October 30, 2013
ఎన్‌జివోలతో కలిసి సేవా కార్యక్రమాలు
సొంతంగా పలు సేవా సంస్థలు
ఇద్దరు ఆడపిల్లల దత్తత
2013 సంవత్సరానికి మధర్‌థెరిస్సా అవార్డు
మహిళలకు స్ఫూరిగా నిలుస్తున్న సుస్మిత
అందం అంటే రూపం ఒక్కటే కాదు నిరూపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ విశ్వ సుందరీ కిరీటాన్ని గెలిచి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా వాటిలో పాల్గొనడం అసాధ్యం. సుస్మితాసేన్ నేనున్నాను అంటూ ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లి కాకపోరుునా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇది హర్షించదగిన విషయం. ఆడపిల్లలు అంటేనే బయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న నేటి కాలంలో ఈమె దత్తత తీసుకున్న ఇద్దరూ ఆడపిల్లలే కావడం గమనార్హం. అందులో ఒకరి కోసం న్యాయపోరాటం కూడా చేసింది. మధర్‌థెరిస్సా అవార్డును అందుకున్న సందర్భంగా సుస్మితాసేన్ గురించి నేటి కలర్స్...
పిల్లల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆమె మాటలు నయాగరా జలపాతమే అవుతాయి. ఒకదాని వెంట ఒకటిగా గొలుసుకట్టు కబుర్లెన్నో లెక్కకు మించి చెప్తోంది ఆనందంగా. మా పెద్దదానికి సినిమాల పిచ్చి. టెలివిజన్ దొరికితే చాలు, ఇక వదిలి పెట్టదు. పాటల, వాటి నృత్యాలను అదేపనిగా పరిశీలిస్తూ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తుంది. నేను ఇంటికి చేరుకున్న తరువాత వాటిని గుక్క తిప్పుకోకుండా చెప్తూ, మళ్లీ అనుకరించి చూపించడం దానికి ఎంతో ఇష్టం అంటోంది సుస్మిత. ఇక రెండో కూతురు ఇప్పుడే నాకు అర్థమయ్యేలా లేదు. అదో చిచ్చర పిడుగు. దాన్ని క్రమశిక్షణలో పెట్టే పని నాకు చాలా పెద్దదే అంటోంది అలీషాను గుర్తు చేసుకుంటూ.
మథర్‌థెరిస్సా అవార్డు గురించి
ఈ ప్రపంచంలో ఆకలి అంటే తిండి కోసం మాత్రమే కాదు... సేవ(బ్యూటీ) కోసం కూడా... : మథర్‌థెరిస్సా ఆమె ఆశయ సాధన కోసం ప్రపంచాన్ని అందం(సేవ)గా తయారు చేయడం కృషి చేసిన వారికి కోసం అవార్డు ఇస్తున్నారు. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. చారిటబుల్ ట్రస్టులు, ఎన్‌జీవోలతో కలిసి సుస్మిత చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది.
సుస్మితా
సేన్ 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన వనిత.
తరువాత సినీ రంగంలోనూ ప్రవేశించి తనకు కంటూ ప్రత్యేక గుర్తింపును
తెచ్చుకుంది. ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ భారత వాయు సేనలో
వింగ్ కమాండర్‌గా పని చేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు
డిజైనర్. హైదరాబాద్‌లో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది.
మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ఈ భామ ఆ తర్వాత ఎన్నో పేరు ప్రఖ్యాతలు
సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన
కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. సమయాన్ని అంతా నా ఇద్దరి పిల్లలతోనే
గడుపుతున్నాను. సినిమాల గురించి ఆలోచించడం లేదు. అయితే నటనకు ప్రాధాన్యం
ఉన్న పాత్రలు వస్తే మాత్రం చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్‌తో సుస్మితా
సేన్‌కి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె ఇక్కడే జన్మించారు. హైదరాబాద్‌కి
వచ్చిన ప్రతి సారి ఒక కొత్త అనుభూతికి లోనవుతారట.
పిల్లల దత్తత. గురించి
ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు పదకొండేళ్ల క్రితం రాణీ అనే చిన్నారిని దత్తత తీసుకున్న సుస్మితా సేన్. సంవత్సరం క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సివచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, మా మధ్య అది ఎప్పటికీ అడ్డుకాదంటోంది. దేశంలో చాలామందికి సుస్మితా సేన్ మాజీ విశ్వసుందరిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడామే ఇద్దరు కూతుళ్ళకు తల్లి. వాళ్ల బాధ్యతలను నిర్వర్తిస్తూనే, దేశ ప్రఖ్యాతిని ఖండాంతరాకు వ్యాప్తిచేసే మరో విశ్వసుందరిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది.
పెళ్లి గురించి
ఇప్పుడు
సుస్మిత వయసు 38 సంవత్సరాలు. లేటు వయసులో పెళ్లి చేసుకోవాలని
ముచ్చటపడుతోంది. ఇన్నాళ్లు పెళ్లి వద్దంటూ వచ్చింది. ఆ మాధ్య ఓ ఫంక్షన్‌లో
పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. సహా హీరోయిన్లంతా
మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టగా.. సుస్మితాసేన్ మాత్రం ఇప్పటికీ
అప్పుడప్పుడు లవ్ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది. పొడవాటి గౌను
వేసుకుని రాజకుమారిలా క్రైస్తవ పద్దతిలో మ్యారేజ్ చేసుకోవాలని ఉందని
తెలిపింది. తన తండ్రి కోరిక మేరకు తను భారతీయ సంప్రదాయ వివాహం కూడా
చేసుకుంటాను అని చెప్పింది. అయితే వరుడు ఎవరనే విషయం మాత్రం సుస్మిత
చెప్పడం లేదు.
సొంతంగా పలు సేవా సంస్థలు
ఇద్దరు ఆడపిల్లల దత్తత
2013 సంవత్సరానికి మధర్‌థెరిస్సా అవార్డు
మహిళలకు స్ఫూరిగా నిలుస్తున్న సుస్మిత
అందం అంటే రూపం ఒక్కటే కాదు నిరూపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కానీ విశ్వ సుందరీ కిరీటాన్ని గెలిచి సేవా కార్యక్రమాలే ధ్యేయంగా వాటిలో పాల్గొనడం అసాధ్యం. సుస్మితాసేన్ నేనున్నాను అంటూ ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. ఇంకా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లి కాకపోరుునా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఇది హర్షించదగిన విషయం. ఆడపిల్లలు అంటేనే బయపడుతున్న తల్లిదండ్రులు ఉన్న నేటి కాలంలో ఈమె దత్తత తీసుకున్న ఇద్దరూ ఆడపిల్లలే కావడం గమనార్హం. అందులో ఒకరి కోసం న్యాయపోరాటం కూడా చేసింది. మధర్‌థెరిస్సా అవార్డును అందుకున్న సందర్భంగా సుస్మితాసేన్ గురించి నేటి కలర్స్...
పిల్లల గురించి ప్రశ్నిస్తే మాత్రం ఆమె మాటలు నయాగరా జలపాతమే అవుతాయి. ఒకదాని వెంట ఒకటిగా గొలుసుకట్టు కబుర్లెన్నో లెక్కకు మించి చెప్తోంది ఆనందంగా. మా పెద్దదానికి సినిమాల పిచ్చి. టెలివిజన్ దొరికితే చాలు, ఇక వదిలి పెట్టదు. పాటల, వాటి నృత్యాలను అదేపనిగా పరిశీలిస్తూ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తుంది. నేను ఇంటికి చేరుకున్న తరువాత వాటిని గుక్క తిప్పుకోకుండా చెప్తూ, మళ్లీ అనుకరించి చూపించడం దానికి ఎంతో ఇష్టం అంటోంది సుస్మిత. ఇక రెండో కూతురు ఇప్పుడే నాకు అర్థమయ్యేలా లేదు. అదో చిచ్చర పిడుగు. దాన్ని క్రమశిక్షణలో పెట్టే పని నాకు చాలా పెద్దదే అంటోంది అలీషాను గుర్తు చేసుకుంటూ.
మథర్‌థెరిస్సా అవార్డు గురించి
ఈ ప్రపంచంలో ఆకలి అంటే తిండి కోసం మాత్రమే కాదు... సేవ(బ్యూటీ) కోసం కూడా... : మథర్‌థెరిస్సా ఆమె ఆశయ సాధన కోసం ప్రపంచాన్ని అందం(సేవ)గా తయారు చేయడం కృషి చేసిన వారికి కోసం అవార్డు ఇస్తున్నారు. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. చారిటబుల్ ట్రస్టులు, ఎన్‌జీవోలతో కలిసి సుస్మిత చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది.
పిల్లల దత్తత. గురించి
ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు పదకొండేళ్ల క్రితం రాణీ అనే చిన్నారిని దత్తత తీసుకున్న సుస్మితా సేన్. సంవత్సరం క్రితం అలీషా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అలీషా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సివచ్చింది. అయినా తను లెక్కచేయలేదు. వీరిని దత్తత బిడ్డలంటే మాత్రం సుస్మిత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. కంటేనే తల్లా? అని ఎదురు ప్రశ్నిస్తుంది. చట్టం కోసం దత్తత అన్న పదం తప్ప, మా మధ్య అది ఎప్పటికీ అడ్డుకాదంటోంది. దేశంలో చాలామందికి సుస్మితా సేన్ మాజీ విశ్వసుందరిగా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడామే ఇద్దరు కూతుళ్ళకు తల్లి. వాళ్ల బాధ్యతలను నిర్వర్తిస్తూనే, దేశ ప్రఖ్యాతిని ఖండాంతరాకు వ్యాప్తిచేసే మరో విశ్వసుందరిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది.
పెళ్లి గురించి
Courtesy-Surya
No comments:
Post a Comment