Wednesday, 23 October 2013

గోరింటాకు పెట్టుకోవడం వలన ప్రయోజనాలు:-

1)గోరింటాకు స్త్రీల సౌందర్యంలో భాగం.
2)పెళ్లి కాని మగువలు గోరింటాకు పెట్టుకోవడం వలన మంచి మొగుడు వస్తాడు అని నమ్మకం. మరియు పురాణాలలో కూడా వీటి గురించి చాల పెద్ద పెద్ద వ్యాసాలూ కూడా వున్నాయి.
3)పెళ్లి అయిన వారు గోరింటాకు పెట్టుకుంటే, ఎటువంటి కీడు సంభవించదు...దుష్ట శక్తుల ప్రవాహం తీవ్రత కూడా తగ్గుతుంది.
4) గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మ వ్యాధులని నిర్మూలించవచ్చు అని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.
5)శరీరంలో ఉన్న ఉష్ణాన్ని బయటకు పంపించి , చల్లదనంని కలుగ చేస్తుంది.
6)ఆషాడంలో గోరింటాకు చిగురిస్తుంది. అందువలన ఇటువంటి కాలంలో కొత్త కొత్త జబ్బులు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టే గొప్ప ఔశుధ గుణాలు కలిగిన గోరింటాకు అని చెప్పవచ్చును.
7)ఆ జబ్బులు కాలుష్యం వలన కావచ్చు, క్రిముల వలన కావచ్చు, వాటి అన్నింటినీ నిర్మూలించే గొప్ప ఔషుధం గోరింటాకు అని చెప్పవచ్చు.
గమనిక:- పట్టణాలలో గోరింటాకు చెట్లు లేని వాళ్ళు mehandi కూడా పెట్టుకోవచ్చు.

No comments:

Post a Comment