Sakshi | Updated: November 13, 2013 00:10 (IST)
వంటగదిలో వాడని వస్తువుల జాబితాలో మొదటిస్థానం పింగాణీ జాడీలదే. పారేద్దామని బయటపెట్టినా కూడా జాడీతోపాటు ముడిపడిన జ్ఞాపకాలు మనసుని పట్టి వెనక్కు లాగేస్తాయి. ఆ జాడీలకు ఓ అందమైన రూపం తీసుకువచ్చి, వాటిలో మొక్కలను నాటి, ఇంటి మూలలలో అందంగా అమరిస్తే, ఇంటికిఆకర్షణీయమైన లుక్ వచ్చేస్తుంది.
ఇక్కడ కనిపిస్తున్న పూలకుండీలను ఒకసారి గమనించండి. ఇందులో ఏదీ ఖరీదైన వస్తువు కాదు. కొనాల్సిందల్లా రెండు, మూడు రంగు డబ్బాలు, నాలుగు షేడ్‌లలో రంగుల కాగితాలే.
ఇంట్లో వాడకుండా మూలన పడి ఉన్న పాత కూజాలు, జాడీలు, కుండీలు తీసుకుని, వాటికి అందంగా రంగులేసి, అందులో తగినంత మట్టి వేసి, మొక్కలను నాటండి.
ఆ అందమైన మొక్కలను ఒక్కో మొక్కను ఒక్కోరోజు డ్రాయింగ్‌రూమ్‌లో పెట్టుకోవాలనే ముచ్చట కలుగుతుంది. మొక్క అందంగానే ఉంది కానీ ఈ కుండీలని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టడం ఎలా... అని నిరాశ కూడా ఆ వెంటనే కలుగుతుంది. ఈ సమస్యను రంగుల కాగితాలతో పరిష్కరించుకోవచ్చు. కుండీకి రంగుకాగితాలను అతికిస్తే ఆకర్షణీయమైన కుండీ తయారవుతుంది.
No comments:
Post a Comment