దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసు తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం లైంగిక అత్యాచారాల చట్టంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇవి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల లైంగిక అత్యాచారాల కేసుల్లో కఠినమైన శిక్షలు విధించే అవకాశం కలిగింది. వీటిలో కొన్ని ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం..
- 376, 377- ఇలా భారత శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లలో మార్పులు జరిగాయి. శిక్షలు మరింత కఠినతరమయ్యాయి.
- లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. గతంలో ఎప్పుడైనా ఈ తరహా నేరాలకు పాల్పడితే వారికి మరణశిక్ష కూడా విధించవచ్చు.
- మహిళల వెంటపడి పదేపదే వేధించటం, రహస్యంగా వారి జీవితాలలోకి చొరబడటం(వోయరిజం) వంటి నేరాలను తీవ్రంగా పరిగణిస్తారు. మొదటి సారి ఈ తరహా నేరం చేస్తే అది బెయిలబుల్ నేరమే. రెండో సారి నుంచి అది నాన్‌బెయిలబుల్ నేరంగా మారుతుంది.
- యాసిడ్ దాడులు చేసేవారికి కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
- స్వచ్ఛందంగా లైంగిక చర్యకు అంగీకరించటానికి తగిన వయస్సును 18ఏళ్లుగా ఈ చట్టం నిర్దేశించింది. ఇంత కన్నా తక్కువ వయస్సు ఉన్న స్త్రీతో లైంగిక చర్యలో పాల్గొంటే దానిని అత్యాచారంగా పరిగణిస్తారు.
Courtesy-andhrajyothy
Courtesy-EEnadu

No comments:
Post a Comment