"నా స్నేహితురాలు ఒకామె గతేడాది ఆత్మహత్య చేసుకుంది. కారణాలేవైనా కావొచ్చు క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తన విలువైన జీవితాన్ని అంతం చేసుకునేలా చేసింది. అది నా మనసును కలిచివేసింది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే సహారా - హెల్పింగ్ హ్యాండ్ ఏర్పాటు'' అని చెప్పింది 21 యేళ్ల ఆర్తి నాగ్‌పాల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ రెండో సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయితో 'చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నావు' అంటే 'అదే నాకు అడ్వాంటేజ్. మా వయసు వాళ్ల సమస్యలు మాకే తెలుస్తాయి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
"నేటి యువత సమస్య తీవ్రతని అర్థం చేసుకోకుండా, ప్రతీ సమస్యకి పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమలోని బాధని ఎవరికీ చెప్పుకోలేక, ఒకవేళ స్నేహితులకి గాని, కుటుంబసభ్యులకు గాని చెప్తే ఏమనుకుంటారోనన్న భయంతో బంగారు జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. అటువంటి వాళ్లకు సాంత్వన అందించేందుకే ఈ ఏడాది జనవరి నుంచి 'సహారా -హెల్పింగ్ హ్యాండ్' మొదలుపెట్టాను. నేటి యువతలో కాలంతో పోటీ పడుతూ పరిగెత్తకపోతే వెనకబడిపోతామన్న భావన నెలకొంది. నెలకొంది అనేకంటే కుటుంబం, సమాజం వాళ్లనలా పరుగులు పెట్టిస్తోందనొచ్చు. చదువు, ఫ్రెండ్‌షిప్‌లో బ్రేకప్స్, కుటుంబసభ్యులతో సర్దుబాటు చేసుకోలేకపోవడం... ఇలా ఒకటేమిటి వాళ్లకు బోలెడు సమస్యలు వస్తున్నాయి. వీటి ప్రస్తావన తెస్తే 'ఇవి కూడా సమస్యలేనా' అని పెద్దవాళ్లకు అనిపించొచ్చు. కాని ఈ విషయాల్లో యువత విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది. అలాంటప్పుడు వాళ్లకి మానసికంగా ఆసరా కావాలి. కాని అది దొరక్క ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటున్నారు. వాళ్లకి కావాల్సిన ఆసరాని నేను ఇ-మెయిల్స్ ద్వారా అందిస్తున్నాను. sahara.helpinghand@gmail.com లేదా ఫేస్‌బుక్‌లోsahara-Helping Handఅనే పేజి క్లిక్ చేసి నన్ను సంప్రదించొచ్చు.
ఇ- కౌన్సిలింగ్
ఇ-మెయిల్ వల్ల ప్రయోజనం ఏమిటంటే ముఖాముఖి కౌన్సిలింగ్‌కి వెళ్లినప్పుడు కొన్నిసార్లు మనసులోని విషయాలన్నిట్నీ బయటికి చెప్పలేరు. అదే ఇ-మెయిల్ ద్వారా అయితే ఎదుట ఉండను కాబట్టి విషయాన్ని దాచుకోకుండా స్పష్టంగా చెప్పగలుగుతారు. అలాగని అన్నిసార్లూ ఈ పద్ధతే మంచిదని కాదు. ముఖాముఖి కౌన్సిలింగ్ వల్లే కొన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది. వాళ్లు పంపిన మెయిల్‌ను ఒకటికి నాలుగుసార్లు చదువుతాను. ఆ తరువాతే వాళ్లతో సంభాషణ మొదలుపెడతాను.
అంతేకాని మెయిల్ చూడగానే మాట్లాడడం మొదలుపెట్టను. సమస్యకి వాళ్లే పరిష్కారం ఆలోచించుకునేలా చేస్తాను. 'ఫలానాలా చేయండి బాగుంటుంద'ని నా అంతట నేను సూచించను. లాభనష్టాలను బేరీజు వేసుకుని ఏం చేస్తే బాగుంటుందో వాళ్లే ఆలోచిస్తారు. ఆ పరిష్కారం మంచి ఫలితాన్ని ఇస్తుందంటే దాన్నే అనుసరిస్తారు. ఎవరయితే సమస్యల్లో ఉంటారో వాళ్ల దగ్గరే పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెలికి తీయడానికి నేనో టూల్‌గా ఉపయోగపడుతున్నానంతే. సమస్య తీవ్రంగా ఉండి డాక్టర్ సాయం అవసరమనుకుంటే సైకియాట్రిస్ట్‌ని సంప్రదించమని సూచిస్తాను. ఒక్కో సమస్యని పరిష్కరించడానికి వారం నుంచి రెండు వారాల సమయం పడుతుంది. ప్రారంభంలో యువత మాత్రమే నన్ను సంప్రదించేవారు. ఈ మధ్య కాలంలో 30-40 యేళ్ల మధ్య వయసు వారు కూడా తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు.
ఆర్మీ వాళ్లపై పిహెచ్‌డి
నేను నలుగురికి సాయపడే పని చేస్తున్నానంటే మా అమ్మ రజియా నాగ్‌పాల్, నాన్న నంద్ నాగ్‌పాల్‌ల ప్రోత్సాహమే కారణం. 'ఇదే చదువు. ఇలానే ఉండు' అని నా మీద వాళ్లు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. వాళ్ల అభిప్రాయాలను నాపై రుద్దలేదు. నాకు నచ్చినది చదువుకోనిచ్చారు. ఏడెనిమిది తరగతులు చదివేప్పటి నుండే సెల్ఫ్‌హెల్ప్ బుక్స్ చదివేదాన్ని. ఇంటర్మీడియెట్‌లో కామర్స్ చదివాను. కాని ఆ సబ్జెక్ట్ నాకు సరిపడదనిపించింది. అందుకని బిఎ సైకాలజీ చేశాను. డిగ్రీ చదువుతున్నప్పట్నించే స్నేహితుల సమస్యలకి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని. ఎమ్మెస్సీలో నా స్పెషలైజేషన్ 'హెల్త్ సైకాలజీ'. మొదటి సంవత్సరమంతా థియరీ, రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ఉంటాయి.
ప్రాక్టికల్స్‌లో భాగంగా గ్లోబల్ ఆసుపత్రిలో వారాంతాల్లో పనిచేస్తున్నాను. అక్కడ దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. వ్యాధిగ్రస్తుల కేస్‌స్టడీ చదివాక వాళ్లకో ప్రశ్నాపత్రం ఇచ్చి అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఆర్మీ ఉద్యోగుల మానసిక స్థితి ఎలా ఉంటుందనే అంశంపై పిహెచ్‌డి చేయాలనేది నా లక్ష్యం. కుటుంబాలకు దూరంగా ఉంటూ, యుద్ధభూమిలో ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉండే వాళ్ల మనోస్థితిని అంచనా వేయాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. ఆ తరువాత క్లినిక్ ఏర్పాటుచేసి పనిచేస్తాను'' అని చెప్తున్న ఈ యువ కౌన్సిలర్ పదో తరగతి వరకు విద్యార్ధులకు ట్యూషన్లు కూడా చెప్తోంది.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment