ఆడవారికి 45-50 ఏళ్లు దాటిన తరువాత మెనోపాజ్ సమస్య మొదలవుతుంది. బహిష్టు ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాత శరీరంలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్టు ఉంటుంది. ఉత్సాహం కోల్పోయి కుంగిపోతారు. కొంతమందికి కోపం ఎక్కువవుతుంది. ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, యోగాసనాల వల్ల మెనోపాజ్ సమస్య నుంచి చాలావరకు బయటపడొచ్చు.
అనులోమ విలోమ ప్రాణాయామం
చాప మీద వజ్రాసనంలో కూర్చుని ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టాలి. కుడిచెయ్యి ఉంగరం వేలితో ముక్కు ఎడమవైపు బంధించి కుడి రంధ్రం ద్వారా గాలిని పూర్తిగా వదిలెయ్యాలి. మళ్లీ కుడివైపు నుంచి శ్వాస తీసుకుని ఎడమవైపు నుంచి వదిలెయ్యాలి. ఇలా పదిసార్లు చేసి ఆపేసిన తర్వాత కుడి చెయ్యి చిన్ముద్రలో పెట్టి ఎడమచెయ్యి నాసికాముద్రలో ఉంచి ముందు చేసిన విధంగానే పదిసార్లు చెయ్యాలి. ఇది ముగిసిన తర్వాత రెండు చేతులు చిన్ముద్రలో పెట్టి ముక్కు రెండు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ విడిచిపెడుతూ ధ్యాసను శ్వాస మీద పెట్టాలి.
చిన్ముద్ర : బొటనవేలు చూపుడువేలు కలిపి, మిగిలిన మూడు వేళ్లు తిన్నగా పెట్టడం.
గమనిక : ప్రాణాయామం 21 రోజులు చేస్తే మనలో చాలా మార్పు వస్తుంది. ప్రతిరోజు అరగంటపాటు ప్రాణాయామం చేసే వ్యక్తి జీవితకాలం పెరుగుతుంది. ఎక్కువరోజులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు.
సర్వాంగాసనం, హలాసనం
చాపమీద వెల్లకిలా పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లూ పైకి లేపాలి. ఈ స్థితిలో తల, మెడ నేలకు ఆనుకుని మిగిలిన శరీరం గాల్లో పైకి లేస్తుంది. రెండు కాళ్లు దగ్గరగా పెట్టి అరికాళ్లు, వేళ్లు ఆకాశంవైపు చూసేలా ఉండాలి. దీన్ని సర్వాంగాసనం అంటారు. కళ్లు కాలి వేళ్లను చూస్తూ కొద్దిసేపున్నాక, నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్లను తల వెనక్కు తీసుకువెళ్లి నేలకు ఆనేలా పాదాలు తాకించాలి. రెండు చేతులు నడుము కింది భాగంలో బోర్లించి పెట్టాలి. ఇలా మూడు నిమిషాలున్నాక గాలి తీసుకుంటూ హలాసనంలో నుంచి సర్వాంగాసనంలోకి వచ్చి గాలి వదులుతూ కాళ్లు యథాస్థానంలోకి తీసుకొచ్చి కాసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఆహారం : ప్రతి రెండు గంటలకు సమతుల ఆహారం తీసుకోవాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సరైన సమయానికి మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సలాడ్, డ్రైఫ్రూట్, పళ్లు, కూరగాయల జ్యూస్, సూప్ వంటివి మనం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా మెనోపాజ్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment