- శ్రీభావ
కొందరు చాలా వేగంగా పరిగెత్తుతారు. కొందరి వేగం తక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి వేగం అతనికి ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఈ శక్తి అందరికి ఒకే విధంగా ఉండదు. ఫెంగ్‌షూ ఈ మౌలిక సూత్రాన్ని గుర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి అవసరమైన శక్తి వినిమయం భిన్నంగా ఉంటుంది కాబట్టి దానిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశాన్ని వివరిస్తుంది.
ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం మనం నివసించే దిక్కు, మనం నివసించే ప్రదేశంలో ఉండే వస్తువులు, వాటి రంగులు, వాటి ఆకృతుల వల్ల శక్తి వినిమయంలో తేడాలు ఏర్పడతాయి. అసలు మనకు ఎంత శక్తి ఉందనే విషయం తెలుసుకుంటే- దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటానికి వీలవుతుంది.
ఎన్ని రకాలు...
ఫెంగ్‌షూలో శక్తి ప్రసారం ఆధారంగా- మొత్తం మానవులందరినీ తూర్పు, పడమర వ్యక్తులుగా వర్గీకరిస్తారు. మనం ఏ దిక్కుకు చెందుతామో తెలుసుకోవాలంటే - కువా నెంబర్‌ను ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. కువా నెంబర్‌ను ఒక వ్యక్తి పుట్టిన (చైనీయుల) సంవత్సరం, స్త్రీ, పురుష భేదం ఆధారంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. చైనీయుల సంవత్సరాలకు ఆంగ్ల సంవత్సరాలకు మధ్య తేడా ఉంటుంది. ప్రతి ఏడాది చైనీయులకు కొత్త సంవత్సరం వేర్వేరు రోజుల్లో ప్రారంభమవుతుంది.
ఇంటర్నెట్‌లో మనం పుట్టిన సంవత్సరం ఆధారంగా- చైనీయుల సంవత్సరాన్ని తెలియజేసే వెబ్‌సైట్లు అనేకం ఉన్నాయి. వీటి ద్వారా మనం చైనా క్యాలెండర్ ప్రకారం ఏ సంవత్సరంలో పుట్టామో తెలుసుకోవచ్చు. స్త్రీ, పురుషులకు కువా నెంబర్‌ను ఎలా గణించాలో ఇప్పుడు చూద్దాం.
స్త్రీల కువా నెంబర్
చైనీయుల క్యాలెండర్ ప్రకారం వచ్చే మన జన్మ సంవత్సరంలోని చివరి రెండు అంకెలను కలపాలి. ఆ సంఖ్యకు ఐదు కలపాలి. (ఒక వేళ రెండంకెలు వస్తే- దానిని కూడా ఒక అంకెగా మార్చాలి). అప్పుడు వచ్చేదే కువా నెంబర్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అమ్మాయి చైనీయుల క్యాలెండర్ ప్రకారం 1998లో పుట్టిందనుకుందాం. ఆమె పుట్టిన సంవత్సరంలో చివరి రెండు అంకెలు కలిపితే (9+8) 17 అవుతుంది. ఈ రెండింటినీ కలిపితే 8 వస్తుంది. దీనికి 5 కలిపితే 13 అవుతుంది. ఈ రెంటినీ కలిపితే వచ్చే 4 ఆ అమ్మాయి కువా నెంబర్.
పురుషులకు కువా నెంబర్
దీనిలో కూడా సంవత్సరం చివరలో ఉన్న రెండు అంకెలను కలిపి ఒక సంఖ్య తేవాలి. దానిని పదిలో నుంచి తీసివేయాలి. అప్పుడు వచ్చేదే పురుషుల కువా నెంబర్. ఉదాహరణకు ఒక పురుషుడు 1965లో పుట్టాడనుకుందాం. చివర రెండు అంకెలను కలిపితే 11 వస్తుంది. ఆ రెండింటినీ కలిపితే రెండు అవుతుంది. దీనిని పదిలో నుంచి తీసేస్తే వచ్చే 8 సంఖ్య ఆ పురుషుడి కువా నెంబర్.
ఈ కువా నెంబర్ల ఆధారంగా ఒక వ్యక్తి తూర్పు, పడమర దిక్కులలో దేనికి చెందినవారో తెలుసుకోవచ్చు. ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం- 1,3,4, 9 సంఖ్యలకు చెందిన వారు తూర్పు దిక్కుకు చెందిన వారు. 2,5,6,7,8 సంఖ్యలకు చెందిన వారు పశ్చిమ దిక్కుకు చెందిన వారు.
ఫెంగ్ షూ : మన అదృష్ట దిక్కులను తెలుసుకోవటం ఎలా?
- శ్రీభావ
గత వారం కువా నెంబర్లను గణించటం తెలుసుకున్నాం. ఈ సారి ఈ కువా నెంబర్ల ద్వారా మనలోని శక్తిని ఎలా పెంచుకోవాలో, అదృష్టాన్ని దగ్గరకు ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం.
కువా నెంబర్ల ఆధారంగా ఏఏ దిక్కుల్లో మన ఇంటిని, ఆఫీసును సర్దుకోవాలో తెలియజేసే ఒక చార్టును చూద్దాం..
ఈ చార్టు ప్రకారం మనకు అత్యంత ముఖ్యమైన వాటిని ముందుగా నిర్దేశించుకొని, దానికి తగినట్లుగా ఇంటిని, ఆఫీసును ఆ దిక్కులలో ఉండే విధంగా సర్దుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సార్లు భాగస్వాములకు, భార్యాభర్తలకు వేర్వేరు దిక్కులు వచ్చే అవకాశముంది. అప్పుడు ఇద్దరి చార్టుల్లోను ముఖ్యమైన దిక్కును తీసుకొని దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి తూర్పు, ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం దిక్కులు మంచివని వచ్చాయనుకుందాం. అతని భాగస్వామికి పశ్చిమం, ఈశాన్యం, ఉత్తరం, నైరుతి దిక్కులు మంచివని వచ్చాయనుకుందాం. అప్పుడు ఇంటిలో ముఖ్యమైన అంశాలకు ఉత్తరం దిక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి సర్దుకోవాల్సి ఉంటుంది.
మన భారతీయ సంస్కృతిలో ఆవుకు ఒక విశిష్టమైన స్థానముంది. భారత్, నేపాల్ వంటి దేశాల్లో ఆవును కామధేనువుగా కొలుస్తారు. బౌద్ధమతంలో కూడా ఆవుకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. మన కోర్కెలను తీర్చటానికి ఆవును ఒక సాధనంగా బౌద్ధమతం పేర్కొంటుంది. ఆవును కరుణతో ఆదరిస్తే- అది మన కోర్కెలను తీరుస్తుందని బౌద్ధులు నమ్ముతారు. ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఆఫీసు టేబుల్‌పైన బంగారు నాణేలపై కూర్చుని ఉన్న ఆవు బొమ్మను పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుంది. ఇంట్లో ఆగ్నేయ మూల ఆవు బొమ్మను పెట్టుకుంటే కూడా ధనం సమృద్ధిగా చేకూరుతుందని నమ్మకం. మన దేశంలోని కొన్ని పురాతనమైన ఇళ్లలో కూడా ఆగ్నేయం మూల కృష్ణుడు, ఆవులు ఉన్న ఫోటోలు ఉంటాయి
Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment