Thursday, 31 October 2013

ఫెంగ్ షూ : అభివృద్ధికి ఎరువు రంగు చిహ్నం

- శ్రీభావ

కాంతి, రంగులు- ఈ రెండూ లేకపోతే ఈ ప్రపంచం నిస్సారమే. అంతే కాదు. అసలు మానవ మనుగడే కాంతిపై ఆధారపడి ఉంది. ఆ కాంతే మనుషులకు శక్తిని ఇస్తుంది. అలాంటి కాంతి అనేక రంగుల మిశ్రమం. ఈ రంగులను విడదీస్తే వాటిలోని శక్తి కూడా విడిపోతుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఫెంగ్ షూ చెబుతుంది.

ఈ రంగులలోని శక్తిని , ఫెంగ్ షూలోని ఐదు ఎలిమెంట్స్ (అగ్ని, భూమి, లోహం, నీరు, చెక్క)ను కలిపితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ ఐదు ఎలిమెంట్స్‌లకు ఏఏ రంగులు ప్రాతినిధ్యం వహిస్తాయో, వాటి వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం.

1. అగ్ని- (అదనపు శక్తి కోసం)
ఎరుపు, నారింజ, పింక్, ముదురు పసుపు రంగులు అగ్నికి చిహ్నాలు. అగ్ని వల్ల అదనపు శక్తి లభిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంటికి దక్షిణ భాగంలో అగ్నికి ప్రాతినిధ్యం వహించే రంగులు వేస్తే - యజమానికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈశాన్యం, నైరుతి భాగాలలో అగ్ని రంగులు వేయటం వల్ల లైంగిక శక్తి ఉద్దీపనం చెందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వాత్సల్యం బాగా పెరుగుతుంది.

2. భూమి- (స్థిరత్వం, వృద్ధి కోసం)
లేత పసుపు, గోధుమ రంగు, మట్టి రంగు భూమికి చిహ్నాలు. భూమి స్థిరత్వాన్ని కలగజేస్తుంది. చక్కటి అనుబంధాలకు కారణమవుతుంది. శారీరక సమతౌల్యం కోసం ఉపయోగపడుతుంది. ఇంటికి ఈశాన్యం, నైరుతిలలో భూమి రంగులను ఉపయోగించాలి.

3. లోహం- (స్పష్టత, సామర్థ్యం కోసం)
దీని వల్ల ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. అనవసరపు ఆలోచనలు వేధించవు. తెలుపు, కాఫీ పొడి రంగులు దీనికి చిహ్నాలు. పడమర, ఉత్తర భాగాలలో లోహం రంగులను వాడటం వల్ల ఆలోచనలో స్పష్టత కలుగుతుంది. ఆఫీసులలో పై మూలలలో లోహపు రంగులు వేయటం వల్ల అనవసరపు చికాకులు కలగవు.

4. నీరు - (అన్నీ సమృద్ధిగా ఉండాలంటే)
ప్రతి రోజు తాజాగా, స్వచ్ఛంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. నలుపు, నీలం రంగులు దీని చిహ్నాలు. సమృద్ధిగా సంపద సమకూరాలంటే ఈ రంగులను ఇంటి ఉత్తర, తూర్పు భాగాలలో ఉపయోగించాలి. ఈ రంగులతో పాటు చిన్న చిన్న ఫౌంటెన్‌లను, అద్దాలను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

5. చెక్క (అభివృద్ధి)
ఫెంగ్ షూలో చెక్క అభివృద్ధికి చిహ్నం. సంపదకు, ఐశ్వర్యానికి, మంచి ఆరోగ్యానికి కూడా చెక్క చిహ్నం. బ్రౌన్, ఆకుపచ్చ రంగులు చెక్కకు ప్రాతినిధ్యం వహిస్తాయి. తూర్పు, దక్షిణ, ఆగ్నేయ భాగాలలో ఈ రంగులను ఉపయోగించటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. రంగులతో పాటు కొన్ని మొక్కలను ఈ భాగాలలో వాడాలి.

ఇంట్లో మొక్కలు పెట్టుకుంటే ఆక్సిజన్‌ను ఇస్తాయి. చెడు వాసనలు పీల్చుకుంటాయి. శక్తి ప్రసారంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని సరిచేస్తాయి. ఫెంగ్‌షూ సిద్ధాంతం ప్రకారం- కొన్ని రకాల మొక్కల వల్ల సంపద కలుగుతుంది. ఈ మొక్కలను 'మనీ ట్రీ' (డబ్బు మొక్క) అని పిలుస్తారు. సాధారణంగా ఫెంగ్‌షూలో క్రాసులా ఒవేటా (శాస్త్రీయ నామం- దీనినే జేడ్ ట్రీ అని కూడా పిలుస్తారు) అనే మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పచీరా ఎక్విటికా అనే మొక్కను కూడా ఇంట్లో పెంచుతారు. దీనికి అనేక కాండాలు, ఆకులు ఉంటాయి
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment