అంతా బాగుంటే మన దేశం తరపున క్రికెట్ ఆడాల్సిన అమ్మాయి ప్రీతి శ్రీనివాసన్. ప్రమాదవశాత్తు ఆమె వెన్నెముకకైన గాయం ఆమెను చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయినా ధైర్యం కోల్పోకుండా తన వంటి మహిళలకు అండదండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె 'సోల్ ఫ్రీ' అనే సంస్థను ఈమధ్యే ప్రారంభించింది. ఆమెతో 'నవ్య' ఫోన్‌లో మాట్లాడింది.
హాయ్ ప్రీతి, మీ బాల్యం గురించి చెప్పండి.
మా అమ్మానాన్నలకు పెళ్లయిన తొమ్మిదేళ్లకు నేను పుట్టాను. పుట్టింది చెన్నైలోనే అయినా మా నాన్న ఉద్యోగరీత్యా ఏడాదికో చోటకు మారారు. దానివల్ల నేను పదో తరగతి అమెరికాలో పూర్తి చేసేనాటికి మూడు ఖండాల్లోని తొమ్మిది స్కూళ్లలో చదివాను!
మీకు క్రికెట్ అంటే ఇష్టం ఎలా ఏర్పడింది?
1983 ప్రపంచ కప్పు పోటీలప్పుడు నాకు క్రికెట్‌తో పరిచయమయింది. అప్పటికి నాకు నాలుగేళ్లే. కాని వివియన్ రిచర్డ్స్ ఆడుతుంటే చూడటం బాగుండేది. ఆ ఇష్టం క్రమంగా పెరిగింది. ఏడేళ్ల వయసులో నేను క్రికెట్ క్యాంపుకెళ్లాను. అక్కడ 300 మంది అబ్బాయిలుండేవారు. బంతిని గట్టిగా కొట్టే నన్ను చూసి నాకు బౌలింగ్ చెయ్యడానికే భయపడేవారు. మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ చేసేదాన్నిగాని నెమ్మదిగా లెగ్ స్పిన్నర్‌గా మారాను. నేనెంత బాగా ఆడేదాన్నంటే, ఎనిమిదేళ్ల వయసుకే తమిళనాడు రాష్ట్ర జట్టులో ఆడే అవకాశం వచ్చింది. అంత చిన్న వయసులో అలాంటి అవకాశం మరొకరికి దక్కలేదనే అనుకుంటాను. మరీ చిన్నపిల్లనని మా జట్టులోని వాళ్లంతా నన్ను గారాబంగా చూసేవారు. క్రికెట్ ఆడేందుకు వివిధ ప్రదేశాలకు రైలు ప్రయాణాలు చెయ్యడాన్ని మర్చిపోలేను.
మీ తల్లిదండ్రులకు స్పోర్ట్స్ నేపథ్యం ఉందా?
మా నాన్నకు మంచి స్విమ్మర్ అవాలనే కోరిక ఉండేదట. కనీసం నేనైనా ఆ లక్ష్యాన్ని అందుకోవాలని నన్ను మూడేళ్లకే ఈతలో చేర్పించారు. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం అందుకున్నాను. ఈతంటే నాకు పెద్ద ఇష్టమేం ఉండేది కాదుగాని దాని వల్ల నా భుజ కండరాలు చాలా బలంగా తయారయ్యాయి. అది నాకు క్రికెట్లో చాలా ఉపయోగపడింది.
పదహారేళ్లకే మీరు 'హూ ఈజ్ హూ'లో స్థానం సంపాదించారట?
అవును. మా కుటుంబం ఇక్కణ్నుంచి ఇతర దేశాలకు వెళ్లడంతో నా క్రికెట్ ప్రాక్టీసు తగ్గింది కాని ఈత మాత్రం కొనసాగింది. నేను పన్నెండో తరగతిలో ఉండగానే అమెరికాలోని 'హూ ఈజ్ హూ' జాబితాలో స్థానం సంపాదించుకున్నాను.
స్వదేశానికి ఎప్పుడొచ్చారు?
మా అమ్మానాన్నలను అమెరికాలోనే వదిలి 1997లో క్రికెట్ కోసం నేను మన దేశానికి తిరిగి వచ్చేశాను. చెన్నైలో ఐదేళ్ల కన్సాలిడేటెడ్ ఎంబీయే కోర్సులో చేరి ప్రాక్టీసు కొనసాగించాను. అప్పుడే అండర్ 19 జట్టుకు నేతృత్వం వహించే అవకాశం వచ్చింది. మరో రెండేళ్లలో దేశ జట్టులో చోటు దక్కించుకునేదాన్నే. కానీ విధి నా కోసం మరోలా ప్రణాళికలు వేస్తోందని నాకేం తెలుసు?
ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది?
1998 జూలై 7 న జరిగింది. మరో వారంలో మా కాలేజీ తెరుస్తారనగా విద్యార్థులంతా కలిసి పాండిచ్చేరి పిక్నిక్‌కు వెళ్లాం. బీచ్‌లో అందరం ఆడుతుండగా బలమైన కెరటం ఒకటి నన్ను చుట్టుముట్టింది. నేను పట్టు తప్పి పడిపోయాను. నేను ఈదాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ముఖం నీళ్లలోకి వెళ్లగానే నా శరీరమంతా షాక్‌కు గురైంది. అంతే. నాకు దెబ్బలేం తగల్లేదు, నెత్తురు చిందలేదు, బలమైన వస్తువునేమీ ఢీకొట్టలేదు, నేను స్పృహ కూడా తప్పలేదు. నిజానికి నాకు ఎలాంటి ప్రథమ చికిత్సనందించాలో నేనే మా స్నేహితులకు సూచించాను. కానీ నీటిలో పడిన క్షణమే నా మెడ విరిగిపోయిందని నాకు తెలియదు. మా బృందంలో ఒకరి తండ్రి వైద్యుడు కావడంతో వెంటనే అంబులెన్స్ పంపి పాండిచ్చేరిలోని జిప్‌మర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ నా మెడకో కాలర్ వేసి చెన్నైలోని అపోలోకు తరలించారు. కొన్నాళ్లకు నాకు నయమైపోతుందని, నేను మునుపట్లాగా హాయిగా తిరగ్గలుగుతానని అనుకున్నాను. కాని జరిగింది వేరు.
తర్వాత ఏమైంది?
మెడ కూడా తిప్పలేకుండా అయిపోయిన స్థితిలో మా నాన్న నన్ను షికాగో తీసుకెళ్లిపోయారు. మరో రెండు నెలల తర్వాత చక్రాల కుర్చీలో ఇంటికొచ్చాను. నాకు ప్రమాదం జరిగిన రెండేళ్లకు మా నాన్న తన ఉద్యోగం వదిలేశారు. 2000 సంవత్సరంలో మా కుటుంబం తిరువణ్ణామలైకి మకాం మార్చింది. బాహ్య ప్రపంచంతో మా సంబంధాన్ని తెంపేసుకుని సన్యాసుల్లాగా బతకటం మొదలెట్టాం. అయినా 'చూడు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు.. నీవల్ల మా బతుకూ ఇలాగైంది...' అని నా తల్లిదండ్రులు ఒక్కరోజు కూడా నన్ను నిందించలేదు.
ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది?
నాకెంతో ధైర్యాన్నిచ్చిన మా నాన్న 2008లో తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. తర్వాత రెండే ళ్లు మేమెంత కష్టపడ్డామో మాటల్లో చెప్పలేను. మా అమ్మక్కూడా ఈమధ్యనే గుండె ఆపరేషన్ జరిగింది. తను లేకపోతే నేనేమయిపోతానో అని అమ్మ బెంగ. నిజం చెప్పాలంటే నాకూ అదే బెంగ. ఇప్పుడు భవిష్యత్తు నా ముందు పెద్ద ప్రశ్నార్థకంగా నిలబడింది.
'సోల్ ఫ్రీ' గురించి చెప్పండి.
నేను మృత్యుముఖంలోకి వె ళ్లొచ్చి కూడా బతికున్నానంటే నా జీవితానికేదో లక్ష్యం ఉందనిపిస్తుంది. దీర్ఘకాలం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే నావంటి వారికి తగిన కేర్ సెంటర్లు మన దేశంలో తగినన్ని లేవు. అది ఆలోచించి నేను 'సోల్‌ఫ్రీ' సంస్థను ప్రారంభించాను. నాలాగా వెన్నెముకకు గాయమై మూలబడిన గ్రామీణ మహిళలు ఎందరున్నారో గుర్తించడం మొదలుపెట్టాను. వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. సొంత కుటుంబమే వాళ్లను నానా మాటలూ అంటుంది, ఆత్మహత్య చేసుకుని చనిపోయే దశకు తీసుకొస్తుంది. డేటాబేస్ ఒకటి తయారయ్యాక వాళ్ల గురించి ఏం చెయ్యాలో ఆలోచించాలి. ఇటువంటి రోగులకు సాయపడటానికి సిద్ధంగా ఉన్న వలంటీర్లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టుల జాబితా కూడా రూపొందించాలి. వెన్నెముక గాయాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం నా మొదటి పని. వెన్నెముక గాయం అరక్షణంలో అవుతుంది, ఆ తర్వాత జీవితమంతా చచ్చుబడిపోతుంది.
ఎలాంటి సాయం చెయ్యాలని మీ ఆలోచన?
వెన్నెముక గాయంతో మూలబడిన స్త్రీలకు కనీసమైన నాణ్యతతో కూడిన జీవితాన్ని అందించాలని నా కోరిక. నాకు కుదిరినంతలో వాళ్లకు ఆర్థిక స్థిరత్వం, ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. స్వరం తప్ప మిగిలిన శరీరమంతా చచ్చుబడిపోయిన వాళ్లు సైతం కాల్‌సెంటర్లు, ఆడియో పుస్తకాలు, రేడియో మొదలైన వాటిల్లో పనిచేయవచ్చు. ఇన్ని అవకాశాలున్నా సమాజం మాత్రం మమ్మల్ని తక్కువగానే చూస్తోంది. మద్రాసు యూనివర్సిటీ ద్వారా దూరవిద్యలో చదువుదామనుకుంటే వాళ్లు నా వైకల్యం వల్ల సీటు ఇవ్వం పొమ్మన్నారు. వెన్నెముక గాయాన్ని వైకల్యంగా ప్రభుత్వం గుర్తించడమే లేదు. దాన్ని ముందు సాధిస్తే తర్వాత ఎన్నో చెయ్యొచ్చు.
'సోల్ ఫ్రీ' పేరెందుకు పెట్టారు?
గాయం వల్ల మేం మా శరీరాల్లో బంధితులమైపోయామేమోగాని మా ఆత్మ మాత్రం స్వేచ్ఛగా ఉంది కదా. ఆత్మబలంతో మేమేదైనా చెయ్యగలం. 'నాకే ఎందుకిలా జరిగింది' అనుకునే స్థాయి నుంచి 'నేనెందుకు చెయ్యకూడదు' అన్న స్థాయికి వచ్చాన్నేను. చాలామంది కన్నా నేనెంతో జీవితేచ్ఛతో ఉన్నాను. చుట్టూ ఉన్న ఎంతో అందాన్ని చూస్తున్నందుకు గొప్పగా అనిపిస్తుంది. నా జీవితాన్ని చూశాకయినా సమాజం నావంటి వారిని తగిన విధంగా గుర్తించడ ం నేర్చుకుంటుందేమో. ఆ ప్రయత్నంలో 'సోల్ ఫ్రీ' ఒక ముందడుగు.
వెబ్‌సైట్ :http://www.soulfree.org/
09952656756
ఫోన్ ఇంటర్వ్యూ : అరుణ పప్పు
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment