Online లో ఆధార్ కార్డుని మీ Gas ఎకౌంటు కి లింక్ చేసేదేలా?
మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా
చేసుకోండి. Online లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్
చేసుకోవచ్చు.
Online లో లింక్ చేసే విధానం:
Online లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్
కార్డు ని లింక్ చేయండి.సులభమైన 4 steps follow అయితే చాలు. మీ ఫ్రెండ్స్ /
బంధువులకి కూడా చేసిపెట్టండి .
ఇలా చేయండి :
ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .
https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx
Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి
Step 2: Choose Benefit Type లో ... Benefit Type - (LPG)
Scheme Name - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి
Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని
లిస్టు నుండి ఎంచుకోండి. మీ గ్యాస్ పుస్తకంపై లేదా రసీదుపై ఏజెన్సీ పేరు
ఉంటుంది.
Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి
Step 3: మీ వివరాలు:
Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమీ కాదు )
Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి.
మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో ఇవ్వబడిన మొబైల్ కు OTP
నంబర్ మెసేజ్ పంపబడుతుంది. మీ ఈ మెయిల్ కు కూడా మెసేజ్ వస్తుంది.
Step 4: Confirm Request
మీ మొబైల్ కి/ఈ మెయిల్ కి వచ్చిన OTP నెంబర్ ని "Enter the text shown" దగ్గర నెంబర్ ఎంటర్ చేయండి .
Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది .
మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబంధించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు .
తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు
(మీ స్నేహితులకోసం ఈ పోస్ట్ share చెయ్యండి)
No comments:
Post a Comment