పాత్రల్ని తోమే స్క్రబ్బర్ ఎంత లేదన్నా ఇరవై నుంచి యాభై రూపాయలు ఉంటోంది. ఎంత మంచివి కొన్నా నెల రోజులకంటే ఎక్కువ పనిచేయవు. ఆ తర్వాత పాడైపోతాయి. ఇలా ప్రతిసారీ షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా ఇంత రేటు పెట్టి కొనే బదులు...వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్‌లలో పళ్లు, కూరగాయలు, కొన్నిరకాల పదార్థాల్ని కొన్నప్పుడు దోమతెరకు వాడే గుడ్డతో తయారుచేసిన చిన్నపాటి సంచుల్ని ఇస్తుంటారు. సరుకుల్ని ఇంటికి తెస్తూనే వీటిని డస్ట్‌బిన్‌లో పడేయడం సహజం. కాని ఇప్పటి నుంచి అలా చేయకండి. అవి కూడా పనికొస్తాయి. వాటితో పాత్రల్ని తోమే స్క్రబ్బర్స్‌ను తయారుచేసుకోవచ్చు. చిన్న సంచుల్ని నాలుగైదు మడతలు పెట్టి.. అందులో పనికిరాని స్పాంజ్‌ను పెట్టండి. మూడువైపుల మడతపెట్టి నాలుగోవైపు దారంతో కుట్టండి. స్క్రబ్బర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎంతలేదన్నా రెన్నెళ్లు వాడొచ్చు. అంతలోపు మరోసారి షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి బ్యాగ్‌లు పట్టుకొచ్చి.. మళ్లీ వీటిని తయారుచేసుకోండి. ఈ సంగతి అలా ఉంచితే- బయట మార్కెట్‌లో దొరికే స్క్రబ్బర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇనుప ఇగురుతో చేసిన వాటిని వాడటం ఉత్తమం కాదు. వాటితో పాత్రల్ని శుభ్రం చేయగా అడుగున కొన్ని ఇనుప తీగలు అలాగే అంటుకుని ఉండిపోతాయి. వాటిని గమనించకుండా.. ఆ పాత్రలతో వంట చేసుకోవడం వల్ల.. తినేతిండితోపాటు మన శరీరంలోకీ వెళ్లిపోతాయి అవి. అది ఆరోగ్యానికే ప్రమాదకరం.
Courtesy-Andhrajyothy
Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment