పెనం మీద సుయ్యిమనగానే వేడివేడి దోశను ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. దక్షిణ భారతీయులు భోజనప్రియులే కాదు.. దోశప్రియులు కూడా! రకరకాల కాంబినేషన్‌లతో దోశల్ని లాగించడం చాలామందికి ఇష్టం. దోశలను తినడం ఎంత సులువో, వాటిని గబగబా వేయడం అంత కష్టం. హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చేవాళ్లందరూ ఒకేసారి ఆర్డర్ చేస్తుంటారు. అప్పుడు అడిగినవాళ్లందరికీ వేడివేడి దోశల్ని సరఫరా చేయడం ఆషామాషీ కాదు. ఈ సమస్యకు పరిష్కారం 'దోశమేటిక్'. ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ దోశల యంత్రానికి దోశమేటిక్ అని నామకరణం చేశారు దీని తయారీదారులు. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఈశ్వర్, వికాస్, సందీప్ అనే విద్యార్థుల బృందం దీన్ని కనిపెట్టింది.
ప్రస్తుతానికి ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, దోశల కార్నర్‌లకు చక్కగా పనికొస్తోంది. "ఢిల్లీలో దోశ తినాలంటే వంద, అదే చెన్నైలో అయితే డెబ్బై, హైదరాబాద్‌లో మాత్రం యాభై రూపాయలు. ఇలా.. ఒక్కోచోట ఒక్కో ధరలు ఎందుకున్నాయంటే - దోశలు వేసేవాళ్ల జీతభత్యాలను బట్టి ఉంటున్నాయవి. అదే పిజ్జా, బర్గర్‌లు అన్ని చోట్ల ఒకే రేటుకు ఎందుకు దొరుకుతున్నాయంటే.. వాటిని ఎక్కువగా మిషన్లు తయారుచేయడం వల్లనే. దోశల తయారీకి వంటవాళ్ల కొరత ఎక్కువగా ఉన్నందున వాటి ధర అధికంగా ఉంది'' అని చెబుతున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు.
దోశలను వేగంగా, రుచికరంగా తయారుచేయాలన్నది వాళ్ల లక్ష్యం. స్నేహితుల బృందంలోని సభ్యులందరూ తలాకొంత మొత్తం పోగుచేసుకుని సుమారు ఆరులక్షల రూపాయలతో దోశమేటిక్ యంత్రాన్ని రూపొందించారు. విద్యార్థుల ఆసక్తిని ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం కూడా కొంత ఆర్థిక చేయూతను అందించింది. విద్యార్థులు కనుక్కున్న ఈ దోశల యంత్రం అచ్చం మైక్రోఓవెన్ మాదిరే కనిపిస్తుంది. దీని పైభాగంలోని మూడు అరల్లో ఒక దాంట్లో దోశపిండి, మరొక దాంట్లో నూనె, ఇంకొక అరలో నీళ్లు పోసి మూతపెట్టాలి. యంత్రానికి దిగువభాగాన అమర్చిన చిన్న బటన్‌ను నొక్కితే సరి.. నిమిషంలో వేడివేడి దోశ బయటికి వస్తుంది. "ఓ మోస్తరు హోటల్‌లో రోజుకు అయిదు వందల దోశలు అమ్ముడుపోతాయి. మా యంత్రంతో రోజుకు ఏడువందల దోశల్ని తయారుచేయవచ్చు.
అంటే హోటల్‌కు వచ్చేవాళ్లందరికీ దీంతోనే దోశల్ని వేయవచ్చన్నమాట. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత- ఏ మనిషీ తాకకుండా దోశల్ని వేయడం. దాంతోపాటు దోశ ఎంత మందంలో కావాలి? పల్చగా కరకరలాడేలా ఉండాలా? ఏ రంగులో ఉంటే బావుంటుంది? ఇవన్నీ యంత్రంలో సరిచేసుకోవచ్చు. కాఫీమెషిన్‌లో బటన్‌నొక్కితే క్షణాల్లో కాఫీ ఎలా వస్తుందో దోశల యంత్రంలో కూడా అంతే! చిన్న బటన్ నొక్కితే దోశలు బయటికి వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి దోశల యంత్రం ధర మధ్యతరగతికి అందుబాటులో లేదు. యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది. హోటళ్లు, దోశల దుకాణదారులకు మాత్రం బాగా పనికొస్తుంది.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment