడా ఆరా తీయటం మొదలుపెట్టారు.


మహిళల జీవితం దుర్భరం
గ్రామంలో మహిళల జీవితం అనేక కట్టుబాట్ల మధ్య నడిచేది. మహిళలు బురఖా వేసుకోకుండా బయటకు రాకూడదు. సన్నిహిత బంధువులతో తప్ప ఇతర పురుషులతో మాట్లాడకూడదు. నేను టీనేజర్‌ను అయిన తర్వాత కూడా బురఖా వేసుకొనేదాన్ని కాదు. దీనితో మా బంధువులకు చాలా కోపంగా ఉండేది. ఒక రోజు బంధువొకాయన మా నాన్న దగ్గరకు వచ్చి- "మలాలా బురఖా వేసుకోవటం లేదు.. వేసుకొమ్మని చెప్పు'' అని ఒత్తిడి పెట్టాడు. మా నాన్న- "అది నా కూతురు. దాన్ని ఎలా పెంచాలో నాకు తెలుసు. మీ పని మీరు చూసుకోండి'' అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత మా బంధువులు ఆ విషయం గురించి మాట్లాడటం మానేశారు. కాని మేము పస్థూన్ తెగ సంప్రదాయాలను పాటించటం లేదని పుకార్లు పుట్టించటం మొదలుపెట్టారు. మా తెగలో మహిళలను సరిగ్గా చూసేవారు కాదు. వారికి చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు.

కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఎవరితోనైనా ప్రేమలో పడితే- నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. మా ఇంటి దగ్గర సీమ అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. ఆమె మా గ్రామంలో ఉన్న ఒక కుర్రాడిని ప్రేమించింది. పెద్దలకు తెలియకుండా ఇద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. ఒక రోజు ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. కాని ఆమెను ఇంట్లోవారే విషం ఇచ్చి చంపేశారని ఆ తర్వాత తెలిసింది. ఇలాంటి వాటితో పాటుగా- మా తెగలో స్వర అనే ఒక సంప్రదాయముండేది. మాకు, వేరే తెగవారికి మధ్య తగువు వస్తే- దానిని పరిష్కరించుకోవటానికి ఒక అమ్మాయిని ఆ తెగ వారికి ఇచ్చేసేవారు. ఆ తెగలో పురుషులు ఆ అమ్మాయిని తమ సుఖాలకు వాడుకొనేవారు. ఈ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాని అనధికారికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మా ఊర్లో సురయ అనే ఒక విధవ ఉండేది. ఆమె వేరే తెగకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.


పస్థూన్ సంప్రదాయం ప్రకారం- గ్రామ పెద్దలకు తెలియకుండా విధవలు పెళ్లి చేసుకోకూడదు. ఈ విషయం తెలిసి సురయ కుటుంబం సభ్యులు జిర్గా (పంచాయితీ) పెట్టించారు. అవతల తెగకు చెందిన వారిని కూడా పిలిపించారు. వారి తెగలో ఉన్న అందమైన అమ్మాయిని, మా తెగలో ఉన్న ఎందుకూ పనికి రాని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని తీర్పు ఇచ్చారు. రెండు తెగల మధ్య వైరం- ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసింది.. ఇలాంటి సంప్రదాయాల వల్ల మహిళలు నష్టపోతున్నారని చాలా సార్లు మా నాన్నతో వాదించేదాన్ని. గతంలో పరిస్థితులు మరింత కఠినంగా ఉండేవని చెప్పేవాడు నాన్న. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల చట్టాలు చేశారు. మహిళలు నవ్వటాన్ని నిషేధించారు. తెల్ల రంగు పురుషులకు మాత్రమే చెందుతుందని ప్రకటించి- మహిళలు తెల్ల బూట్లు వేసుకోవటాన్ని నిషేధించారు. గోళ్ల రంగు వేసుకుంటే కొరడాతో కొట్టేవారు. ఇలాంటివన్నీ నాన్న చెబుతున్నప్పుడు నా ఒళ్లు భయంతో జలదరించేది.

అనువాదం : సివిఎల్ఎన్
Courtesy-Andhrajyothy

విజయం: ఓ అపూర్వ గాథ!

Sakshi | Updated: October 13, 2013 02:30 (IST)
విజయం: ఓ అపూర్వ గాథ!
అపూర్వ పురోహిత్.. దేశంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థల్ని నడుపుతున్న అతి కొద్ది మంది మహిళా సీఈవోల్లో ఒకరు! ‘‘మగాళ్లకేంటండీ.. ఏమైనా చేయగలరు.. మేం పిల్లల్ని కనాలి, పెంచాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలి...  మేం ఎదగడానికి అడుగడుగునా అడ్డంకులే’’.. అని వాదించే మహిళలందరికీ అపూర్వ జీవితం ఓ పాఠం! ఆమె అందరు మహిళల్లాగే పెళ్లి చేసుకుంది.. పిల్లల్ని కంది.. వాళ్లను పెంచి పెద్ద చేసింది.. ఇంటి బాధ్యతలన్నీ చూస్తోంది! ఇన్నీ చేస్తూ కెరీర్లోనూ ఎదిగింది! పాతికేళ్లుగా మీడియా రంగంలో అనేక సంస్థల్లో పని చేస్తూ...

  గత ఎనిమిదేళ్లుగా ‘రేడియో సిటీ’ని నడిపిస్తున్న అపూర్వ కథ.. నిజంగా ఓ అపూర్వమైన విజయగాధ! ఎంచక్కా ‘రేడియో సిటీ’లో పాటలు వింటూ సేదదీరే కోట్లాది మంది శ్రోతలకు ఆ కార్యక్రమాల వెనుక ఎంత వ్యవహారం ఉంటుందో తెలియదు. వందలాది మంది నిపుణుల సృజనాత్మక ఆలోచనలు, శ్రమ కలిస్తేనే ఈ కార్యక్రమాలు. మధ్యలో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలు.. ప్రచార కార్యక్రమాలు.. మార్కెటింగ్.. ఇలా తెర వెనుక చాలా బాధ్యతలుంటాయి. వీటన్నింటికీ నేతృత్వం వహించేది, మార్గనిర్దేశం చేసేది సీఈఓ.

 ఈ పనిని ఎనిమిదేళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు అపూర్వ. 4 కేంద్రాల్లో ఉన్న రేడియో సిటీని దేశవ్యాప్తంగా 20 నగరాలకు విస్తరించిన ఘతన ఆమెదే. వ్యూహాల ప్రణాళిక, బడ్జెట్, ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్, కార్యక్రమాల రూపకల్పన.. రోజూ ఇన్ని వ్యవహారాలు చూస్తారామె. ఇవి కాక ఉద్యోగుల నియామకం కూడా ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఐతే రేడియో సిటీ సీఈఓ పదవి అపూర్వకు తేలిగ్గా దక్కలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల పాటు మీడియా, టెలివిజన్ రంగంలో ఆమె పడిన శ్రమే ఆమెనీ స్థాయికి చేర్చింది.

 చండీగఢ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అపూర్వ దేశంలోని అనేక ప్రాంతాల్లో తన చదువు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి తరచుగా బదిలీ అయ్యేవారు. స్కూల్ చదువు ముంబయిలో పూర్తి చేసి, చెన్నైలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎంలో పీజీ డిప్లమా చేశారు. మార్కెటింగ్ ఉద్యోగం వచ్చినా కాదనుకుని, ‘రెడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరారు. తర్వాత ఎఫ్‌సీబీ ఉల్కా అడ్వర్టైజింగ్ సంస్థలో మీడియా బయింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించారు.

 ఇక్కడే టీవీ రంగంలో ఆమె కెరీర్‌కు పునాది పడింది. అప్పటికి టీవీ ఛానెల్స్‌లో సమయాన్ని కొనడం, ప్రోగ్రామ్స్  రూపొందించడం, ప్రకటనలు సంపాదించడం.. ఈ వ్యవహారాలన్నీ కొత్త! ఈ పనులన్నీ సమర్థంగా చేసి తానేంటో నిరూపించుకున్నారు అపూర్వ. క్రమంగా మీడియా బయింగ్ కన్సల్టన్సీలు పెరగడంతో అపూర్వకు అవకాశాలు పెరిగాయి. పదేళ్ల పాటు వివిధ కంపెనీల్లో పని చేశారు. ఈ అనుభవం ఆమెకు 2002లో జీ టీవీకి ప్రెసిడెంట్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అక్కడా తనదైన ముద్ర వేశారు అపూర్వ.

 జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది. తర్వాత టైమ్స్ గ్రూప్ 2004లో ‘జూమ్’ ఛానెల్‌ను ప్రారంభించే పనిని అపూర్వకే అప్పగించింది. ఏడు నెలల్లో ఛానెల్‌ను లాంచ్ చేయించడంలో అపూర్వ కీలక పాత్ర పోషించింది. ఐతే కొన్ని కారణాల వల్ల అందులోంచి బయటికి వచ్చేశారు. తర్వాత రేడియో సిటీ సీఈఓ పదవి వరించింది.

 మహిళా సాధికారత గురించి అపూర్వ ‘లేడీ, యు ఆర్ నాట్ ఎ మేన్’ అనే పుస్తకం రాశారు. పురుషులతో సమానంగా మహిళలు ఎలా ఎదగగలరో విశదీకరించారీ పుస్తకంలో. మహిళాలోకానికి ఈ పుస్తకం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహిళా సాధికారత గురించి కేవలం లెక్చర్లతో సరిపెట్టకుండా చేతల్లోనూ చూపిస్తున్నారు. ‘రేడియో సిటీ’లోని సీనియర్ మేనేజర్లలో సగం మంది మహిళలే. మిగతా ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారామె. జీ ఛానెల్ సంప్రదాయ కార్యక్రమాల్ని ఆపి.. అస్తిత్వ, చౌషాంత పన్నె వంటి కొత్త కార్యక్రమాల్ని తీసుకొచ్చారు. వీటికి ఆదరణ వచ్చింది.
-  ప్రకాష్ చిమ్మల
Courtesy-Sakshi

అందర్నీ కలిపితే...అదే వ్యాపారం!

Sakshi | Updated: October 20, 2013 02:34 (IST)
అందర్నీ కలిపితే...అదే వ్యాపారం!
 విజయం
 కష్టం వృథా పోదు.. అంటారు. చక్కటి ఆలోచన కూడా వృథా పోదు... ఇప్పుడు ఇంకో మాట చేర్చాలి.  ఇది నమ్మండి. రుజువు అవసరం అనిపిస్తే ఈ కథనం చదవండి. ఇండియాలో పుట్టి, అమెరికాలో చదివి, ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టి మూడేళ్లలో దాన్ని ఇరవై రెట్లు పెంచారు. ఆ కథేంటో... ఆమె సాధించిన విజయం ఏంటో తెలుసుకుంటే... విజయలక్ష్మి దరి చేరడానికి ఎన్ని మెట్లు అవసరమో తెలుస్తుంది.

 ఇరవై సంవత్సరాలు వెనక్కు వెళ్తే... 1993లో ఓ యువతి అమెరికాలోని ప్రతిష్టాత్మకమై మసాచుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రీజనల్ ప్లానింగ్‌లో పీజీ పట్టా పొందింది. ఇపుడు ఆమెకు నలభై ఏడేళ్లు. ఈ మధ్య కాలంలో ముంబైకి చెందిన విజయ పాస్టాలా సాధించిన విజయమే అండర్ ద మ్యాంగో ట్రీ (యుటిఎంటి). అమెరికాకు చదువు కోసం వెళ్లినా అక్కడి అద్భుతాలేమీ ఆమెను అక్కడే ఉండేలా చేయలేదు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఆ ఏడాదే మహారాష్ర్టలో లాతూర్ భూకంపం. ఎవరో ఈమె సేవలు కోరితే... మనసులో కాస్త సేవా భావం కూడా ఉంది కాబట్టి అక్కడ సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు.

 ఆ సందర్భంగా లాతూరు పరిసరాల్లో బాగా తిరిగారు. దీంతో అక్కడి ఆ వాతావరణం కూడా ఆమెకు తెలిసొచ్చింది. మామిడి చెట్టు కిందే సకల వ్యాపారాలు జరుగుతున్న ఓ సంత ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పుడే అనుకున్నారు. భవిష్యత్తులో తాను వ్యాపారం పెడితే దానికి ‘అండర్ ద మ్యాంగో ట్రీ’ అనే పేరే పెట్టాలని. ఆరోజు రానే వచ్చింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆమె వ్యాపారం పెట్టినా కూడా అదే పేరు పెట్టుకున్నారు.

 విజయ పన్నెండేళ్లు డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌గా పనిచేశారు. తల్లి కావడంతో కొంతకాలం ఆ ఉద్యోగం మానేశారు. అనంతరం తాత్కాలికంగా చేస్తూ చివరకు 2008లో వ్యాపారమనే గమ్యం వైపు అడుగులేశారు. కొందరు వ్యాపారం కూడా పరోక్షంగా ఒక సమాజ సేవే అంటారు. ఎందుకంటే అది అవసరాలు తీరుస్తుంది, ఉపాధి సృష్టిస్తుంది కాబట్టి. అయితే విజయ దానిని ప్రత్యక్ష సేవగా చేయడమే కాదు, లాభదాయకమైన వ్యాపారంగా కూడా చేశారు. విభిన్నమైన రంగంలో, వినూత్న విధానంతో సక్సెస్‌ను రుచిచూశారు. తనతో పాటు చాలామందిని వ్యాపారంలో భాగస్వాములను చేసి వారికి ఆ ఫలాలు అందించారు.

 కేవలం 3 లక్షల మూలధనంతో ప్రొప్రెయిటర్‌గా ‘అండర్ ద మ్యాంగో ట్రీ’ ఆవిర్భవించింది. అడవి నుంచి, పొలం నుంచి వచ్చే మూల ఉత్పత్తులకు ఒక బ్రాండ్ సృష్టించడం ద్వారా వాటి డిమాండ్ పెంచడం, పేదల జీవితాలను బాగుచేయడం ఆ కంపెనీ చేస్తుంది. ఈ అనుసంధాన ప్రక్రియలో కంపెనీ కూడా లాభపడుతుంది. పరిశుభ్రమైన, దీర్ఘకాలం నిల్వ ఉండే పద్ధతులతో ఆమె కమ్యూనిటీ బీ-కీపింగ్‌ను ప్రోత్సహించారు. ఈ తేనెటీగల పరిశ్రమలో ఆమె ఓ కొత్త కోణాన్ని కూడా చూశారు.

  ఫలదీకరణానికి కారణమయ్యేవి ఈ తెనేటీగలే. కాబట్టి వాటిని పెంచడం ద్వారా తేనెటీగల ఉత్పత్తితో పాటు పంట దిగుబడి కూడా పెరుగుతుందంటారామె. ఆమె గిరిజనుల నుంచి తేనెతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా స్వీకరించి వాటిని చక్కగా ప్రాసెస్ చేసి పట్టణ ప్రాంతీయులకు స్వచ్ఛమైన ఉత్పత్తులు అందజేస్తారు. అంతేకాదు... సేకరణలో కూడా పరిశుభ్రత, పద్ధతి ఉండాలని వ్యవసాయదారులకు, గిరిజనులకు చక్కటి శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు... సింగిల్ ఫ్లోరా హనీ (ఒకటే రకమైన పూల నుంచి తేనె సేకరించడం) అనే కొత్త ఉత్పత్తిని ఆమె మార్కెట్లో ప్రవేశపెట్టారు. దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్జీవోల నుంచి కూడా ఆమె ఈ ఉత్పత్తులను సేకరించి మార్కెట్ చేస్తున్నారు.

 మూడు లక్షలతో ప్రారంభమైన విజయ వ్యాపారం మూడేళ్లలో 60 లక్షల టర్నోవర్‌కు చేరింది. ముంబై, బెంగుళూరు, పుణె నగరాల్లో అవుట్‌లెట్లు పెట్టారు. వెబ్‌సైట్లో ఆన్‌లైన్ అమ్మకాలు చేస్తున్నారు. ప్రముఖ హోటళ్లతో ఒప్పందాలు చేసుకుని అక్కడ కూడా అమ్ముతున్నారు. ఈ మధ్యనే ‘నేచర్స్ బాస్కెట్’ సూపర్ మార్కెట్ ద్వారా ఢిల్లీలోకి ఈ ఉత్పత్తులు ప్రవేశించాయి. కేవలం ఒక చక్కటి ఆలోచన ఆమెను ఓ మంచి కంపెనీకి సీఈవోగా మార్చింది, పదుల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించింది, వందలాది మంది రైతులకు ఆదాయం పెంచింది... వినియోగదారులకు నాణ్యమైన, శుభ్రమైన ఉత్పత్తులను అందించింది. ఇంకా దినదినప్రవర్దమానమవుతోంది.
Courtesy-Sakshi

విజయం : అగాథంలోకి వెళ్లి... అత్యున్నత స్థాయికి!

Sakshi | Updated: October 27, 2013 03:17 (IST)
విజయం :   అగాథంలోకి వెళ్లి... అత్యున్నత స్థాయికి!
 కచ్చితంగా చెప్పాలంటే
 ఆమెకు జీవితం మీద ఆశ, ఆసక్తి రెండూ పోయాయి. కళ్ల ముందే తండ్రి, భర్త, కొడుకు, అత్త అందరూ పోయారు. దీంతో అను కుటుంబమే కాదు.. థెర్మాక్స్ గ్రూప్ కూడా దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.
 xజాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతురాలిగానే మనకు తెలుసు. కానీ కంపెనీని నడిపిస్తున్న భర్త హఠాన్మరణం పాలైనపుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న సంస్థ పగ్గాలు చేపట్టి దానిని వేల కోట్లకు విస్తరింపజేసిన ఘనత ఆమెది. వ్యక్తిగత, వ్యాపార జీవితంలో ఆటుపోట్లను తట్టుకుని.. విజేతగా ఎదిగిన అను అఘా జీవితం మహిళా లోకానికే కాదు.. ఎదగాలనుకుంటున్న వారందరికీ ఒక స్ఫూర్తి!

 అను పుట్టింది సంపన్న కుటుంబంలోనే. కానీ ఆమె ఎదుర్కొన్న కష్టాలు మాత్రం మామూలువి కావు. 1996 వరకు ఆమె ఓ సాధారణ మహిళే. అను తండ్రితో కలిసి భర్త రోహింగ్టన్ అఘా 40 ఏళ్ల క్రితం ఆరంభించిన సంస్థ ...థెర్మాక్స్ గ్రూప్. బాయిలర్లను తయారు చేసే ఇంజినీరింగ్ సంస్థ ఇది. కొన్నేళ్లలోనే సంస్థ గొప్ప ప్రగతి సాధించింది. ఐతే 1996లో గుండెపోటు వల్ల రోహింగ్టన్ హఠాన్మరణం పాలయ్యారు. అప్పటికి కంపెనీ బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. దీంతో ఆమెకు దాని గురించి ఏమీ అవగాహన లేదు. పోనీ తండ్రి అయినా చూస్తాడనుకుంటే ఆయన అంతకుముందే మరణించారు. అదేం విచిత్రమో రోహింగ్టన్ చనిపోయిన కొన్ని రోజులకే అతని తల్లి (అను అత్త) కూడా ప్రాణాలు విడిచింది. ఈ బాధ చాలదన్నట్లు ఇంకో  ఏడాది గడిచేలోపు 25 ఏళ్ల అను పెద్ద కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. కచ్చితంగా చెప్పాలంటే ఆమెకు జీవితం మీద ఆశ, ఆసక్తి రెండూ పోయాయి. కళ్ల ముందే తండ్రి, భర్త, కొడుకు, అత్త అందరూ పోయారు. దీంతో అను కుటుంబమే కాదు.. థెర్మాక్స్ గ్రూప్ కూడా దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. రోహింగ్టన్ చనిపోయిన ఏడాదే థెర్మాక్స్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. చక్కటి పనితీరు ఉన్న కంపెనీ కావడంతో షేర్ ధర రూ.400 వరకు ఉండేది. అయితే ఆయన మరణంతో సమర్థులైన నిర్వాహకులు కరవై  సంస్థ షేరు రూ.36కు పడిపోయింది!

 సంస్థ గురించి పైపైన తెలిసిన అను, తాను ఎన్నో బాధల్లో, కంపెనీ అగాధంలో ఉన్నపుడు బాధ్యతలు చేపట్టారు. తమ కుటుంబానికి 62 శాతం షేర్స్ ఉండటంతో అను సంస్థ ఛైర్‌పర్సన్ అయ్యారు. అప్పటికే సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ అంత పెద్ద బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాలే అయింది. పైగా సంస్థ దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. ఈ స్థితిలో అను దృఢంగా నిలబడ్డారు. యోగాతో ముందు తాను స్థిమిత పడ్డారు. ఆ తర్వాత సంస్థలో అవ్యవస్థను సరిచేశారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కొందరు ఉద్యోగుల్ని తొలగించాలన్న కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కొన్ని సంస్థలతో మాట్లాడి పెట్టుబడులు రాబట్టారు. అనుభవజ్ఞులతో ఓ టీం ఏర్పాటు చేసి.. వారి ఆలోచనల్ని అమలు చేసి సంస్థను మళ్లీ పట్టాలపైకి ఎక్కించారు. 2004 నాటికి థెర్మాక్స్ గ్రూప్ విలువ రూ.3 వేల కోట్లకు పైనే. అదే ఏడాది అను అఘా సంస్థ నుంచి తప్పుకుని.. తన కూతురు మెహర్‌ను ఛైర్‌పర్సన్‌ను చేశారు. 2007లో ఫోర్బ్స్ ప్రకటించిన భారతీయ ధనవంతుల జాబితాలో అను ఎనిమిదో స్థానం సంపాదించారు.

 వ్యాపార బాధ్యతలకు దూరమయ్యాక అను ఊరికే కూర్చోలేదు. సామాజిక సేవపై దృష్టిపెట్టారు. థెర్మాక్స్ సోషల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు పెద్ద ఎత్తున నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఆమె కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2012లో అను రాజ్యసభ సభ్యురాలిగానూ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ‘టీచ్ ఇండియా’ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ‘‘ఏడాది వ్యవధిలో భర్త, కొడుకు చనిపోయినపుడు ఎంత బాధపడ్డానో చెప్పలేను. ఆ సమయంలో నా మీద నేను జాలిపడుతూ, ఏడుస్తూ కూర్చోవడమా.. లేదా ధైర్యంగా పోరాడటమా అని ఆలోచించాను. తర్వాత రెండో మార్గాన్నే ఎంచుకున్నాను. ఆ సమయంలో ‘విపాసన’ అనే ధ్యాన కార్యక్రమం నాలో మార్పు తెచ్చి.. నన్ను శక్తిమంతురాలిగా మార్చింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని సంస్థను నిలబెట్టాను. సంస్థ నుంచి తప్పుకున్నాక సమాజం కోసం ఏదైనా చేయాలనిపించి సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టాను’’ అని ఓ సందర్భంలో తన పట్టుదల గురించి బయటపెట్టారు అను అఘా. మనిషికి విజ్ఞానమే కాదు... మానసిక స్థైర్యం చాలా పెద్ద అవసరం.
 - ప్రకాష్ చిమ్మల
Courtesy-Sakshi

Be Alert with Foreign Bridegroom

Courtesy-EEnadu

Beattifully created Clay Divas for Diwali

Courtesy-Eenadu

Indian Mallala in Kolkata

Fourteen-year-old Bina Kalindi, a resident of West Bengal's Purulia district is fighting the illegal but still prevalent practice of Child Marriages. In the land of the powerful Goddess, her daughters are helpless. Even before they can realize, child marriage or 'ballo vivaho' abruptly ends their childhood and they are forced to walk into a life of unimaginable horrors. Sixteen-year-old Saraswati was married off at the age of 12 years. By the time she turned 14, she had suffered two miscarriages and her first husband had deserted her. She was remarried by her parents and her third child was born.
"Today I'm suffering because I was married early. There's only sadness, my kid is always sick," she said. Watching her sister suffer, Bina Kalindi decided that she didn't want to end up like her. So Bina became the first girl in her village to speak out against child marriage. "When girls are married off so young, they become mother at an early age. Many a times both of them die. So I decided that neither I will get married nor will I allow any child marriage in my village," said Bina. Bina was already playing many roles - she was a child labourer, she had to do the daily chores at home as her mother was sick and she also attended school. Just 12-years-old then, she was also the oldest unmarried girl in the village. So her father forced her to appear before prospective grooms not once, not twice but four times. And each time Bina had the same answer. "Every time I refused and said no to them. I told them I don't want to get married so early but study and stand on my own feet," Bina said. She added, "My father asked me to leave the home if I don't agree. I was scared initially but I gathered the courage because I had to save my life." Bina then took the fight against child marriage outside her home. In the last two years Bina and her friends have stopped three child marriages. Girls like Dipali owe their new found freedom to Bina. Today Bina and her friends go from village to village, speaking out at public gatherings. But Bina has had to face the ire of the villagers for challenging archaic traditions. "Villagers threaten me, show their anger, but I know I'm doing good work. When these girls grow up and have a career then their parents will realise that Bina was right," she said. Like the Goddess Kali, Bina and her friends have triumphed over the evil. They may have won the battle but the war is still on.

Wednesday, 30 October 2013

Helping while studying-Telugu Article

Courtesy-EEnadu

సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!

Sakshi | Updated: October 25, 2013 08:14 (IST)
సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
హైదరాబాద్ : భవిష్యత్తును తీర్చిదిద్దుకొనే వయసు ఆమెది. సరదా సరదాగా గడిపేయాల్సిన రోజులవి. సరదాకు మాత్రమే కాదు సామాజికస్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది ఇషిక.  సోనాగచికి వెళ్లి అక్కడి పిల్లలతో గడపనిదే ఇషికాకు వారం గడవదు. అక్కడికి వెళ్లి పిల్లలకు చదువు చెబుతూ అక్షరాస్యులుగా చేయడానికి, ప్రపంచం గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తోంది...

పాప్‌స్టార్స్ విడుదల చేసే కొత్త ఆల్బమ్స్ కోసం వెయిట్ చేయడం ఆమె హాబీ. కొత్తగా అప్‌గ్రేడ్ అయ్యే ఐఫోన్ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకొంటూ వాటిలో మునిగితేలడం అంటే కూడా ఇష్టం. రిహన్నా, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ ఆల్బమ్స్ ఆమె ఐప్యాడ్‌లో ఉంటాయి.. లెవిస్, రీబక్‌లు ఆమె వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. టామ్‌క్రూజ్, రణ్‌బీర్ కపూర్‌లు ఆమె హార్ట్ రోబ్‌లో ఉంటారు. ఖరీదైన అలవాట్లు, ఖరీదైన అభిరుచులు ఆమెవి.  ఇంత ‘ఖరీదైన’ నేపథ్యం నుంచి వచ్చిన 17 యేళ్ల అమ్మాయి వీకెండ్ ఎలా గడుపుతుంది? అనే ప్రశ్నకు అందరూ ఒకేరకమైన సమాధానాన్ని ఊహించుకొంటారు. లాంగ్‌డ్రైవ్స్‌తోనూ, ఫ్రెండ్స్‌తో పార్టీలలో మునిగి తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు. అయితే ఎవరీ ఊహాగానాలకూ అందని రీతిలో, తన లైఫ్ స్టైల్‌కు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సంస్కర్త హృదయంతో వారాంతాలను గడుపుతోంది ఇషికా సీల్!

కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియా పేరు సోనాగచి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో అక్కడ తమ తల్లుల మధ్య బతుకుతున్న చిన్నపిల్లలను చేరదీస్తూ వారికి చదువు చెబుతోంది ఇషిక. తల్లులను ఎడ్యుకేట్ చేసి  పిల్లలను స్కూళ్లలో చేర్పిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ పనిని పవిత్రకార్యంలా భావిస్తుంది ఇషిక. తాను చూసిన, చూస్తున్న ప్రపంచంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నించడం ఒక ఎత్తు అయితే, తనకు పరిచయమే లేని  ప్రపంచంలో మార్పు కోసం ప్రయత్నించడం మరో ఎత్తు.

ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి సామాజిక పరిస్థితులతో పాటు కొందరు వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు.

 ఇషికకు స్ఫూర్తి ఆమె తల్లి మధుమిత. నిర క్షరాస్యతను నిర్మూలించడానికి పోరాడుతున్న మధుమిత తన ప్రయత్నంలో  కూతురు కూడా భాగస్వామినవుతాను అంటే కాదనలేకపోయింది. దుర్భరమైన పరిస్థితుల మధ్య బతికే సెక్స్‌వర్కర్ల పిల్లలకు చదువుచెబుతానని, సంస్కరిస్తాను అంటే కూతురును నిరాశ పరచలేదు. ‘మంచి ఆలోచన’ అంటూ అభినందించింది కూడా.

 ‘చారిటీ బిగిన్స్ అట్ హోమ్’ అన్న వాక్యాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ సామాజికసేవ వైపు ప్రయాణం సాగిస్తున్న కూతురికి ఎలాంటి అడ్డంకులూ కల్పించలేదు మధుమిత. ప్లస్ టూ చదువుతున్న ఇషిక చదువులో కూడా  రాణి స్తోంది. కుటుంబ నేపథ్యంతో వచ్చిన  ఫ్రెండ్స్, ఎంజాయ్ మెంట్‌ను పక్కనపెట్టి.. పిల్లల ప్రపంచంలోకి వస్తోంది.

ఈ విషయం గురించి ఇషికను అడిగితే ‘‘నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చినా ఆ పిల్లల  కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం. చదువు విషయంలో, సౌకర్యాల విషయంలో వారి సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉంది. వాటిని పరిష్కరించడానికి నేను నా పరిధిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక ఫ్రెండ్స్‌ని, పార్టీలని మిస్సవుతున్నాననే ఫీలింగ్ లేదు. నాకు చిన్న పిల్లలతో గడపడమే సంతృప్తినిస్తోంది..’’ అని అంటుంది. యుక్త వయసులోనే ఇంత పరిణతి చూపుతున్న ఇషికకు ‘నేషనల్ కమ్యూనిటీ సర్వీస్’ అవార్డు వచ్చింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఇషిక సేవా దృక్పథం గురించి ప్రముఖంగా ప్రచురించాయి.

 నేను అన్ని సౌకర్యాల మధ్య బతుకుతున్నాను. గొప్ప కాలేజీలో చదువుతున్నాను. సుఖసంతోషాలకు ఎలాంటి లోటు లేదు. అయితే ఇలాంటి అదృష్టం చాలా మంది పిల్లలకు లేదు. చిన్న చాక్లెట్ ఇచ్చినా  ఆ పిల్లల  కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. అలాంటి ఆనందం వారికి శాశ్వతం కావాలి. అందుకోసమే నా ప్రయత్నం.

అందంలోను కాదు సేవలోనూ మిన్న

ఎన్‌జివోలతో కలిసి సేవా కార్యక్రమాలు
సొంతంగా పలు సేవా సంస్థలు
ఇద్దరు ఆడపిల్లల దత్తత
2013 సంవత్సరానికి మధర్‌థెరిస్సా అవార్డు
మహిళలకు స్ఫూరిగా నిలుస్తున్న సుస్మిత


అందం అంటే రూపం ఒక్కటే కాదు నిరూపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ విశ్వ సుందరీ కిరీటాన్ని గెలిచి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా వాటిలో పాల్గొనడం అసాధ్యం. సుస్మితాసేన్‌ నేనున్నాను అంటూ ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లి కాకపోరుునా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇది హర్షించదగిన విషయం. ఆడపిల్లలు అంటేనే బయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న నేటి కాలంలో ఈమె దత్తత తీసుకున్న ఇద్దరూ ఆడపిల్లలే కావడం గమనార్హం. అందులో ఒకరి కోసం న్యాయపోరాటం కూడా చేసింది. మధర్‌థెరిస్సా అవార్డును అందుకున్న సందర్భంగా సుస్మితాసేన్‌ గురించి నేటి కలర్స్‌...

పిల్లల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆమె మాటలు నయాగరా జలపాతమే అవుతాయి. ఒకదాని వెంట ఒకటిగా గొలుసుకట్టు కబుర్లెన్నో లెక్కకు మించి చెప్తోంది ఆనందంగా. మా పెద్దదానికి సినిమాల పిచ్చి. టెలివిజన్‌ దొరికితే చాలు, ఇక వదిలి పెట్టదు. పాటల, వాటి నృత్యాలను అదేపనిగా పరిశీలిస్తూ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తుంది. నేను ఇంటికి చేరుకున్న తరువాత వాటిని గుక్క తిప్పుకోకుండా చెప్తూ, మళ్లీ అనుకరించి చూపించడం దానికి ఎంతో ఇష్టం అంటోంది సుస్మిత. ఇక రెండో కూతురు ఇప్పుడే నాకు అర్థమయ్యేలా లేదు. అదో చిచ్చర పిడుగు. దాన్ని క్రమశిక్షణలో పెట్టే పని నాకు చాలా పెద్దదే అంటోంది అలీషాను గుర్తు చేసుకుంటూ.

మథర్‌థెరిస్సా అవార్డు గురించి
ఈ ప్రపంచంలో ఆకలి అంటే తిండి కోసం మాత్రమే కాదు... సేవ(బ్యూటీ) కోసం కూడా... : మథర్‌థెరిస్సా ఆమె ఆశయ సాధన కోసం ప్రపంచాన్ని అందం(సేవ)గా తయారు చేయడం కృషి చేసిన వారికి కోసం అవార్డు ఇస్తున్నారు. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్‌ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. చారిటబుల్‌ ట్రస్టులు, ఎన్‌జీవోలతో కలిసి సుస్మిత చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది.

సుస్మితా సేన్‌ 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన వనిత. తరువాత సినీ రంగంలోనూ ప్రవేశించి తనకు కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్‌ సేన్‌ భారత వాయు సేనలో వింగ్‌ కమాండర్‌గా పని చేశాడు. తల్లి శుభ్రా సేన్‌ ఒక ఫ్యాషన్‌, నగలు డిజైనర్‌. హైదరాబాద్‌లో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకున్న ఈ భామ ఆ తర్వాత ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. సమయాన్ని అంతా నా ఇద్దరి పిల్లలతోనే గడుపుతున్నాను. సినిమాల గురించి ఆలోచించడం లేదు. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే మాత్రం చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్‌తో సుస్మితా సేన్‌కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె ఇక్కడే జన్మించారు. హైదరాబాద్‌కి వచ్చిన ప్రతి సారి ఒక కొత్త అనుభూతికి లోనవుతారట.

పిల్లల దత్తత. గురించి
ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు పదకొండేళ్ల క్రితం రాణీ అనే చిన్నారిని దత్తత తీసుకున్న సుస్మితా సేన్‌. సంవత్సరం క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సివచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, మా మధ్య అది ఎప్పటికీ అడ్డుకాదంటోంది. దేశంలో చాలామందికి సుస్మితా సేన్‌ మాజీ విశ్వసుందరిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడామే ఇద్దరు కూతుళ్ళకు తల్లి. వాళ్ల బాధ్యతలను నిర్వర్తిస్తూనే, దేశ ప్రఖ్యాతిని ఖండాంతరాకు వ్యాప్తిచేసే మరో విశ్వసుందరిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది.

పెళ్లి గురించి
ఇప్పుడు సుస్మిత వయసు 38 సంవత్సరాలు. లేటు వయసులో పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడుతోంది. ఇన్నాళ్లు పెళ్లి వద్దంటూ వచ్చింది. ఆ మాధ్య ఓ ఫంక్షన్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. సహా హీరోయిన్లంతా మ్యారేజ్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టగా.. సుస్మితాసేన్‌ మాత్రం ఇప్పటికీ అప్పుడప్పుడు లవ్‌ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. పొడవాటి గౌను వేసుకుని రాజకుమారిలా క్రైస్తవ పద్దతిలో మ్యారేజ్‌ చేసుకోవాలని ఉందని తెలిపింది. తన తండ్రి కోరిక మేరకు తను భారతీయ సంప్రదాయ వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పింది. అయితే వరుడు ఎవరనే విషయం మాత్రం సుస్మిత చెప్పడం లేదు.
Courtesy-Surya

సామాజిక సేవలో యుసివెబ్‌ ఇండియా

యుసివెబ్‌ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐదు మధ్యాహ్న పాఠశాలలను నిర్వహిస్తున్న ‘అమితాష’ అనే స్వచ్ఛంద సంస్థకు తన సహాయ సహకారాలను అందించింది. దాదాపు వెయ్యి మంది విద్యార్థినులకు విద్య, సంక్షేమానికి అయ్యే వ్యయాన్ని భరించేందుకు సమ్మతించింది. ఈ విద్యార్ధినులకు ఉచిత విద్య, భోజనం, ఆరోగ్య పరిరక్షణతోపాటు ఇతర ప్రయోజనాలను అందించనుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక దీపావళి గ్రీటింగ్‌కార్డులు, దియాలను కొనుగోలు చేసి అందిస్తోంది. యుసివెబ్‌ ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెన్నీ యే పేర్కొన్నారు. తమ సంస్థ ఉద్యోగులు, భాగస్వాముల మధ్య సమగ్రతకు కృషి చేస్తుందని ఆయన వివరించారు. 
Courtesy-Surya

మౌనం మన ఉద్యోగం కాదు

మౌనం మన ఉద్యోగం కాదు

Sakshi | Updated: October 28, 2013 23:51 (IST)
మౌనం మన ఉద్యోగం కాదు
హైదరాబాద్ : ఫిబ్రవరి 6, 2013... కోల్‌కతా. ట్రిబ్యునల్ కోర్టులో గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. దాదాపు పదేళ్లుగా సాగుతోన్న ఓ కేసు తీర్పు ఆ రోజు వెలువడనుంది. అందుకే అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాసేపటికి జడ్జి పెదవి మెదిపారు. ‘‘కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట... రీనాముఖర్జీ మీద లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నిర్థారణ అయ్యింది. తీసేసిన ఆమె ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని, ఈ పదేళ్లలో ఆమెకు రావాల్సిన జీతం మొత్తాన్నీ ఆమెకు ఇవ్వాలని తీర్పు చెప్పడమైనది’’. తీర్పు వింటూనే రీనా ముఖం వెలిగిపోయింది. 

కోల్‌కతాలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ ఉద్యోగిని రీనా. భర్త, బిడ్డతో సంతోషంగా గడిచిపోయే ఆమె జీవితంలోకి బాస్ రూపంలో దురదృష్టం ప్రవేశించింది. అతడు లైంగికంగా వేధించడమే కాక, ఎదురు తిరిగినందుకు ఆమెను మానసిక హింసకు గురిచేశాడు. పై అధికారులకు కంప్లయింట్ చేయబోతే... రీనా సరిగ్గా పనిచేయట్లేదని మందలించినందుకు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని నమ్మబలికాడు. రీనాని ఉద్యోగం నుంచి తీయించేశాడు. నాటినుంచి పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది రీనా. చివరకు విజయాన్ని సాధించింది.

అసలు లైంగిక వేధింపులంటే ఏమిటి? తన లైంగికేచ్ఛను ఓ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలిబుచ్చడం, తన కోరిక తీర్చమని బలవంతపెట్టడం, కాదంటే మానసికంగా వేధించడం, తాకేందుకు ప్రయత్నించడం, సైగలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ఒత్తిడికి తలవంచలేదన్న కసితో  తక్కువ చేసి మాట్లాడటం... ఇవన్నీ లైంగిక వేధింపులే.

మన సమాజంలో రీనాలు చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు రీనాలా వేధింపులకు గురి అవుతున్నారే తప్ప, ఆమెలా పోరాడట్లేదు. బంధువో, టీచరో, సహోద్యోగో-బాసో వేధిస్తున్నా నోరు మెదపట్లేదు. పరువు పోతుందనో, ఉద్యోగం పోతుందనో భయపడి మౌనంగా సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని ఉద్యోగం మానేసి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోపే, జరగరాని ఘోరం కూడా జరిగిపోతుంది. తర్వాత అవమానంతో ఆత్మహత్యలు, ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోవడాలు. ఏం తప్పు చేశామని మనకీ శిక్ష?

ఈ పరిస్థితి మారాలంటే... ముందు మహిళలు మారాలి. అతడి ధోరణి అభ్యంతరకరంగా మారినప్పుడు, నోరు తెరిచి అతడి దురుద్దేశ్యం గురించి అందరికీ చెప్పాలి. అతడు తెగించి మీ ఒంటి మీద చేయి వేయాలని ప్రయత్నించినప్పుడు, మీరు అతడి చేతికి బేడీలు వేయించాలి. ఇందుకోసమే ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది.

ఐపీసీ 354... ఇది మహిళలకు ఓ వరం. పని చేసేచోట గాని, మరే ఇతర ప్రదేశాల్లో కానీ ఏ మహిళ అయినా లైంగిక వేధింపులకు గురయితే... సమీప పోలీస్ స్టేషన్లో కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో గానీ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఒకవేళ వేధింపు ఆఫీసులో జరిగితే, దాని గురించి మీరెప్పుడైనా ఆ పై అధికారికి ఫిర్యాదు చేసి, అతడు పట్టించుకోకుండా ఉన్నట్లయితే... అతడి మీద కూడా ఐపీసీ 107 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తప్పు జరుగుతుందని తెలిసి కూడా పట్టించుకోనందుకు అతడికి సైతం శిక్ష పడుతుంది.

కాబట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటేనే పెద్ద తప్పు అన్న భావన వీడండి. కేసు పెడితే పరువు పోతుందేమో, అల్లరవుతామేమో అన్న భయాన్ని విడిచిపెట్టండి. సహించింది చాలు. భరించింది చాలు. భయపడి పరుగులెత్తింది చాలు. మౌనంగా కుమిలిపోయింది చాలు. ఇప్పటికైనా గళం విప్పండి. స్వరం పెంచండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. అక్రమాన్ని అడ్డుకోండి. చట్టం అండతో... మిమ్మల్ని మీరు కాపాడుకోండి!

 - సమీర నేలపూడి

సాక్ష్యాలతో మరింత బలం...


లైంగిక వేధింపులకు గురవుతోన్న మహిళల్లో ఒకరిద్దరు కూడా సమస్యను పోలీసుల దృష్టికి తీసుకురావడం లేదు. అందుకు మొదటి కారణం... అసలు తమను కాపాడే చట్టమొకటి ఉందని తెలీక పోవడం. తెలిసినా... కేసు పెడితే.. అది తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో, కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న బెరుకు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య... సాక్ష్యాలు. ఒక మహిళ మీద వేధింపులు జరిగాయని నిరూపించాలంటే ఆ సంఘటనను చూసినవాళ్లెవరైనా సాక్ష్యం చెప్పాలి. వేధింపుల సమయంలో సదరు వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, చేతలు కానీ రికార్డు చేసి ఉండాలి. పై అధికారులకు కంప్లయింట్ చేసివుంటే, ఆ కంప్లయింట్ కాపీని జత చేయాలి. ఈ సాక్ష్యాలన్నీ మీ దగ్గర ఉంటే ధైర్యంగా కోర్టుకు వెళ్లండి. సమస్యను పరిష్కరించుకోండి.
Courtesy-Sakshi

Tuesday, 29 October 2013

నేనెందుకు ఓడిపోలేదు..?-Kiran Majumdar

పది వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన కంపెనీ లక్షల కోట్ల వ్యాపారం చేయటమంటే మాటలు కాదు. ఆ కంపెనీని నడిపించేందుకు పట్టుదల, తెగువలతో పాటుగా దార్శనికత కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ పరిపుష్ఠంగా ఉన్న మహిళ కిరణ్ మజుందార్ షా. ఆమె స్థాపించిన బయోకాన్ కంపెనీ- మన దేశంలో బయోఫార్మసీ రంగాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లింది. అయితే ఈ విజయాల వెనక చాలా పరాజయాలు కూడా ఉన్నాయి. వీటిని ఆమె- శ్వేతా పుంజ్ రాసిన - "నేనెందుకు ఓడిపోయాను.. లీడర్ల అనుభవాలు'లో నెమరువేసుకున్నారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం.

పరాజయం జీవితంలో ఆఖరి మెట్టు కాదు. కుంగిపోయి నిరాశలో కూరుకుపోవటమే ఆఖరి మెట్టు.
నిరుద్యోగి అయిన ఒక బ్రూమాస్టర్ కూతురుకి- తాము పెట్టాలనుకున్న వ్యాపారానికి మూలధనం సంపాదించటం చాలా కష్టమైన పని. అయితే కిరణ్ మజుందార్ షా అందుకు పూనుకుంది. ప్రతి అడుగులోను ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు తెలుసు.
మజుందార్ షా చేయాలనుకున్న వ్యాపారం మన దేశంలో కొత్తది. అప్పటి దాకా ఎవరూ అలాంటి వ్యాపారం చేయాలని ప్రయత్నించలేదు. మహిళ కావటం, పెద్ద కుటుంబం నుంచి రాకపోవటం కూడా ఆమెకు ప్రతికూలాంశాలే. 25 ఏళ్ల కిరణ్‌కు- తన వ్యాపారానికి పెట్టుబడి కోసం బ్యాంకులకు వెళ్లటం, వారిని ఒప్పించటం దాదాపు అసాధ్యమయింది. ప్రతి బ్యాంకు పూచీకత్తు కావాలనేది. పూచీకత్తుకు కిరణ్ పూర్తి వ్యతిరేకి. మరో మార్గం లేక కిరణ్ తన వద్ద నున్న పదివేల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం మొదలుపెట్టింది. (అప్పుడు పదివేలంటే ఇప్పుడు నాలుగులక్షలు!). "నన్ను ఓటమిపాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. నాకు ఎవరూ ఆర్థిక సాయం చేయలేదు. నా దగ్గర ఉద్యోగం చేయటానికి నైపుణ్యం కలిగిన వారు రాలేదు. మొదటి 15 ఏళ్లు ఓటమి కోరల్లో చిక్కుకోకుండా తప్పించుకోవటానికే సరిపోయింది..'' అంటారు కిరణ్. 1978లో బయోకాన్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. దానిలో ఐర్లాండ్‌కు చెందిన లిస్లి అచిన్‌క్లాస్ అనే తొలితరం వాణిజ్యవేత్త పెట్టుబడి పెట్టాడు. కాగితం పరిశ్రమలోను, ఆల్కహాల్ పరిశ్రమలోను అవసరమైన ఎంజైమ్‌లను బయోకాన్‌లో తయారుచేసేవారు. కంపెనీ నెమ్మదిగా ఎదగటం మొదలుపెట్టింది. కాని కిరణ్‌కు అడుగడుగునా అనేక ప్రతిబంధకాలు ఎదురయ్యాయి.

ఒక మహిళ ప్రారంభించిన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకొచ్చేవారు కారు. ఒక మహిళ దగ్గర పనిచేయటానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు కారు. అయినా కిరణ్ తన పట్టువీడలేదు. పెట్టిన పదేళ్లకు కంపెనీకి లాభాలు రావటం మొదలుపెట్టాయి. అచిన్‌క్లాస్ తన వాటాను యూనీలివర్ అనే బహుళ జాతి కంపెనీకి అమ్మేశాడు. "మనం ఎందుకు ఓడిపోతున్నామో ముందర గమనించాలి. చాలా మందిలో వ్యక్తిగత విశ్వసనీయత ఉండదు. విశ్వసనీయత ఉంటేనే ప్రజలకు మనమంటే నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు పరాజయాన్ని పారద్రోలవచ్చు..'' అంటారు కిరణ్. బయోకాన్ కంపెనీ అభివృద్ధికి కిరణ్ విశ్వసనీయత ఒక ప్రధానమైన కారణం. కిరణ్‌కు తన శక్తి తెలిసింది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాల్సిన సమయం ఆసన్నమైందని భావించింది. తర్వాత ఎంజైమ్‌లను తయారుచేయటం తగ్గించి బయోఫార్మాసుటికల్స్‌పై దృష్టి సారించింది. ఎంజైమ్‌ల వ్యాపారాన్ని అమ్మేసింది. అయినా ఆమె బయోఫార్మా వ్యాపారం అంత సులభంగా ప్రారంభం కాలేదు. "ఒక స్వదేశీ బయోటెక్నాలజీ కంపెనీని ప్రారంభించాలనేది నా ఉద్దేశం. కాని మా మొదటి బ్యాచ్ విఫలమయింది. దానికి కారణాలు వెతికాం. మందుల కోసం మేము తయారుచేసే ఎంజైమ్‌ల ప్రక్రియలో తేడా ఉందని తేలింది..'' అని కిరణ్ తన అనుభవాలను నెమరువేసుకున్నారు. తర్వాత కిరణ్ మధుమేహానికి నోటి ద్వారా తీసుకొనే ఇన్సులిన్‌ను తయారుచేయాలని ప్రయత్నించారు. కాని క్లినికల్ ట్రయిల్స్‌లో ఆ మందు సరిగ్గా పనిచేయలేదు. "ఆ మందు మీద నాకు చాలా ఆశలు ఉండేవి. కాని మందు అనుకున్నట్లు పనిచేయకపోవటం ఒక పెద్ద పరాజయం'' అంటారు కిరణ్.
Courtesy-Andhrajyothy

ఇదొక 'అత్యవసర' సేవ!-బయో టాయిలెట్

"హైదరాబాద్ దగ్గర్లోని ఒక తండాకి వెళ్లినప్పుడు లక్ష్మి అనే ఆవిడ 'నాకు పదమూడేళ్ల కూతురుంది. టాయిలెట్ లేక ఇబ్బందిపడుతోంది. ఎక్కడికో పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోందని రోజూ ఏడుపేనమ్మా. మా సమస్యను పరిష్కరించడమ్మా' అని కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధను చూశాక, మేము రూపొందించిన బయో టాయిలెట్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి చౌకగా అందించే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు 'బంక బయోలూ ప్రైవేట్ లిమిటెడ్' మేనేజింగ్ డైరెక్టర్ నమిత బంక. ఇంతకీ ఆవిడ రూపొందించిన ఆ బయో టాయిలెట్ ఎలా ఉంటుంది? అసలా ఆలోచన ఆమెకెలా వచ్చింది? తెలుసుకుందాం.

మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు.

"మేము హైదరాబాద్ రాకముందు సూరత్, బెంగళూరుల్లో ఉన్నాము. మాది మార్వాడీ కుటుంబం కావడంతో ఆడవాళ్లు పెద్దగా ఉద్యోగాలు చేయరు. నేను కూడా నా పెళ్లయ్యాక ఆరేళ్లు గృహిణిగానే ఉన్నాను. బుర్రలో మాత్రం ఏదైనా పని చేస్తే బాగుండనే ఆలోచనలు తిరుగుతుండేవి. ఆ ఆలోచనను మా అత్తగారు బాగా గ్రహించారు. ఎందుకంటే ఖాళీ సమయంలో మిగతా వాళ్లలా టి.వి. చూడడం, గాసిప్స్ మాట్లాడడం వంటివి చేసేదాన్ని కాదు. సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం పట్టుకుని చదువుకునేదాన్ని. కాలక్షేపం పుస్తకాలు తప్ప ఏ పుస్తకమైనా ఓకే నాకు. నన్ను, నా అలవాట్లను గమనించిన తరువాత ఇంటి నుంచి చేసే పనేదైనా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను బిఎస్సీ టెక్స్‌టైల్ డిజైనింగ్ చదువుకున్నాను. పెళ్లయిన తరువాత జువెలరీ డిజైనింగ్ కోర్సు కూడా చేశాను. దాంతో సూరత్‌లో ఉండగా ఇంటి నుంచి, బెంగళూరు వచ్చాక షాపు ఏర్పాటుచేసి డైమండ్ జువెలరీ వ్యాపారం చేశాను. దాదాపు ఎనిమిదేళ్లు నేనే ఆ షాపు నడిపాను. ఆ పని చేసేటప్పుడు ఇంటినుంచి ఉదయం బయల్దేరితే సాయంత్రం తిరిగి ఇంటికెళ్లే వరకు ఒక్క చుక్క నీరు తాగేదాన్ని కాదు. తినేదాన్ని కాదు. కారణం షాపులో గాని, చుట్టుపక్కల గాని టాయిలెట్ సౌకర్యం లేకపోవడమే. మార్కెటింగ్ పనిమీద బయట ఎంతసేపు తిరగాల్సి వచ్చినా కూడా అదే పరిస్థితి. దానివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

జువెలరీ వద్దనుకున్నాను
ఆ తరువాత మా ఆయన ఉద్యోగరీత్యా 2008లో హైదరాబాద్‌కి వచ్చాము. హైదరాబాద్ వచ్చాక జువెలరీ వ్యాపారం చేయొద్దని నిర్ణయించుకున్నాను. అందుకని ప్రింటింగ్ క్యాట్రిడ్జ్‌ల రీఫిల్లింగ్ వ్యాపారం చేశాను. 2009లో సెంటర్ ఫర్ సోషల్ ఇనిషియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ (సిఎస్ఐఎమ్)లో ఎన్జీవో మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన కోర్సు చేశాను. అది పూర్తయ్యాక రైళ్లలోని బయో టాయిలెట్లను అమర్చే 'ఓఇఎమ్స్' అంటే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్‌కు సర్వీస్ ఏజెంట్‌గా పనిచేశాను. ప్రారంభంలో మా ఎదుట ఉన్న సవాల్ - భారతీయ రైల్వేలకి అమ్మిన టాయిలెట్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదా చూడడం. అవి సరిగా పనిచేసేందుకు మా టీం 24 గంటలూ పనిచేసింది. అప్పుడు మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు.

బయోలూతో పరిష్కారం
రైళ్లలో ఏర్పాటుచేసిన బయో టాయిలెట్లు డిఆర్‌డిఒ శాస్త్రజ్ఞుల సృష్టి. అయితే ఈ టాయిలెట్లని రైళ్లతో పాటు వ్యాన్‌ల వంటి పెద్దపెద్ద వాహనాల్లో ఏర్పాటుచేసుకుంటున్నారు. వీటిని కనీసావసరాలు లేని గ్రామాల్లో, ఇరుకుగా ఉండే మురికివాడల్లో నివసించే వాళ్లకు కూడా ఏర్పాటుచేయొచ్చు కదా అనిపించింది నాకు. నా ఆలోచనకు తగ్గట్టుగా వాటిని డిజైన్ చేసి డిఆర్‌డిఒ వాళ్లను సంప్రదించాను. కొన్ని మార్పులుచేర్పుల తరువాత వాళ్లు ఆ డిజైన్‌కు ఓకే చెప్పారు. వాటికే 'బయోలూ' అని పేరుపెట్టి తయారీ మొదలుపెట్టాను. ఈ టాయిలెట్లని ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. రెడీమేడ్‌గా ఉంటాయి కాబట్టి రెండుగంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు. మురుగు కాలువ వ్యవస్థ లేని దగ్గర వీటికి మించిన పరిష్కారం లేదు. దీని ప్రత్యేకత ఏమిటంటే... టాయిలెట్ కింది భాగంలో ఒక బాక్స్ ఉంటుంది. అందులో బయో డైజెస్టివ్స్(బ్యాక్టీరియా) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మలాన్ని తిని నీటిని మాత్రం బయటికి వదులుతాయి. అలా వదిలిన నీటిని గార్డెనింగ్‌కి వాడొచ్చు. లేదా అలానే వదిలేసినా భూమికి నీటి సారం అందించిన వాళ్లమవుతాం. దీని ధర ఇప్పుడయితే 22 వేల రూపాయలు. టాయిలెట్ తయారీకంటే రవాణాకే ఎక్కువ ఖర్చవుతోంది. అందుకని డిజైనింగ్‌లో కొన్ని మార్పులు చేసి ధరని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు వంద బయో టాయిలెట్స్ నిర్మించాం.

ప్రతీ ఇంటి అవసరం
ఈ టెక్నాలజీతో మా కంపెనీకి పెద్ద కంపెనీల పక్కన స్థానం కలిగింది. బయోటాయిలెట్లను పబ్లిక్ ప్రదేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, నిర్మాణాలు జరిగే దగ్గర, కొండ ప్రాంతాల్లో - ఎక్కడ మురుగు నీటి కాలువ వ్యవస్థ లేదో అక్కడ నిర్మించుకోవచ్చు. బీహార్, జార్ఖండ్‌లలో బయో టాయిలెట్లను అందుబాటులోకి తేనున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రామాలతో పోలిస్తే అక్కడి గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది, భువనేశ్వర్, కలకత్తాల్లో 22 మంది ఉద్యోగులు మా కంపెనీకి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామాల్లో పనిచేసేందుకు మరింత మంది ఉద్యోగులు కావాలి. టాయిలెట్స్‌కి సంబంధించిన పని అని చాలామంది ఆసక్తి కనపర్చరు. మా కంపెనీలో పనిచేసే వాళ్లు మొదట్లో కొన్నాళ్లు తామెక్కడ పనిచేస్తున్నామో చెప్పేవారు కాదట. కాని ఇది ప్రతీ ఇంటి అవసరమని గుర్తించాలి. ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు.
చివరగా మహిళలకి ఒక విషయం చెప్తాను. 1999 నుంచి నేను వ్యాపారరంగంలో ఉన్నాను. ప్రారంభంలో నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా భయపడేదాన్ని. కాని ఈ రోజున వ్యాపారరంగంలో ఉన్న మగవాళ్లు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో దృఢంగా తయారయ్యాను. మనం చేసే పని సరైనది నమ్మితే ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే సత్తా ఆడవాళ్లలో ఉంది. మహిళలు వ్యాపారం చేయాలంటే బ్యూటీ, బొటిక్‌లకి మించింది లేదనే ఆలోచన నుంచి బయటపడాలి. అలాగే కాలు నొప్పి, కడుపు నొప్పి అని ఇంట్లో కూర్చోవద్దు. పనిలో పడితే బుర్ర, మనసు రెండూ ప్రశాంతంగా ఉంటాయి. చురుకుగా తయారవుతారు'' అని ముగించారు.
- కిరణ్మయి
ఫొటోలు: లవకుమార్
Courtesy-Andhrajyothy

దోశల యంత్రం

పెనం మీద సుయ్యిమనగానే వేడివేడి దోశను ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. దక్షిణ భారతీయులు భోజనప్రియులే కాదు.. దోశప్రియులు కూడా! రకరకాల కాంబినేషన్‌లతో దోశల్ని లాగించడం చాలామందికి ఇష్టం. దోశలను తినడం ఎంత సులువో, వాటిని గబగబా వేయడం అంత కష్టం. హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చేవాళ్లందరూ ఒకేసారి ఆర్డర్ చేస్తుంటారు. అప్పుడు అడిగినవాళ్లందరికీ వేడివేడి దోశల్ని సరఫరా చేయడం ఆషామాషీ కాదు. ఈ సమస్యకు పరిష్కారం 'దోశమేటిక్'. ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ దోశల యంత్రానికి దోశమేటిక్ అని నామకరణం చేశారు దీని తయారీదారులు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఈశ్వర్, వికాస్, సందీప్ అనే విద్యార్థుల బృందం దీన్ని కనిపెట్టింది.

ప్రస్తుతానికి ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, దోశల కార్నర్‌లకు చక్కగా పనికొస్తోంది. "ఢిల్లీలో దోశ తినాలంటే వంద, అదే చెన్నైలో అయితే డెబ్బై, హైదరాబాద్‌లో మాత్రం యాభై రూపాయలు. ఇలా.. ఒక్కోచోట ఒక్కో ధరలు ఎందుకున్నాయంటే - దోశలు వేసేవాళ్ల జీతభత్యాలను బట్టి ఉంటున్నాయవి. అదే పిజ్జా, బర్గర్‌లు అన్ని చోట్ల ఒకే రేటుకు ఎందుకు దొరుకుతున్నాయంటే.. వాటిని ఎక్కువగా మిషన్లు తయారుచేయడం వల్లనే. దోశల తయారీకి వంటవాళ్ల కొరత ఎక్కువగా ఉన్నందున వాటి ధర అధికంగా ఉంది'' అని చెబుతున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు.

దోశలను వేగంగా, రుచికరంగా తయారుచేయాలన్నది వాళ్ల లక్ష్యం. స్నేహితుల బృందంలోని సభ్యులందరూ తలాకొంత మొత్తం పోగుచేసుకుని సుమారు ఆరులక్షల రూపాయలతో దోశమేటిక్ యంత్రాన్ని రూపొందించారు. విద్యార్థుల ఆసక్తిని ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం కూడా కొంత ఆర్థిక చేయూతను అందించింది. విద్యార్థులు కనుక్కున్న ఈ దోశల యంత్రం అచ్చం మైక్రోఓవెన్ మాదిరే కనిపిస్తుంది. దీని పైభాగంలోని మూడు అరల్లో ఒక దాంట్లో దోశపిండి, మరొక దాంట్లో నూనె, ఇంకొక అరలో నీళ్లు పోసి మూతపెట్టాలి. యంత్రానికి దిగువభాగాన అమర్చిన చిన్న బటన్‌ను నొక్కితే సరి.. నిమిషంలో వేడివేడి దోశ బయటికి వస్తుంది. "ఓ మోస్తరు హోటల్‌లో రోజుకు అయిదు వందల దోశలు అమ్ముడుపోతాయి. మా యంత్రంతో రోజుకు ఏడువందల దోశల్ని తయారుచేయవచ్చు.

అంటే హోటల్‌కు వచ్చేవాళ్లందరికీ దీంతోనే దోశల్ని వేయవచ్చన్నమాట. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత- ఏ మనిషీ తాకకుండా దోశల్ని వేయడం. దాంతోపాటు దోశ ఎంత మందంలో కావాలి? పల్చగా కరకరలాడేలా ఉండాలా? ఏ రంగులో ఉంటే బావుంటుంది? ఇవన్నీ యంత్రంలో సరిచేసుకోవచ్చు. కాఫీమెషిన్‌లో బటన్‌నొక్కితే క్షణాల్లో కాఫీ ఎలా వస్తుందో దోశల యంత్రంలో కూడా అంతే! చిన్న బటన్ నొక్కితే దోశలు బయటికి వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి దోశల యంత్రం ధర మధ్యతరగతికి అందుబాటులో లేదు. యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది. హోటళ్లు, దోశల దుకాణదారులకు మాత్రం బాగా పనికొస్తుంది.
Courtesy-Andhrajyothy

రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత

'కొత్తకొత్త విషయాలు నేర్పించాలన్న సరదా ఇటు టీచర్లకుండాలి, తెలుసుకోవాలన్న ఆసక్తి అటు విద్యార్థులకుండాలి. మొత్తమ్మీద రొడ్డకొట్టుడు చదువులు మారాలి. దానికోసమే నా ప్రయత్నం' అంటున్నారు సుచిస్మిత. విద్యారంగంలో పాతికేళ్ల అనుభవమున్న ఆమె ప్రముఖ సంస్థలెన్నిటికో కన్సల్టెంటుగా పనిచేసి ప్రస్తుతం యూనిసెఫ్ పేదపిల్లల కోసం చేపట్టదలచిన కార్యక్రమాలను రూపొందించడంలో తలమునకలుగా ఉన్నారు. ఆమె ఇంటర్వ్యూ 'నవ్య'కు ప్రత్యేకం...

"నేను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదువుకున్నా. నాకు చిన్నపిల్లలంటే ఇష్టం, పాఠాలు చెప్పడమంటే ప్రాణం. దాంతో నా చదువు పూర్తికాగానే వేరే ఏమీ ఆలోచించకుండా బోధన రంగంలోకి దూకేశాను. పద్నాలుగేళ్ల పాటు ఢిల్లీలోని నేవీ చ్రిల్డన్ స్కూల్, గుజరాత్‌లోని ఆనందాలయ వంటి పెద్దపెద్ద పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేశాను. నా తరగతి గదిలో ఉన్న 30- 40మంది పిల్లలకు చక్కగా పాఠాలు చెబితే చాలా? ఇంకా ఎంతోమంది పిల్లలు లెక్కలంటే భయపడుతుంటారు, దానివల్ల మొత్తం స్కూలంటేనే ఇష్టపడకుండా అయిపోతారు. ఫలితంగా వారి జీవితమంతా పాడయిపోతుంది. అలాగవకుండా నేనేమీ చెయ్యలేనా అనిపించింది.

స్వస్తి చెప్పేశా
పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. లెక్కలే కాదు, ఏ సబ్జెక్టయినా నేర్చుకోవడం సులువుగా ఉండాలి. పిల్లలకు అమితమైన ఆసక్తి, ఆనందమూ కలగాలి. అంతేగాని చదువంటే తలనొప్పి వ్యవహారమని వాళ్లు అనుకోకూడదు. ఇది ఎలా చెయ్యాలని బాగా ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకున్నా. ముందు మ్యాథ్స్ అంటే పిల్లలు ఇష్టపడేలా, వారిలో ఆసక్తి రేకెత్తేలా - కొన్ని పాఠాలు తయారుచేసుకున్నాను. సరిగ్గా అప్పుడే అహ్మదాబాద్ కేంద్రంగా 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్' అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమయింది. దానిలో చేరితే నా ఆలోచనలను అమల్లోకి పెట్టే అవకాశం ఉంటుందనిపించింది. రెండేళ్ల పాటు గ్రామీణ, పట్టణాల పాఠశాలలు, పిల్లలు, చదువులు - అన్నిటినీ పరిశీలించాక 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్'లో కొత్త ఉద్యోగంలో చేరాను.

ఎన్నెన్ని ప్రశ్నలో...
అసలు మన విద్యావిధానంలో లోపం ఎక్కడుంది? ప్రాథమికమైన ఈ ప్రశ్నతో మేం పరిశోధన మొదలెట్టాం. అర్థమయిందేమంటే, టీచర్లు మార్కుల కోసమే పాఠాలు చెబుతారు. పిల్లలు మార్కుల కోసమే చదువుతుంటారు. సబ్జెక్టు పట్ల అవగాహన పెంచుదామని అటు ఉపాధ్యాయులు అనుకోవడం లేదు, ఇటు విద్యార్థులకూ అంత తెలియదు. ఉదాహరణకు ఒక బడికి వెళ్లి ఐదో క్లాసు పిల్లలను త్రికోణం గురించి అడిగితే ఒక స్టాండర్డ్ ఆకారంలోనే గీశారు తప్ప, అంతకన్న చిన్నదో పెద్దదో, వ్యతిరేక దిశలోనో గీస్తే దాన్ని కూడా త్రికోణమనే అంటారని వాళ్లు ఆత్మవిశ్వాసంతో చెప్పలేకపోయారు. 'మాకు మా టీచర్ ఇలానే చెప్పారు' అంటారు తప్ప, కొత్తవి తెలుసుకుందామన్న ఆసక్తిని కూడా చూపించ లేదు. ఎంత రొడ్డకొట్టుడు పద్ధతిలో మన చదువులు నడుస్తున్నాయో చూడండి. ఎందుకు మనం కొత్తగా ఆలోచించడం లేదు? మన సృజనాత్మకత ఎక్కడ సమాధయిపోతోంది? వీటికి సమాధానాలు అన్వేషించింది 'ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్'.

సరదాగా ఉండాలి
విద్యార్థులకు సబ్జెక్టు పట్ల లోతైన అవగాహన కల్పించడమే మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికోసం 'ఎస్సెట్' అనే పరీక్షను తయారుచేశాం. దానిద్వారా విద్యార్థుల్లో లోపమేమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం దీనిద్వారా ఏడాదికి సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులను పరీక్షిస్తున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి. ఇది మా రెండో లక్ష్యం. దీనికోసం వెబ్ ఆధారిత బోధన మొదలెట్టాం. క్లాస్‌రూమ్‌లో టీచర్ కన్నా సమర్థవంతంగా విద్యార్థికి చదువుచెబుతూ, ఎంతవరకూ అర్థమయిందో పర్యవేక్షించే లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. ఇది మన దేశంలో మొట్టమొదటి ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్ (ఐటీఎస్) అని సగర్వంగా చెప్పగలను. దీనినుపయోగించి విద్యార్థులు తమంతట తాముగా చదువుకోవచ్చు. స్కూళ్లు కూడా దీన్ని తమ క్లాసురూముల్లో ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం దీన్ని ఎనభైవేల మంది విద్యార్థులు వాడుతున్నారు. ఢిల్లీ, ముంబైల్లోని మురికివాడల పిల్లలక్కూడా ఇది అందుబాటులో ఉంచాం. వాళ్లు కేవలం నెలకు అరవై రూపాయలు కట్టి సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకునే సౌకర్యం ఉంది దీనిలో. ఢిల్లీలోని ఒక పన్నెండేళ్ల అమ్మాయికి మూగ, చెవుడు. ఆమెను స్కూల్లో ఒకటో తరగతిలో చేర్చుకున్నారు. మా సెంటర్‌కు వచ్చి కంప్యూటర్ మీద ఆమె విషయాలను నేర్చుకునే తీరు చూస్తే ఆశ్చర్యమనిపించింది. ఆరు నెలల్లోనే ఆమె ఐదో తరగతి విషయాలన్నీ నేర్చుకుని ఆ తరగతిలో చేరింది. ఇలాంటి సంఘటనలు నాకెంతో సంతోషాన్నిస్తాయి.

కొంచెం కొంచెం వచ్చు...
మావారు సుదర్శన్ శ్రీనివాస్ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులో పనిచేస్తారు. ఆయన ఉద్యోగరీత్యా మేం విజయవాడలో ఐదేళ్లున్నాం. తర్వాత హైదరాబాద్‌కు మారాం. నేను ఢిల్లీలో పుట్టిపెరిగిన బెంగాలీని. ఆయన సిమ్లాలో పెరిగిన తమిళుడు. అందువల్ల మాకిద్దరికీ తెలుగు కొద్దికొద్దిగా అర్థమవుతుంది తప్ప ధారాళంగా మాట్లాడలేం. మా పిల్లలు అమర్త్య గౌతమ్, అనన్య మాధుర్ - ఇద్దరికీ తెలుగు కొంచెం వచ్చు.

ఇప్పుడు ఆలోచిస్తున్నారు
ఎస్సెట్ పరీక్షను కొన్ని పాఠశాలల్లో ప్రయోగించి చూస్తున్నప్పుడు ఒక ప్రధానోపాధ్యాయిని ఏమన్నారంటే 'మీరు రక్తపరీక్ష చేసి వ్యాధి ఏదో చెబుతున్నారు. కాని డాక్టర్లు సరిగా లేనప్పుడు జబ్బుకు మందెవరు వేస్తారు?' అని ప్రశ్నించారు. దాంతో మేం ఉపాధ్యాయులకు కూడా శిక్షణనివ్వాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకు ఒక సబ్జెక్టు పట్ల ఇష్టమో, వైముఖ్యమో కలగడంలో టీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆసక్తికరంగా చెప్పాలన్న స్ఫూర్తి ఉపాధ్యాయుడిలో లేకపోతే చాలా ఇబ్బంది. చెప్పాలన్న తపన ఉండి, నైపుణ్యం లేకపోయినా ఇబ్బందే. ఈ రెండు తరహా లోపాలనూ సరిదిద్దడానికి కార్యక్రమాలు రూపొందిస్తుంటాను. తమిళనాడులోని మదురైలో ఇలాంటి ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించాక, ఒక టీచర్ లేచి నిలబడి 'ఇన్నాళ్లూ పాఠ్యపుస్తకాల్లో ఉన్నవి పిల్లలకు చెప్పేస్తే చాలనుకున్నాను. ఈనాటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను' అన్నారు. ఆమాట నాలో ఎంత ఉత్సాహాన్ని నింపిందో మాటల్లో చెప్పలేను. 2012 నుంచి విద్యారంగంలో కన్సల్టెంటుగా పనిచేస్తున్నాను. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, ఋషివ్యాలీ స్కూల్ మొదలైనవాటికి పనిచేసి ప్రస్తుతం పేద విద్యార్థుల కోసం యూనిసెఫ్ తలపెట్టిన కార్యక్రమాలను నిర్వహించడంలో తలమునకలుగా ఉన్నా. ''
అరుణ పప్పు
ఫోటోలు : గోపి
Courtesy-Andhrajyothy

మనమ్మాయికి 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్!

ఒక విద్యార్ధికి ప్రతి ఏడాది 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్ వస్తే? దేశంలోనే అత్యున్నతమైన న్యాయనిపుణులు ఆమెను ఆ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తే? ఎంత ఆనందం! ఎంత గౌరవం! మన హైదరాబాద్‌కు చెందిన హర్షితా రెడ్డి కాసర్ల అలాంటి గౌరవం దక్కించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూపు గత వారం ప్రకటించిన స్కాలర్‌షిప్‌లకు ఆమె ఎంపికయింది. స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే సొమ్ముకన్నా దేశ«ంలో అత్యున్నత న్యాయనిపుణులను కలవటమే ఎక్కువ ఆనందం కలిగిస్తోందంటున్న హర్షితారెడ్డిని నవ్య పలకరించింది..

"నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్ డిబేట్‌లంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌లో డిబేటింగ్ పోటీలలో నాదే ఫస్ట్. అందుకే ఇంటర్‌లో చాలామందిలా ఎంపీసీ, బీపీసీలలో చేరలేదు. హ్యూమానిటీస్‌లో చేరాను. ఆ తర్వాత నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదవటానికి చేరాను. ఆ సమయంలోనే నాకు ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసింది. బిజినెస్, ఇంజనీరింగ్, న్యాయవిద్యలలో దేశవ్యాప్తంగా 80 మందిని గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు వాళ్లు. మన దేశంలో ఈ తరహా స్కాలర్‌షిప్ ఇదొకటే. ఈ సారి న్యాయవిద్యలో స్కాలర్‌షిప్‌ల కోసం నాలుగు విశ్వవిద్యాలయాలకు చెందినవారు పోటీ పడ్డారు. దీనిలో పాల్గొనేవారు రెండు వ్యాసాలు రాసి పంపాలి. మన బయోడేటా, రాసిన వ్యాసాల ఆధారంగా 20 మందిని ఎంపిక చేశారు.

దానిలో నేను కూడా ఉన్నాను. మా అందరిని ముంబాయిలో ఒక ప్యానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్యానల్‌కు భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వం వహించారు. మిగిలినవారందరూ కూడా ప్రముఖ న్యాయనిపుణులే. వారి ముందు హాజరవటం ఒక గొప్ప అనుభవం. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి 80 మంది వచ్చారు. వారందరితోను కలిసి మూడు రోజులు ముంబాయిలో ఉన్నా. అదొక కొత్త లోకం అనిపించింది. స్కాలర్‌షిప్ వచ్చిందని తెలిసిన వెంటనే మా అమ్మ, నాన్న- నాకన్నా ఎక్కువ ఆనందపడ్డారు. మాది ఉమ్మడి కుటుంబం. మొత్తం ఎనిమిది మంది పిల్లలం ఉంటాం. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. నాకు స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే డబ్బు కన్నా, దేశంలో ప్రముఖ నిపుణులు నన్ను ఎంపిక చేశారనే భావనే ఎక్కువ ఆనందం కలిగించింది. అంతే కాదు. ప్రతి ఏడాది నల్సార్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్‌లు వస్తాయి. ఈ సారి నా ద్వారా రావటం చాలా ఆనందం కలిగించింది. నాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఈ స్కాలర్‌షిప్ వచ్చింది. ఇక మీద నా ఫీజు మా అమ్మనాన్న కట్టాల్సిన అవసరం లేదు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా వచ్చిన సొమ్ము సరిపోతుంది. నా చదువు ఇంకా నాలుగేళ్లు ఉంది. ఆ తర్వాత దేశంలోనే అత్యున్నత న్యాయనిపుణురాలిగా ఎదగాలనేది నా కోరిక..''
Courtesy-Andhrajyothy

మనమ్మాయికి స్కాలర్‌షిప్!

Published at: 04-10-2013 00:52 AM
ఒక విద్యార్ధికి ప్రతి ఏడాది 1.8 లక్షల రూపాయలు స్కాలర్‌షిప్ వస్తే? దేశంలోనే అత్యున్నతమైన న్యాయనిపుణులు ఆమెను ఆ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తే? ఎంత ఆనందం! ఎంత గౌరవం! మన హైదరాబాద్‌కు చెందిన హర్షితా రెడ్డి కాసర్ల అలాంటి గౌరవం దక్కించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూపు గత వారం ప్రకటించిన స్కాలర్‌షిప్‌లకు ఆమె ఎంపికయింది. స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే సొమ్ముకన్నా దేశ«ంలో అత్యున్నత న్యాయనిపుణులను కలవటమే ఎక్కువ ఆనందం కలిగిస్తోందంటున్న హర్షితారెడ్డిని నవ్య పలకరించింది..
"నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్ డిబేట్‌లంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్‌లో డిబేటింగ్ పోటీలలో నాదే ఫస్ట్. అందుకే ఇంటర్‌లో చాలామందిలా ఎంపీసీ, బీపీసీలలో చేరలేదు. హ్యూమానిటీస్‌లో చేరాను. ఆ తర్వాత నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదవటానికి చేరాను. ఆ సమయంలోనే నాకు ఆదిత్య బిర్లా స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసింది. బిజినెస్, ఇంజనీరింగ్, న్యాయవిద్యలలో దేశవ్యాప్తంగా 80 మందిని గుర్తించి వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు వాళ్లు. మన దేశంలో ఈ తరహా స్కాలర్‌షిప్ ఇదొకటే. ఈ సారి న్యాయవిద్యలో స్కాలర్‌షిప్‌ల కోసం నాలుగు విశ్వవిద్యాలయాలకు చెందినవారు పోటీ పడ్డారు. దీనిలో పాల్గొనేవారు రెండు వ్యాసాలు రాసి పంపాలి. మన బయోడేటా, రాసిన వ్యాసాల ఆధారంగా 20 మందిని ఎంపిక చేశారు.
దానిలో నేను కూడా ఉన్నాను. మా అందరిని ముంబాయిలో ఒక ప్యానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ప్యానల్‌కు భారత దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వం వహించారు. మిగిలినవారందరూ కూడా ప్రముఖ న్యాయనిపుణులే. వారి ముందు హాజరవటం ఒక గొప్ప అనుభవం. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనటానికి 80 మంది వచ్చారు. వారందరితోను కలిసి మూడు రోజులు ముంబాయిలో ఉన్నా. అదొక కొత్త లోకం అనిపించింది. స్కాలర్‌షిప్ వచ్చిందని తెలిసిన వెంటనే మా అమ్మ, నాన్న- నాకన్నా ఎక్కువ ఆనందపడ్డారు. మాది ఉమ్మడి కుటుంబం. మొత్తం ఎనిమిది మంది పిల్లలం ఉంటాం. ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. నాకు స్కాలర్‌షిప్ ద్వారా వచ్చే డబ్బు కన్నా, దేశంలో ప్రముఖ నిపుణులు నన్ను ఎంపిక చేశారనే భావనే ఎక్కువ ఆనందం కలిగించింది. అంతే కాదు. ప్రతి ఏడాది నల్సార్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్‌లు వస్తాయి. ఈ సారి నా ద్వారా రావటం చాలా ఆనందం కలిగించింది. నాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఈ స్కాలర్‌షిప్ వచ్చింది. ఇక మీద నా ఫీజు మా అమ్మనాన్న కట్టాల్సిన అవసరం లేదు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా వచ్చిన సొమ్ము సరిపోతుంది. నా చదువు ఇంకా నాలుగేళ్లు ఉంది. ఆ తర్వాత దేశంలోనే అత్యున్నత న్యాయనిపుణురాలిగా ఎదగాలనేది నా కోరిక..''
- See more at: http://www.andhrajyothy.com/node/6765#sthash.JHgTqLAf.dpuf

యూత్‌కి 'సహారా'-sahara.helpinghand@gmail.com

"నా స్నేహితురాలు ఒకామె గతేడాది ఆత్మహత్య చేసుకుంది. కారణాలేవైనా కావొచ్చు క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తన విలువైన జీవితాన్ని అంతం చేసుకునేలా చేసింది. అది నా మనసును కలిచివేసింది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే సహారా - హెల్పింగ్ హ్యాండ్ ఏర్పాటు'' అని చెప్పింది 21 యేళ్ల ఆర్తి నాగ్‌పాల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయితో 'చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నావు' అంటే 'అదే నాకు అడ్వాంటేజ్. మా వయసు వాళ్ల సమస్యలు మాకే తెలుస్తాయి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

"నేటి యువత సమస్య తీవ్రతని అర్థం చేసుకోకుండా, ప్రతీ సమస్యకి పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమలోని బాధని ఎవరికీ చెప్పుకోలేక, ఒకవేళ స్నేహితులకి గాని, కుటుంబసభ్యులకు గాని చెప్తే ఏమనుకుంటారోనన్న భయంతో బంగారు జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. అటువంటి వాళ్లకు సాంత్వన అందించేందుకే ఈ ఏడాది జనవరి నుంచి 'సహారా -హెల్పింగ్ హ్యాండ్' మొదలుపెట్టాను. నేటి యువతలో కాలంతో పోటీ పడుతూ పరిగెత్తకపోతే వెనకబడిపోతామన్న భావన నెలకొంది. నెలకొంది అనేకంటే కుటుంబం, సమాజం వాళ్లనలా పరుగులు పెట్టిస్తోందనొచ్చు. చదువు, ఫ్రెండ్‌షిప్‌లో బ్రేకప్స్, కుటుంబసభ్యులతో సర్దుబాటు చేసుకోలేకపోవడం... ఇలా ఒకటేమిటి వాళ్లకు బోలెడు సమస్యలు వస్తున్నాయి. వీటి ప్రస్తావన తెస్తే 'ఇవి కూడా సమస్యలేనా' అని పెద్దవాళ్లకు అనిపించొచ్చు. కాని ఈ విషయాల్లో యువత విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది. అలాంటప్పుడు వాళ్లకి మానసికంగా ఆసరా కావాలి. కాని అది దొరక్క ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు. వాళ్లకి కావాల్సిన ఆసరాని నేను ఇ-మెయిల్స్ ద్వారా అందిస్తున్నాను.  sahara.helpinghand@gmail.com లేదా ఫేస్‌బుక్‌లోsahara-Helping Handఅనే పేజి క్లిక్ చేసి నన్ను సంప్రదించొచ్చు.

ఇ- కౌన్సిలింగ్
ఇ-మెయిల్ వల్ల ప్రయోజనం ఏమిటంటే ముఖాముఖి కౌన్సిలింగ్‌కి వెళ్లినప్పుడు కొన్నిసార్లు మనసులోని విషయాలన్నిట్నీ బయటికి చెప్పలేరు. అదే ఇ-మెయిల్ ద్వారా అయితే ఎదుట ఉండను కాబట్టి విషయాన్ని దాచుకోకుండా స్పష్టంగా చెప్పగలుగుతారు. అలాగని అన్నిసార్లూ ఈ పద్ధతే మంచిదని కాదు. ముఖాముఖి కౌన్సిలింగ్ వల్లే కొన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది. వాళ్లు పంపిన మెయిల్‌ను ఒకటికి నాలుగుసార్లు చదువుతాను. ఆ తరువాతే వాళ్లతో సంభాషణ మొదలుపెడతాను.

అంతేకాని మెయిల్ చూడగానే మాట్లాడడం మొదలుపెట్టను. సమస్యకి వాళ్లే పరిష్కారం ఆలోచించుకునేలా చేస్తాను. 'ఫలానాలా చేయండి బాగుంటుంద'ని నా అంతట నేను సూచించను. లాభనష్టాలను బేరీజు వేసుకుని ఏం చేస్తే బాగుంటుందో వాళ్లే ఆలోచిస్తారు. ఆ పరిష్కారం మంచి ఫలితాన్ని ఇస్తుందంటే దాన్నే అనుసరిస్తారు. ఎవరయితే సమస్యల్లో ఉంటారో వాళ్ల దగ్గరే పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెలికి తీయడానికి నేనో టూల్‌గా ఉపయోగపడుతున్నానంతే. సమస్య తీవ్రంగా ఉండి డాక్టర్ సాయం అవసరమనుకుంటే సైకియాట్రిస్ట్‌ని సంప్రదించమని సూచిస్తాను. ఒక్కో సమస్యని పరిష్కరించడానికి వారం నుంచి రెండు వారాల సమయం పడుతుంది. ప్రారంభంలో యువత మాత్రమే నన్ను సంప్రదించేవారు. ఈ మధ్య కాలంలో 30-40 యేళ్ల మధ్య వయసు వారు కూడా తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు.

ఆర్మీ వాళ్లపై పిహెచ్‌డి
నేను నలుగురికి సాయపడే పని చేస్తున్నానంటే మా అమ్మ రజియా నాగ్‌పాల్, నాన్న నంద్ నాగ్‌పాల్‌ల ప్రోత్సాహమే కారణం. 'ఇదే చదువు. ఇలానే ఉండు' అని నా మీద వాళ్లు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. వాళ్ల అభిప్రాయాలను నాపై రుద్దలేదు. నాకు నచ్చినది చదువుకోనిచ్చారు. ఏడెనిమిది తరగతులు చదివేప్పటి నుండే సెల్ఫ్‌హెల్ప్ బుక్స్ చదివేదాన్ని. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ చదివాను. కాని ఆ సబ్జెక్ట్ నాకు సరిపడదనిపించింది. అందుకని బిఎ సైకాలజీ చేశాను. డిగ్రీ చదువుతున్నప్పట్నించే స్నేహితుల సమస్యలకి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. ఎమ్మెస్సీలో నా స్పెషలైజేషన్ 'హెల్త్ సైకాలజీ'. మొదటి సంవత్సరమంతా థియరీ, రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఉంటాయి.

ప్రాక్టికల్స్‌లో భాగంగా గ్లోబల్ ఆసుపత్రిలో వారాంతాల్లో పనిచేస్తున్నాను. అక్కడ దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. వ్యాధిగ్రస్తుల కేస్‌స్టడీ చదివాక వాళ్లకో ప్రశ్నాపత్రం ఇచ్చి అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఆర్మీ ఉద్యోగుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే అంశంపై పిహెచ్‌డి చేయాలనేది నా లక్ష్యం. కుటుంబాలకు దూరంగా ఉంటూ, యుద్ధభూమిలో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండే వాళ్ల మనోస్థితిని అంచనా వేయాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. ఆ తరువాత క్లినిక్ ఏర్పాటుచేసి పనిచేస్తాను'' అని చెప్తున్న ఈ యువ కౌన్సిలర్ పదో తరగతి వరకు విద్యార్ధులకు ట్యూషన్లు కూడా చెప్తోంది.
Courtesy-Andhrajyothy

ఆర్థికమంతా అతివల చేతుల్లోనే

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్‌పర్సన్‌గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. సహోద్యోగులు చెబుతున్నదాని ప్రకారం, అరుంధతి తొమ్మిది స్థానాలున్న సంఖ్యలతో లెక్కలు సైతం బుర్రలోనే చే సెయ్యగలరు! 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కోల్‌కతాలో కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూనే, తోటి మహిళా ఉద్యోగుల సాధకబాధకాలు పట్టించుకోవడంలో ముందుండేవారు. అటు కుటుంబాన్నీ ఇటు ఉద్యోగ జీవితాన్నీ సరిగా చూసుకోవడానికి స్త్రీలెంత కష్టపడతారో ఆమె బాగా అర్థం చేసుకుని వ్యవహరిస్తారని అరుంధతితో పాటు పనిచేసిన ఉద్యోగినులు చెబుతున్నారు. ఎస్‌బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో 40వేల మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా ఉద్యోగులు కోసం ఆరోగ్య పరీక్షలు ప్రవేశపెట్టిన ఘనత అరుంధతి సొంతం. వచ్చే మూడేళ్లలో ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తన ప్రతిభతో సమర్థంగా నెగ్గుకొస్తారని ఆశిస్తున్నారు ఆమె సహోద్యోగులు.
మన దేశంలోని వివిధ బ్యాంకుల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న మహిళలు ఎవరెవరంటే...
-ఐసీఐసీఐ - చందా కొచ్చార్
- ఏక్సిస్ బ్యాంక్ - శిఖా శర్మ
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - విజయలక్ష్మీ అయ్యర్
- హెచ్ఎస్‌బీసీ - నైనాలాల్ కిద్వాయ్
- యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - అర్చనా భార్గవ
- అలహాబాద్ బ్యాంక్ - శుభలక్ష్మి పన్సే
- బ్యాంక్ ఆఫ్ అమెరికా - కకు నఖటే
Courtesy-Andhrajyothy

ఇసుక తుఫాన్ 'జజీరా'

ఉత్తరప్రదేశ్‌లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్‌కు గురైన దుర్గ్గాశక్తి నాగ్‌పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం మహిళ 'జజీరా'. స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట మొదలుపెట్టిన నిరసనను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, దేశ రాజధాని వరకు తీసుకెళ్లి సంచలనం రేపుతున్న ఆ ఇసుకతుఫాన్ గురించే ఈ కథనం..

అది ఢిల్లీలోని జంతర్‌మంతర్. పొద్దున్నే వణికించే చలిలో నిరసన తెలిపేందుకు సన్నద్ధం అవుతున్నారు ఉద్యమకారులు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ డిమాండ్ వచ్చినా, దాన్ని దేశరాజధానిలో వినిపిస్తే భారతదేశమంతా వినిపిస్తుందన్నది ఉద్యమకారుల నమ్మకం. అదే కోరికతో ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని జంతర్‌మంతర్‌కు వచ్చింది ఒక తల్లి. పేరు జజీరా. ముప్పయి ఏళ్లుంటాయేమో! పిల్లల సహాయంతోనే ఒక చిన్న నీలిరంగు టెంటు కట్టుకుంది. హిందీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ఎర్రటి బ్యానరొకటి వాళ్ల వెనకవైపు కనిపిస్తోంది. అందులో 'ఇసుక మాఫియాను అరికట్టండి' అన్న నినాదం ఎర్రెర్రటి అక్షరాలతో నిగనిగలాడుతోంది. అక్కడ వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేస్తున్న వాళ్లెవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు. కాని జాతీయస్థాయి మీడియా పట్టించుకుంది. చేతుల్లో మైకులు, భుజాల మీద కెమెరాలు పట్టుకుని ఆమెను చుట్టుముట్టారు పాత్రికేయులు. కెమెరాలన్నీ ఆమెవైపు తిరిగాయి. ఢిల్లీవాసులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అందరూ 'ఎవరీమె?', 'పిల్లల్ని తీసుకుని ఇంత దూరం ఎందుకొచ్చినట్లు?' కనుక్కోవడం మొదలుపెట్టారు.

జీవితమే ఒక పోరాటం..
జజీరా సొంతూరు కేరళలోని కన్నూర్‌లోని మడాయి అనే గ్రామం. అదొక తీర ప్రాంతం. ఆమెది కట్టుబాట్లున్న నిరుపేద ముస్లిం కుటుంబం. తండ్రి అర్ధాంతరంగా మరణించడంతో పదోతరగతిలోపే చదువు మానేయక తప్పలేదు. ముగ్గురు సోదరుల భారాన్ని జజీరా మోయాల్సి వచ్చింది. పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకుందామె. భర్త స్త్రీలోలుడు, తాగుబోతు. కాపురాన్ని భరించలేక బంధాన్ని తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో దిక్కుతెలియని జజీరా.. పిల్లల్ని పట్టుకుని కన్నూర్ నుంచి ఎర్నాకుళం చేరుకుంది. "రెండేళ్లు కూలి పని చేశాను. బతకడం కష్టమైంది. దిక్కుతోచక మళ్లీ కొట్టాయం వెళ్లిపోయి.. అక్కడ పుస్తకాలను విక్రయించి పిల్లల్ని పోషించాను. మళ్లీ సొంతూరైన కన్నూర్‌కు రావాల్సి వచ్చింది. అక్కడే డ్రైవింగ్ నేర్చుకున్నాను. లైసెన్సు తీసుకుని ఆటోరిక్షా నడపడం మొదలుపెట్టా. అప్పటి వరకు నా కుటుంబంతో పోరాడాల్సి వచ్చింది. ఆటో తోలడం మొదలుపెట్టాక సమాజంతో పోరాడాల్సి వచ్చింది..'' అంటూ చెప్పుకొచ్చింది జజీరా. ఆటోస్టాండులో అందరూ మగవాళ్లున్నారు. తనొక్కతే మహిళ. తోటి ఆటోవాలాల ఎగసెక్కాలు, కామెంట్లు ఎక్కువయ్యేవి. "ఒక్కోసారి వాళ్ల వేధింపులు భరించలేకపోయేదాన్ని. ఆటోస్టాండులోనే కాదు. ప్యాసింజర్లను తీసుకుని రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవే కామెంట్లు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..'' అని గుర్తుచేసుకుంది.

మా తీరం మాకు కావాలి..
ఒక మదర్సాలో పాఠాలు బోధించే అబ్దుల్‌సలామ్ పరిచయం కావడంతో.. అతన్ని విశ్వసించి రెండో పెళ్లి చేసుకుంది. ఆయన ఉద్యమానికి సహకరిస్తున్నారు. "అది 2011. మూడో బిడ్డ కడుపులో ఉంది. కాన్పు కోసం మా అమ్మగారి ఊరైన కన్నూర్‌కు వెళ్లాను. మాది సముద్ర తీరప్రాంతం. ఎక్కువగా పేదవాళ్లే నివశించేవాళ్లక్కడ. కాని ఈ మధ్య పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలు వచ్చేశాయి. మా సమస్య అది కాదు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోతుండటం సమస్య. నదుల్లోని ఇసుకంతా అయిపోయింది. అందుకని అందరూవచ్చి సముద్రతీరం మీద పడ్డారిప్పుడు. ఇలాగే తరలించుకుపోతే తీరం మాయమైపోతుంది. దానివల్ల సముద్రపు నీళ్లు ముందుకు చొచ్చుకొస్తాయి.

ఉప్పెనలు, తపాన్లు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లు మునిగిపోవడం ఖాయం. అది అందరికీ నష్టమే'' అన్నది జజీరా ఆవేదన. ఆమె చెప్పినట్లు ఒకప్పుడు ఫుట్‌బాల్ మైదానాల్ని తలపించే కన్నూర్ తీరప్రాంతం ఇప్పుడు ఫుట్‌పాత్ సైజుకు చేరడం దారుణం. ఇరుగుపొరుగు, ఊర్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరి దగ్గరకెళ్లి ఇసుక సమస్య గురించి చెప్పినా చైతన్యం రాలేదు. తనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. బిడ్డల్ని ఒక చంకన వేసుకుని, మరో చేత్తో కొంగును నడుముకు చుట్టుకుని 'ఇసుక మాఫియా' మీద పోరాటం ప్రకటించిందీమె. "ముందు నా ఇంటి నుంచే ఉద్యమం మొదలవ్వాలి. ఒకప్పుడు నేను ఎంతో అపురూపంగా చూసుకున్న నా సోదరులే ఇసుకమాఫియాకు సహకరిస్తున్నారు. వాళ్లు దినకూలీలు. అయినా సరే ఆ పని మానేసి మరో పని చేసుకొమ్మని చెప్పాను. వినలేదు. అందుకే వాళ్లుంటున్న వీధుల్లో నా తొలినిరసన చేపట్టాను'' అని చెప్పిందామె. నెలల పసికందును ఎత్తుకునే ఇసుకతోడుతున్న లారీలు, ట్రక్కుల ఫోటోలు తీసి.. రెవెన్యూ ఆఫీసులకు వెళ్లి.. ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది జజీరా. అధికారులందరూ ఆమెను ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు తప్ప సమస్యను ఆలకించలేదు. తెల్లకాగితంలో రాసిన వినతిపత్రాన్ని పైనుంచి కింది వరకు చూసి.. 'వెళ్లిరండి' అని తలూపి పక్కనపడేసేవారు. "ఈ దేశంలో అన్నిటికంటే ఘోరమైన అన్యాయం ఇసుక అక్రమరవాణా. ఇందులో పోలీసులు, బిల్డర్లు, అధికారులు, నేతలు కుమ్మక్కై ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారు'' అనే జజీరాకు శత్రువులు పెరిగిపోయారు. ఇసుకమాఫియా వాళ్లందరూ ఒక్కటై ఆమె మీద దాడి చేశారు. కొట్టారు. బూతులు తిట్టారు. తోటి మహిళా కూలీలతోనే చావబాదించారు. "ఒకసారి నా పిల్లలతో సహా ఇసుకలారీకి అడ్డంగా పడుకున్నాను. నన్ను లారీకింద తొక్కిస్తామని భయపెట్టారు. అయినా సరే జంకలేదు. నా తలను పట్టుకుని ఇసుకలో పూడ్చిపెట్టారు. నా మొండితనాన్ని భరించలేక మా ఇంటిని ధ్వంసం చేశారు. నా చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని పగలగొట్టారు. వీటికే వెన్నుచూపితే నేనీ ఉద్యమం చేసేదాన్నే కాదు'' అందీ కేరళ మహిళ.

జిల్లా కలెక్టర్ దృష్టికి..
'ఇసుకమాఫియాతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయ్. నీకు ముగ్గురు పిల్లలున్నారు. మనకెందుకిదంతా? ఆలోచించు' అని బంధువులు సముదాయించినా ఊరుకోలేదు. పుతియంగడి అనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి మరొక ఫిర్యాదు చేసింది జజీరా. అక్కడున్న పోలీసులు 'వెళ్లు వెళ్లవమ్మా, నువ్వు ఒక్కతే దేశాన్ని ఉద్దరిస్తావా ఏందీ?'' అని కసురుకున్నారు. వాళ్లతో వాదనకు దిగలేదామె. మౌనంగా స్టేషను గేటు వద్దకు వచ్చి, ఒక పాత గుడ్డ పరుచుకుని నిరసనకు కూర్చుంది. "వెళ్లిపోతుందనుకున్న మనిషి ఇలా భీష్మించుకు కూర్చుందేమిటి? పైఅధికారులకు తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి?'' అని వణికిపోయారు పోలీసులు. ఒకట్రెండు రోజులు కాదు. వారం గడిచింది. స్థానిక మలయాళ పత్రికలు జజీరా పోరాటాన్ని ప్రచురించాయి. ఆమె పట్టుదలను మెచ్చుకుంటూ పలువురు సామాజికవేత్తలు చేతులు కలిపారు. అనుకున్నట్లుగానే పైఅధికారుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అది కూడా జిల్లా కలెక్టర్ నుంచి! జజీరాను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు పోలీసులు.

"ఏమిటమ్మా నీ సమస్య. పత్రికల్లో చూస్తున్నాను. ఏమిటి చెప్పు?'' అని అడిగారు కలెక్టర్. "సార్, కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయింది మా తీరప్రాంతం. ఇదెంత అన్యాయం? ఇంతమంది అధికారులు, ఇంతపెద్ద వ్యవస్థ మనకుంది. ఒక్కరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోవడం వల్ల మా బతుకులు మునిగిపోతాయి. మీరైనా న్యాయం చేయండి..'' అంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది జజీరా. "నీ దగ్గరున్న ఆధారాలన్నీ ఇవ్వు. యాక్షన్ తీసుకుంటాను. ఆ సంగతి నాకు వదిలేసి, నువ్విక ఇంటికి వెళ్లు..'' అని సర్దిచెప్పి జజీరాను ఇంటికి పంపించారు కలెక్టర్. కొన్నాళ్లు స్థానిక అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫలితం సున్నా. పోనీలే అని ఊరుకోలేదు జజీరా. మళ్లీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. "అయ్యా, నేను కలెక్టర్‌ను కలవాలి. అనుమతి ఇప్పించండి'' అని అడిగితే- "ఏమిటమ్మా నీ ఇసుక సమస్య పరిష్కారం కాలేదా? ప్రతి చిన్న విషయానికీ కలెక్టర్‌ను కలవాలంటే కుదరదు. అనుమతిస్తే మా ఉద్యోగాలు పోతాయ్'' అని కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు జజీరాను వెనక్కి పంపించారు. సర్కారు చేతిలో మోసపోయానన్న సంగతి తెలుసుకున్న ఆమె.. ఈసారి ఉద్యమస్థావరాన్ని మార్చాలనుకుంది. ముగ్గురు పిల్లలను తీసుకుని కేరళ రాజధాని అయిన తిరువనంతపురం వెళ్లే రైలు ఎక్కింది. ఈసారి సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలపాలన్నది ఆమె ఆలోచన. "నువ్వు ఎందుకిలా తయారవుతున్నావ్. పిల్లల్ని చెడగొడుతున్నావ్. రాజధానిలో నీ అరుపులు ఎవరికి వినిపిస్తాయి? నువ్వొక మహిళవు'' అని ఊళ్లో వాళ్లందరూ అడ్డుకున్నా వినలేదు.

సిఎం నుంచి పిలుపు..
తిరువనంతపురంలోని సెక్రటేరియట్. గేటుకు ఎదురుగా చిన్న గుడారం. ఒక పెద్ద బ్యానరు. ఇసుకమాఫియాను అరికట్టండి అన్న నినాదం. ఇటూఇటూ ఇద్దరు ఆడపిల్లలు, ఒళ్లో ఒక చంటిగాడు. చూసేవాళ్లకు ఆ సన్నివేశం వింతగా ఉంది. ప్రతిరోజు సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారు, పోతున్నారు. జజీరాది ఒక రోజుండి పోయే నిరసనేలే అనుకున్నారంతా! రోజులు గడిచినా సీను మారలేదు. విషయాన్ని ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. "సెక్రటేరియట్ గేటు ఎదురుగా కూర్చున్న ఆమెను పిలవండి. మాట్లాడాలి'' అని అధికారులను ఆదేశించాడు ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ. "అయ్యా, నమస్కారం. ఇప్పటికే నా సమస్య మీ దృష్టికి వచ్చుండాలి..'' అని వినయంగా చెప్పింది జజీరా. "ఏమిటమ్మా ఇది. సెక్రటేరియట్‌కు వచ్చి నిరసన తెలపడమేమిటి? మీ ఊళ్లో పోలీసులు, అధికారులు ఉన్నారు కదా! కలవలేకపోయావా?'' అన్నారు సీఎం. "అయ్యా, అవన్నీ అయిపోయాకే ఇక్కడికి వచ్చాను. నాకెక్కడా పరిష్కారం దొరకలేదు'' అని సమాధానం ఇచ్చింది. "సరే, నేను మీ జిల్లా అధికారులతో మాట్లాడతాను. మీ తీరంలో ఇసుకతవ్వకాలను నిలుపుదల చేయిస్తా. నువ్వు ఇంటికి వెళ్లిపో'' అన్నారు సీఎం. "అయ్యా, చాలా సంతోషం. ఆ మాటేదో మీరు నోటితో కాకుండా రాతపూర్వకంగా ఇస్తే మంచిది. అప్పుడే నా నిరసనదీక్ష విరమిస్తాను'' అని మెలికపెట్టింది జజీరా. అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో.. నిరసనను విరమించడానికి జజీరా కూడా ఒప్పుకోలేదు. సెక్రటేరియట్ ఎదురుగ్గానే 64 రోజులు దీక్ష చేసింది. ప్రభుత్వం మొండిదైతే అంతకంటే మొండిది జజీరా. రాష్ట్రంలో రేపిన ఇసుకతుపానును.. ఢిల్లీ వీధుల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ఢిల్లీ వీధుల్లో..
అదే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరం. "నేను ఢిల్లీకి వచ్చింది సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని కాదు. ఇసుక అక్రమ తవ్వకాలను జాతీయస్థాయి సమస్యను చేయాలన్నది నా ఉద్దేశ్యం. నాకిక్కడ ఎంతోమంది అండ దొరుకుతోంది'' అంది. జజీరా ఇసుక తుపాను సంచలనం రేపడంతో.. జాతీయ మానవహక్కుల కమీషన్ స్పందించింది. "ఇసుక అక్రమ తవ్వకాల మీద మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపే ఒక నివేదిక ఇవ్వండి'' అంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇదే సమస్య మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ జోక్యం చేసుకుంటూ.. కేరళ ముఖ్యమంత్రికి ఒక వ్యక్తిగత లేఖ రాశారు. ప్రస్తుతానికి జజీరా కథ ఇక్కడి వరకు వచ్చింది. జజీరాలాంటి ఒక్క చిన్న ఇసుక రేణువు ఈ వ్యవస్థ కళ్లలో పడినా.. కాసేపైనా బాధతో కళ్లు నులుపుకోక తప్పదు. అదే పోరాటానికున్న శక్తి.. దాన్ని మరొకసారి నిరూపించిందీ సామాన్య ముస్లిం మహిళ.
Courtesy-Andhrajyothy